Infinix GT 50 Pro: 6500mAh బ్యాటరీతోపాటు లిక్విడ్ కూలింగ్‌.. ఇన్ఫిక్స్ నుంచి కొత్త గేమింగ్ ఫోన్..!

Infinix GT 50 Pro: గేమింగ్ స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్న వారికి ఇన్ఫిక్స్ కీలక ఆప్షన్ తీసుకొస్తోంది. ఇన్ఫిక్స్ జీటీ 50 ప్రో అక్టోబర్ 27న భారత మార్కెట్లోకి రానుంది.

Venkat
Updated on: 26 Oct 2026 10:55 PM IST
Infinix GT 50 Pro
X

Infinix GT 50 Pro: 6500mAh బ్యాటరీతోపాటు లిక్విడ్ కూలింగ్‌.. ఇన్ఫిక్స్ నుంచి కొత్త గేమింగ్ ఫోన్..!

Infinix GT 50 Pro: గేమింగ్ సమయంలో ఫోన్ పనితీరు, డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్, బ్యాటరీ బ్యాకప్ కీలకంగా ఉంటాయి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇన్ఫిక్స్ కొత్త జీటీ 50 ప్రోను సిద్ధం చేసింది. ఫోన్‌లో పెద్ద బ్యాటరీతో పాటు హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, గేమింగ్ కంట్రోల్స్, లిక్విడ్ కూలింగ్ వంటి ఫీచర్లు అందించనుంది.

144Hz AMOLED డిస్‌ప్లే..

ఇన్ఫిక్స్ జీటీ 50 ప్రోలో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంటుంది. దీనికి 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ లభిస్తుంది. దీంతో సాధారణ స్క్రోలింగ్‌తో పాటు గేమింగ్ సమయంలో యానిమేషన్స్, మూవ్‌మెంట్స్ మరింత స్మూత్‌గా కనిపించే అవకాశం ఉంది.

ఫోన్‌కు మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌ను అందిస్తున్నారు. గేమింగ్ పనితీరుపై దృష్టి పెట్టిన ఈ చిప్‌సెట్ ద్వారా హెవీ గేమ్స్ ఆడే సమయంలో మెరుగైన పెర్ఫార్మెన్స్ అందించడమే కంపెనీ లక్ష్యంగా కనిపిస్తోంది.

6500mAh భారీ బ్యాటరీ..

ఈ ఫోన్‌లో 6500mAh బ్యాటరీ ఉంటుంది. ఎక్కువ సమయం గేమ్స్ ఆడే యూజర్లకు ఇది ఉపయోగకరంగా ఉండొచ్చు. వీడియో స్ట్రీమింగ్, గేమింగ్ వంటి పనుల్లో తరచుగా ఛార్జర్ ఉపయోగించాల్సిన అవసరాన్ని తగ్గించడంలో పెద్ద బ్యాటరీ సహాయపడుతుంది.

ఛార్జింగ్ విషయానికి వస్తే 45W వైర్డ్ ఛార్జింగ్, 30W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అయితే బ్యాటరీ బ్యాకప్ వాస్తవ వినియోగంపై ఆధారపడి ఉంటుంది.

గేమింగ్ కోసం ప్రత్యేక బటన్లు..

ఇన్ఫిక్స్ జీటీ 50 ప్రోలో జీటీ ట్రిగ్గర్ 2.0 షోల్డర్ బటన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. గేమ్స్ ఆడేటప్పుడు కొన్ని కంట్రోల్స్‌ను వేగంగా యాక్సెస్ చేసేందుకు ఇవి ఉపయోగపడవచ్చు.

ఇక ఎక్కువసేపు గేమింగ్ చేసే సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు హైడ్రో ప్లో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అందిస్తున్నారు. ఇది అంతర్గత ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడేలా రూపొందించారు.

ధర ఎంత ఉండొచ్చు?

ఇన్ఫిక్స్ జీటీ 50 ప్రోను అక్టోబర్ 27న భారత్‌లో లాంచ్ చేయనున్నారు. అయితే అధికారిక ధరను కంపెనీ లాంచ్ సమయంలో వెల్లడించనుంది. ఫోన్ బ్లాక్, రెడ్ బ్లేజ్ కలర్ ఆప్షన్లలో ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయానికి వచ్చే అవకాశం ఉంది.

ధర ప్రకటించిన తర్వాతే ఈ ఫోన్ ప్రస్తుత గేమింగ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఎంత పోటీ ఇవ్వగలదో స్పష్టమవుతుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.