Mini Fridge: రూ. 10 వేలకే ఫ్రిజ్.. 30 రోజుల పాటు కూరగాయలు ఫ్రెష్.. ఆ కష్టాలకు చెక్..!
Sabjikothi Features: సాధారణంగా కూరగాయలు, పండ్లు రెండు మూడు రోజుల్లోనే వాడిపోతుంటాయి.
Mini Fridge: రూ. 10 వేలకే ఫ్రిజ్.. 30 రోజుల పాటు కూరగాయలు ఫ్రెష్.. ఆ కష్టాలకు చెక్..!
IIT Graduate Innovation: మన దేశంలో సరైన గిడ్డంగి సౌకర్యాలు లేక ఏటా టన్నుల కొద్దీ పంట వృథా అవుతోంది. ముఖ్యంగా చిన్న కారు రైతులు తమ పంటను భద్రపరుచుకోలేక తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ సమస్యకు పరిష్కారంగా బీహార్‌లోని భాగల్పూర్‌కు చెందిన ఐఐటీ గ్రాడ్యుయేట్ నిక్కీ కుమార్, అతని సోదరి రశ్మి ఝా కలిసి 'సబ్జీకోఠి' అనే మిని ఫ్రిజ్ తయారు చేశారు. ఇది సాధారణ ఫ్రిజ్ కంటే భిన్నంగా పనిచేస్తూ, రైతులకు ఒక వరప్రసాదంగా మారింది.
సాధారణ ఫ్రిజ్ కంటే పది రెట్లు ఎక్కువ సామర్థ్యం..
ఈ సబ్జీకోఠి చూడటానికి చిన్నదిగా ఉన్నా, దీని నిల్వ సామర్థ్యం మాత్రం అమోఘం. సాధారణ గృహ వినియోగ రిఫ్రిజిరేటర్లతో పోలిస్తే ఇది పది రెట్లు ఎక్కువ పరిమాణంలో కూరగాయలను, పండ్లను నిల్వ చేయగలదు. సుమారు 3 రోజుల నుంచి 30 రోజుల వరకు ఆహార పదార్థాలు పాడవకుండా ఇందులో భద్రంగా ఉంటాయి. దీని ధర సాధారణ ఫ్రిజ్ ధరలో సగం కంటే తక్కువ ఉండటం గమనార్హం.
అతి తక్కువ విద్యుత్ వినియోగం..
పెరుగుతున్న కరెంటు ఛార్జీల కాలంలో ఈ పరికరం అత్యంత పొదుపుగా పనిచేస్తుంది. దీనికి రోజుకు కేవలం ఒక లీటర్ నీరు, 10 నుంచి 20 వోల్టుల విద్యుత్ ఉంటే సరిపోతుంది. అంటే ఒక మొబైల్ ఫోన్ ఛార్జింగ్ కావడానికి ఎంత విద్యుత్ అవసరమో, అంతటితోనే ఈ పరికరం పనిచేస్తుంది. మారుమూల గ్రామాల్లో, విద్యుత్ సౌకర్యం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది.
సబ్జీకోఠి ఎలా పనిచేస్తుంది?
ఈ పరికరం లోపల ఒక నియంత్రిత వాతావరణాన్ని సృష్టిస్తుంది. పంటల నుంచి విడుదలయ్యే 'ఎథిలిన్' వాయువును ఇది తగ్గిస్తుంది. సాధారణంగా పండ్లు, కూరగాయలు త్వరగా పక్వానికి వచ్చి కుళ్ళిపోవడానికి ఈ ఎథిలిన్ గ్యాస్ కారణం. సబ్జీకోఠి సాంకేతికత ఈ ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. ద్రవ పదార్థాలను ఆక్సీకరణం చేసి కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్‌గా మార్చడం ద్వారా లోపల తేమను కాపాడుతూ పదార్థాలను తాజాగా ఉంచుతుంది.
రైతుల ఆదాయానికి అండ..
నిల్వ సౌకర్యం లేక రైతులు తమ పంటను తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన అవసరం ఇక లేదు. ఈ పరికరం ద్వారా పంటను కొన్ని రోజుల పాటు భద్రపరుచుకుని, మార్కెట్‌లో మంచి ధర ఉన్నప్పుడు విక్రయించవచ్చు. ఇది రైతులకు లాభాలను పెంచడమే కాకుండా, పంట వృథాను అరికడుతుంది. ఎక్కడికైనా సులభంగా తరలించగలిగేలా దీనిని రూపకల్పన చేయడం మరో విశేషం.




