Infinix Hot 70 Pro : 6000mAh బ్యాటరీతో Infinix Hot 70 Pro లాంచ్.!
Infinix Hot 70 Pro : స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఇన్ఫినిక్స్ సంస్థ సరికొత్త బడ్జెట్ ధమాకా అందించింది. గ్లోబల్ మార్కెట్‌లో తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్..
infinix hot 70 pro
Infinix Hot 70 Pro : స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఇన్ఫినిక్స్ సంస్థ సరికొత్త బడ్జెట్ ధమాకా అందించింది. గ్లోబల్ మార్కెట్‌లో తన లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Infinix Hot 70 Proను అధికారికంగా విడుదల చేసింది. కంటికి ఆకట్టుకునే డిజైన్, స్మూత్ 144Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, ఏకంగా 6000mAh భారీ బ్యాటరీతో పాటు వెనుక భాగంలో ఒక ప్రత్యేకమైన సెకండరీ డిస్‌ప్లేతో ఈ ఫోన్‌ను తీసుకువచ్చింది. బడ్జెట్ రేంజ్‌లో ప్రీమియం ఫీచర్లు ఆశించే యూజర్లను టార్గెట్ చేస్తూ ఇన్ఫినిక్స్ ఈ ఫోన్‌ను డిజైన్ చేసింది.
ఆరు సరికొత్త రంగులు.. అదిరిపోయే డిజైన్
ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ మొత్తం ఆరు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. నైట్ పల్స్, డైవ్ బ్లూ, డెప్త్ రింగ్ వైట్, మిరాజ్ గ్రీన్, సిల్క్ గ్లో పర్పుల్ , థర్మో ఆరెంజ్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ కలర్ ఆప్షన్లు ఫోన్‌కు మరింత మోడ్రన్ , క్లాసిక్ లుక్‌ను ఇస్తాయి. అయితే, ఈ ఫోన్ ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
144Hz డిస్‌ప్లేతో స్మూత్ అనుభవం
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.76 అంగుళాల IPS LCD డిస్‌ప్లేను అందించారు. ఇది 2344 × 1080 పిక్సెల్స్ ఫుల్ హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్తో పాటు 950 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా, ఇందులో 45Hz నుంచి 144Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండటం విశేషం. దీనివల్ల గేమింగ్ ఆడేటప్పుడు, సోషల్ మీడియా స్క్రోలింగ్ చేసేటప్పుడు, వీడియోలు చూసేటప్పుడు స్క్రీన్ పెర్ఫార్మెన్స్ స్మూత్‌గా ఉంటుంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్
ఫోన్ వేగం , పనుల పెర్ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీనికి 8GB ర్యామ్, అలాగే 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను జత చేశారు. రోజువారీ సాధారణ పనులతో పాటు భారీ గ్రాఫిక్స్ ఉన్న గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు కూడా ఈ ఫోన్ మంచి పనితీరు అందిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.
బ్యాక్ ప్యానెల్‌పై సెకండరీ LED డిస్‌ప్లే
ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రోలో ఉన్న అన్నింటికంటే అతిపెద్ద హైలైట్ దాని వెనుక భాగంలో ఉన్న Active Matrix Cube LED Display. వెనుక వైపు మూడో కెమెరా లెన్స్ ఉండే స్థానంలో ఈ చిన్న LED డిస్‌ప్లేను అమర్చారు. ఫోన్ బోర్లా పడుకోబెట్టినప్పుడు కూడా మనకు వచ్చే ఇన్‌కమింగ్ కాల్స్, నోటిఫికేషన్లు , ఛార్జింగ్ స్టేటస్ వంటి వివరాలను ఈ చిన్న స్క్రీన్ పై సులభంగా చూసుకోవచ్చు. బడ్జెట్ ఫోన్లలో ఇలాంటి వినూత్న డిజైన్ రావడం నిజంగా విశేషం.
50MP సోనీ కెమెరాతో అదిరిపోయే ఫోటోలు
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే, ఇందులో 50 మెగాపిక్సెల్ Sony IMX882 ప్రైమరీ కెమెరాను అందించారు. దీనికి అదనంగా ఒక సపోర్టింగ్ లెన్స్ కూడా ఉంది. ఈ కెమెరాతో మంచి క్లారిటీతో కూడిన ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.
6000mAh బ్యాటరీ.. 45W ఫాస్ట్ ఛార్జింగ్
బ్యాటరీ లైఫ్ గురించి అస్సలు చింతించాల్సిన అవసరం లేకుండా ఈ ఫోన్‌లో 6000mAh భారీ బ్యాటరీను అందించారు. ఈ భారీ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. దీనివల్ల ప్రయాణాల్లో లేదా బయట ఉన్నప్పుడు ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్ లభించడమే కాకుండా, తక్కువ సమయంలోనే ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుంది.
ఆండ్రాయిడ్ 16తో దీర్ఘకాలిక అప్‌డేట్లు
సాఫ్ట్‌వేర్ పరంగా Infinix Hot 70 Pro సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. బడ్జెట్ ఫోన్ అయినప్పటికీ, కంపెనీ ఈ ఫోన్‌కు 3 ప్రధాన ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్లు (Android 19 వరకు), 5 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని గ్యారెంటీ ఇచ్చింది. సుదీర్ఘ కాలం పాటు కొత్త అప్‌డేట్లతో ఫోన్ వాడాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కానుంది.




