Aadhaar in Google Wallet: గూగుల్ వాలెట్‌లో ఆధార్ కార్డ్.. ఇకపై ఫిజికల్ కార్డుతో పనిలేదు.. ఇదిగో సింపుల్ టిప్స్..!
Aadhaar in Google Wallet: భారతదేశంలో అత్యంత కీలకమైన గుర్తింపు పత్రం ఆధార్ కార్డు ఇప్పుడు మరింత స్మార్ట్‌గా మారనుంది.
Aadhaar in Google Wallet
Aadhaar in Google Wallet: ప్రస్తుత ఆధునిక కాలంలో స్మార్ట్‌ఫోన్ అనేది మనిషి జీవితంలో విడదీయలేని భాగమైంది. దీనిని దృష్టిలో ఉంచుకుని గూగుల్ తన వాలెట్ యాప్‌లో ఆధార్ వివరాలను పొందుపరిచే సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. గూగుల్, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా వినియోగదారులు తమ ఫోన్‌లోనే డిజిటల్ ఆధార్‌ను భద్రపరుచుకోవచ్చు. దీనివల్ల విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో భౌతిక కార్డును చూపించాల్సిన అవసరం ఉండదు. కేవలం ఫోన్ ద్వారానే వేగంగా ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
గోప్యతతోపాటు భద్రతకు పెద్దపీట..
చాలా సందర్భాల్లో కేవలం వయసును నిరూపించడానికి మాత్రమే ఆధార్ అవసరమవుతుంది. అటువంటప్పుడు పూర్తి ఆధార్ వివరాలను ఇతరులకు వెల్లడించడం వల్ల గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉంది. గూగుల్ వాలెట్ దీనికి చక్కని పరిష్కారం చూపుతోంది. అవసరమైన చోట పూర్తి వివరాలను కాకుండా కేవలం వయసును మాత్రమే ధ్రువీకరించే వెసులుబాటును ఇది కల్పిస్తుంది. ప్రస్తుతం పీవీఆర్ ఐనాక్స్ వంటి సినిమా థియేటర్లలో వయసు ధ్రువీకరణకు, భారత్ మ్యాట్రిమొనీ వంటి వేదికల్లో గుర్తింపు కోసం దీనిని వినియోగించుకోవచ్చు. భవిష్యత్తులో మైగేట్ వంటి గృహ సముదాయాల నిర్వహణ యాప్‌లకు కూడా ఈ సేవలను విస్తరించనున్నారు.
వాలెట్‌లో ఆధార్‌ను పొందుపరిచే విధానం..
గూగుల్ వాలెట్‌లో ఆధార్‌ను చేర్చుకోవడం అత్యంత సులభమైన ప్రక్రియ. వినియోగదారులు ఈదశలను ఫాలో చేసి డిజిటల్ కార్డును పొందవచ్చు:
ముందుగా మీ ఫోన్‌లో గూగుల్ వాలెట్ యాప్‌ను తాజా వెర్షన్‌కు అప్ డేట్ చేసుకోవాలి.
యాప్‌ను ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కనిపించే ప్లస్ (+) గుర్తు లేదా 'యాడ్ వాలెట్' అనే బటన్‌ను నొక్కాలి.
అందులో కనిపించే జాబితా నుంచి 'గుర్తింపు కార్డు' లేదా 'ఆధార్ కార్డు' అనే ఆఫ్షన్ ఎంచుకోవాలి.
తదుపరి దశలో మీ ఆధార్ సంఖ్యను నమోదు చేయాలి. అప్పుడు మీ ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ సంఖ్యకు ఒక రహస్య కోడ్ (ఓటీపీ) వస్తుంది.
ఆ కోడ్‌ను యాప్‌లో నమోదు చేయగానే మీ వివరాలు డిజిటల్ రూపంలో వాలెట్‌లో చేరిపోతాయి.
మరో పద్ధతిలో, ఆధార్ అధికారిక యాప్‌లోని 'షేర్ ఐడీ' అనే సదుపాయం ద్వారా కూడా గూగుల్ వాలెట్‌కు మీ వివరాలను పంపవచ్చు. ఈ విధానం వల్ల డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉండదు. అత్యంత సురక్షితంగా ఉంటుంది.




