Huawei Nova 16: 200MP కెమెరా.. 7000mAh బ్యాటరీ.. హువావే కొత్త ఫోన్ల హవా..!
Huawei Nova 16 : ప్రముఖ చైనీస్ టెక్నాలజీ దిగ్గజం హువావే తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. చైనాలో జరిగిన ఒక ప్రత్యేక ఈవెంట్‌లో..
huawei-nova-16
Huawei Nova 16 : ప్రముఖ చైనీస్ టెక్నాలజీ దిగ్గజం హువావే తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. చైనాలో జరిగిన ఒక ప్రత్యేక ఈవెంట్‌లో ‘హువావే నోవా 16 ప్రో’ , ‘హువావే నోవా 16 అల్ట్రా’ మోడళ్లను కంపెనీ అధికారికంగా ఆవిష్కరించింది. వీటితో పాటు స్టాండర్డ్ నోవా 16, నోవా 16జెడ్ మోడళ్లను కూడా కంపెనీ తీసుకొచ్చింది. ఈ కొత్త ఫోన్లలో అత్యంత శక్తివంతమైన కిరిన్ 9010ఎస్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ , నెక్స్ట్-లెవెల్ కెమెరా ఫీచర్లను అందించారు.
ధరల వివరాలు
ధరల విషయానికి వస్తే హువావే నోవా 16 ప్రో మోడల్ బేస్ వేరియంట్ అయిన 12GB ర్యామ్ , 256GB స్టోరేజ్ ధర సుమారు 54,000 రూపాయలుగా ఉంది. అలాగే ఇందులోనే 512GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు 61,000 రూపాయలుగా , టాప్ ఎండ్ 1TB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు 68,000 రూపాయలుగా నిర్ణయించారు. ఈ ఫోన్ క్లియర్ బ్లూ, ఇరిడెసెంట్ పెర్ల్, స్కై వైట్ , స్టారీ నైట్ బ్లాక్ రంగులలో లభిస్తుంది.
మరోవైపు మరింత ప్రీమియం ఫీచర్లతో వచ్చిన హువావే నోవా 16 అల్ట్రా మోడల్ ప్రారంభ ధర సుమారు 65,000 రూపాయలుగా ఉంది. దీని 512GB వేరియంట్ ధర సుమారు 72,000 రూపాయలు కాగా, అత్యధిక స్టోరేజ్ కలిగిన 1TB వేరియంట్ ధర సుమారు 81,000 రూపాయలుగా ఉంది. ఈ అల్ట్రా మోడల్ క్లియర్ బ్లూ, స్కై వైట్ , స్టారీ నైట్ బ్లాక్ రంగులలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.
హువావే నోవా 16 ప్రో ప్రత్యేకతలు
నోవా 16 ప్రో స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హార్మొనీ ఓఎస్ 6.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 1Hz నుండి 120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్ కలిగిన 6.84-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ ఎల్టీపీーఓ డిస్‌ప్లేను అమర్చారు. దీనికి కున్లున్ గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. హువావే సొంత కిరిన్ 9010ఎస్ చిప్‌సెట్‌తో రన్ అయ్యే ఈ ఫోన్ వెనుక భాగంలో నాలుగు కెమెరాల సెటప్ ఉంది. అందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉన్న 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 3.7x ఆప్టికల్ జూమ్ ఉన్న 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ మాక్రో లెన్స్ , రెడ్ మేపుల్ కలర్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్‌లో 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 7,000mAh భారీ బ్యాటరీని అందించారు. వై-ఫై 7, బ్లూటూత్ 6, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో పాటు ధూళి, నీటి నుండి రక్షణ కోసం దీనికి ఐపీ65 రేటింగ్ ఇచ్చారు.
హువావే నోవా 16 అల్ట్రా అడ్వాన్స్‌డ్ ఫీచర్లు
హువావే నోవా 16 అల్ట్రా మోడల్ కూడా దాదాపు ప్రో మోడల్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్, ప్రాసెసర్, డిస్‌ప్లే , సెల్ఫీ కెమెరా ఫీచర్లనే కలిగి ఉంది. అయితే కెమెరా విభాగంలో మరికొంత ఖచ్చితత్వం కోసం దీని ముందు భాగంలోని 50MP కెమెరాకు అదనంగా రెడ్ మేపుల్ కలర్ సెన్సార్‌ను జత చేశారు. వెనుక వైపు కెమెరా సెటప్ ప్రో మోడల్ లాగే ఉంటుంది. ఛార్జింగ్ పరంగా ఈ అల్ట్రా మోడల్‌లో 7,000mAh బ్యాటరీ , 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు అదనంగా 50W వైర్‌లెస్ ఛార్జింగ్ , 7.5W వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందించడం విశేషం. అంతేకాకుండా రక్షణ విషయంలో ఈ ఫోన్ ఒక అడుగు ముందే ఉంది. నీటిలో పూర్తిగా మునిగినా కూడా పాడవకుండా ఉండేలా దీనికి అత్యుత్తమ ఐపీ68 , ఐపీ69 రేటింగ్‌లను ఇచ్చారు.




