Infinix : ఇన్ఫినిక్స్ నుంచి గేమింగ్ బీస్ట్.. 144Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీ.!
Infinix GT 50 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ (Infinix) గేమింగ్ ప్రియుల కోసం మరో పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. గత
Infinix GT 50 Pro
Infinix GT 50 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ (Infinix) గేమింగ్ ప్రియుల కోసం మరో పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. గత ఏడాది వచ్చిన GT 30 Pro మోడల్‌కు సక్సెసర్‌గా Infinix GT 50 Pro ని శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ చేశారు. అత్యాధునిక మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్, భారీ బ్యాటరీ , గేమర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన షోల్డర్ ట్రిగ్గర్లతో ఈ ఫోన్ టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రైస్ లిస్ట్
Infinix GT 50 Pro ప్రస్తుతం ఇండోనేషియా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. 12GB RAM + 256GB స్టోరేజ్ ఉన్న దీని ధర దాదాపు రూ. 35,000 (IDR 69,98,000). 12GB RAM + 512GB స్టోరేజ్ తో దీని ధర దాదాపు రూ. 40,000 (IDR 74,99,000). ఈ ఫోన్ బ్లాక్ అబిస్ (Black Abyss), రెడ్ బ్లేజ్ (Red Blaze), సిల్వర్ గ్లేసియర్ (Silver Glacier) అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.
డిస్ప్లే , డిజైన్
ఈ ఫోన్ 6.78-ఇంచుల AMOLED LTPS 1.5K డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ , 330Hz టచ్ సాంప్లింగ్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. 4500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వచ్చే ఈ డిస్ప్లే, సూర్యకాంతిలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7iని ఉపయోగించారు. ఫోన్ బరువు కేవలం 198 గ్రాములు ఉండటం వల్ల గేమింగ్ ఆడేటప్పుడు సౌకర్యవంతంగా ఉంటుంది.
పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్
గేమింగ్ కోసం ప్రత్యేకంగా MediaTek Dimensity 8400 Ultimate చిప్‌సెట్‌ను ఇందులో వాడారు. దీనికి మాలి-G720 MC7 GPU జత చేయబడింది. 12GB LPDDR5x RAM , 512GB వరకు UFS 4.1 స్టోరేజ్ ఉండటం వల్ల హెవీ గేమింగ్ , మల్టీ టాస్కింగ్ చాలా స్మూత్‌గా సాగుతుంది. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆధారిత XOS 16 పై నడుస్తుంది.
ప్రత్యేక గేమింగ్ ఫీచర్లు
గేమర్ల కోసం ఇన్ఫినిక్స్ ఇందులో ప్రెజర్ సెన్సిటివ్ షోల్డర్ ట్రిగ్గర్లను (Open-Cut Pressure-Sense GT Trigger) అందించింది. ఇవి 10 రకాల ప్రెజర్ లెవల్స్‌ను గుర్తించగలవు. కన్సోల్ తరహా అనుభూతిని ఇచ్చే ఈ ట్రిగ్గర్లు 3 మిలియన్ల కంటే ఎక్కువ సార్లు ప్రెస్ చేసినా పాడవవు. ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు 'హైడ్రోఫ్లో లిక్విడ్ కూలింగ్' (HydroFlow Liquid Cooling) టెక్నాలజీని ఉపయోగించారు.
కెమెరా , బ్యాటరీ
కెమెరా: వెనుకవైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ (OIS సపోర్ట్‌తో) , 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ: ఇందులో భారీ 6,500mAh బ్యాటరీ ఉంది. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అదనంగా, 30W వైర్లెస్ ఛార్జింగ్ , రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఇతర ఫీచర్లు
ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో వస్తుంది, అంటే ఇది దుమ్ము , నీటి తుంపర్ల నుంచి రక్షణ ఇస్తుంది. ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, NFC , డ్యూయల్ స్పీకర్లు వంటి ఇతర ముఖ్యమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.




