Huawei Mate XT 2.. 3.5mm స్లిమ్ డిజైన్‌తో ట్రై-ఫోల్డ్ ఫోన్.!

ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లవర్స్ కోసం ప్రముఖ టెక్ దిగ్గజం Huawei సరికొత్త సంచలనానికి సిద్ధమైంది. తన మోస్ట్ అవెయిటెడ్ 'Huawei Mate XT 2'..

G Krishna
Published on: 6 Sept 2026 2:03 PM IST
Huawei Mate XT 2
X

Huawei Mate XT 2

ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లవర్స్ కోసం ప్రముఖ టెక్ దిగ్గజం Huawei సరికొత్త సంచలనానికి సిద్ధమైంది. తన మోస్ట్ అవెయిటెడ్ 'Huawei Mate XT 2' ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 7న చైనా మార్కెట్లో అఫిషియల్‌గా లాంచ్ చేయనుంది. చైనా టైమ్ ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు (మన ఇండియన్ టైమ్ ప్రకారం మధ్యాహ్నం 12:00 గంటలకు) ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇదే వేదికపై కంపెనీ తన నెక్స్ట్ జనరేషన్ 'HarmonyOS 7' ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా యూజర్ల కోసం రోలవుట్ చేసే ఛాన్స్ ఉంది.

కొత్త Wing Fold డిజైన్ తో పర్ఫెక్ట్ ప్రొటెక్షన్

ఈ కొత్త మోడల్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దీని ఫోల్డింగ్ మెకానిజమ్ గురించి. కంపెనీ ఇందులో 'Wing Fold' టెక్నాలజీని వాడుతోంది. అంటే డిస్‌ప్లేకి సంబంధించిన రెండు వైపుల భాగాలు లోపలి వైపు మడతపడతాయి. దీనివల్ల ఫోన్ ఫోల్డ్ చేసినప్పుడు ఇన్నర్ స్క్రీన్ దెబ్బతినకుండా చాలా సేఫ్‌గా ఉంటుంది. ఇక బయటి వైపు ఉండే డిస్‌ప్లేలో క్విక్ అన్‌లాకింగ్ కోసం 3D Face Recognition సపోర్ట్ ఇవ్వనున్నారని టాక్.

స్లిమ్ డిజైన్: కేవలం 3.5mm మందం

డిజైన్ పరంగా హువావే ఇంజనీరింగ్ అద్భుతాన్ని ప్రదర్శించింది. ఈ ఫోన్‌ను పూర్తిగా అన్‌ఫోల్డ్ చేసినప్పుడు అత్యంత పలుచని భాగం కేవలం 3.5mm మందంతో మాత్రమే ఉంటుంది. ట్రై-ఫోల్డ్ కేటగిరీలో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యంత స్లిమ్ , ప్రీమియం డివైజ్‌లలో ఇది ఒకటిగా నిలవనుంది.

16GB RAM.. ఏకంగా 2TB స్టోరేజ్

ప్రీ-ఆర్డర్ లీక్స్ ప్రకారం ఈ ఫోన్ మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. బేస్ మోడల్ 16GB RAM + 512GB స్టోరేజ్‌తో రానుండగా, మైండ్ బ్లావింగ్ టాప్-ఎండ్ మోడల్‌ను 16GB RAM + 2TB భారీ స్టోరేజ్‌తో తీసుకురానున్నారు. ఈ టాప్ మోడల్‌లో సెక్యూరిటీ కోసం ప్రైవసీ డిస్‌ప్లే, రాయడానికి స్టైలస్ (Stylus) సపోర్ట్ కూడా అందిస్తున్నారు.

మూడు అట్రాక్టివ్ కలర్స్

ఈ ఫోన్ Obsidian Black, Pure White, Jin Purple కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే కేవలం 2TB స్టోరేజ్ ఉన్న టాప్ మోడల్‌ను మాత్రం సిగ్నేచర్ Purple కలర్ వేరియంట్‌లో మాత్రమే అందించనున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. పెర్ఫార్మెన్స్ విషయంలో రాజీ పడకుండా ఇందులో Kirin 9050 Pro ప్రాసెసర్‌ను జత చేయనున్నారని సమాచారం. ఫోల్డబుల్ స్క్రీన్స్ ఎక్కువ పవర్ తీసుకుంటాయి కాబట్టి, రోజంతా నిరాటంకంగా పనిచేసేలా 6000mAh మాసివ్ బ్యాటరీని అమర్చారు. ట్రై-ఫోల్డ్ ఫోన్లలో హింజ్ ఎంత బలమైనదైతే ఫోన్ లైఫ్ అంత ఎక్కువ ఉంటుంది. అందుకనే గత మోడల్ తో పోలిస్తే ఈసారి డ్యూరబిలిటీని, ఫోల్డింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత స్మూత్‌గా మార్చేందుకు హింజ్ క్వాలిటీని భారీగా అప్‌గ్రేడ్ చేశారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story