వాట్సప్ వెబ్ వాడుతున్నారా..? ప్రభుత్వం సీరియస్ వార్నింగ్.. ఎందుకంటే?
WhatsApp Web Alert: ఆఫీస్ కంప్యూటర్లు, పబ్లిక్ సిస్టమ్‌లలో వాట్సాప్ వెబ్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త! లాగిన్ అయి ఉంచి మర్చిపోతే మీ ప్రైవేట్ చాట్‌లు, కాంటాక్టులు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని కేంద్ర హోం శాఖ హెచ్చరించింది.
వాట్సప్ వెబ్ వాడుతున్నారా..? ప్రభుత్వం సీరియస్ వార్నింగ్.. ఎందుకంటే?
WhatsApp Web Alert: మీరు తరచూ ఆఫీస్ లేదా పబ్లిక్ కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ లాగిన్ చేసి మర్చిపోతున్నారా? అయితే వెంటనే అలవాటు మార్చుకోండి. యాక్టివ్‌గా ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్‌తో మీ ప్రైవేట్ సంభాషణలు ఇతరుల చేతికి చిక్కి, అకౌంట్ హైజాక్, మోసాలకు దారితీస్తుందని కేంద్ర హోం శాఖ సైబర్ విభాగం హెచ్చరించింది.
ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C)లోని నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ తాజా అడ్వైజరీ జారీ చేసింది. యాక్టివ్ వాట్సాప్ వెబ్ సెషన్ ద్వారా మెసేజ్‌లు, కాంటాక్టులు, గ్రూప్ చాట్‌లు అనధికార వ్యక్తులకు కనిపిస్తాయని తెలిపింది. మీ పేరుతో మెసేజ్‌లు పంపి, మీ నమ్మకాన్ని వాడుకుని ఫ్రాడ్, ఫిషింగ్ స్కామ్‌లకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
బ్రౌజర్ క్లోజ్ చేస్తే సరిపోదు..!
కేవలం బ్రౌజర్ విండో లేదా ట్యాబ్ క్లోజ్ చేయడం వల్ల వాట్సాప్ వెబ్ సెషన్ ముగియదని ఏజెన్సీ స్పష్టం చేసింది. ప్రతి సెషన్ తర్వాత మాన్యువల్‌గా లాగ్ అవుట్ చేయాలని సూచించింది.
“ఆఫీస్ కంప్యూటర్లు, షేర్డ్ సిస్టమ్‌లు, పబ్లిక్ కంప్యూటర్లు లేదా ఇతరులకు అందుబాటులో ఉండే పరికరాల్లో వాట్సాప్ వెబ్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి” అని అడ్వైజరీలో పేర్కొంది.
ప్రభుత్వ, సంస్థాగత, ఆర్థిక, రహస్య సమాచారాన్ని కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ ద్వారా పంపవద్దని సూచించింది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ప్రతి సెషన్ తర్వాత మాన్యువల్‌గా లాగ్ అవుట్ చేయండి. నమ్మకం లేని కంప్యూటర్లలో వాడకండి. మీ అకౌంట్ నుంచి ఊహించని మెసేజ్‌లు వెళ్తే అప్రమత్తం కండి. డివైజ్, ఓఎస్, బ్రౌజర్, సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌గా ఉంచండి.
అనుమానాస్పద డౌన్‌లోడ్‌లు, క్రాక్ సాఫ్ట్‌వేర్‌కు దూరంగా ఉండండి. అసాధారణ కార్యకలాపాలను గమనిస్తూ అప్రమత్తంగా ఉంటే అకౌంట్ మోసాలు, ఆర్థిక నష్టాలను నివారించవచ్చని I4C తెలిపింది.




