Instagram DM Privacy : ఇన్‌స్టాగ్రామ్ సీక్రెట్స్ అవుట్.? మీ 'పర్సనల్' చాటింగ్.. ఇక పబ్లిక్ కానుందా.?

Instagram DM Privacy : ఇన్‌స్టాగ్రామ్ లవర్స్ అందరూ మే 8 క్యాలెండర్‌లో మార్క్ చేసుకోవాల్సిన రోజు. ఎందుకంటే, మీ పర్సనల్ డిఎమ్స్ (DMs) చుట్టూ ఉన్న ఆ "ఎండ్-టు-ఎండ్

G Krishna
Published on: 7 May 2026 3:29 PM IST
Instagram DM Privacy
X

Instagram DM Privacy 

Instagram DM Privacy : ఇన్‌స్టాగ్రామ్ లవర్స్ అందరూ మే 8 క్యాలెండర్‌లో మార్క్ చేసుకోవాల్సిన రోజు. ఎందుకంటే, మీ పర్సనల్ డిఎమ్స్ (DMs) చుట్టూ ఉన్న ఆ "ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్" అనే సెక్యూరిటీ వలయం రేపటితో ముగియబోతోంది. అంటే ఏంటి? ఇప్పటిదాకా మీరు పంపిన సీక్రెట్ మెసేజ్‌లు, ఆ "పులిహోర" చాటింగ్‌లు అన్నీ ఇన్‌స్టాగ్రామ్ ఆఫీస్‌లో టీ తాగుతూ చదువుతారా? అసలు మే 8 తర్వాత మీ ప్రైవసీ పరిస్థితి ఏంటి? భయపడాలా లేక లైట్ తీసుకోవాలా? ఒకసారి సరదాగా లుక్కేద్దాం..!

ఏమిటీ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ గోల..?

ముందు అసలు ఈ ఎన్‌క్రిప్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. మీరు మీ ఫ్రెండ్‌కి "రేయ్.. ఇవాళ పార్టీ ఎక్కడ?" అని మెసేజ్ పంపితే, అది దారిలో ఎవరికీ అర్థం కాకుండా ఒక వింత కోడ్‌లా మారిపోతుంది. దాన్ని రిసీవ్ చేసుకునే మీ ఫ్రెండ్‌కి మాత్రమే అది మళ్ళీ మెసేజ్‌లా కనిపిస్తుంది. అంటే మధ్యలో మార్క్ జుకర్‌బర్గ్ వచ్చి చూడాలన్నా సాధ్యం కాదన్నమాట. కానీ మే 8 నుంచి ఈ తాళం తీసేస్తున్నారు. ఇప్పుడు మీ మెసేజ్‌లు గాల్లో ప్రయాణించేటప్పుడు ఇన్‌స్టాగ్రామ్ సర్వర్లకు అవి ఏంటో అర్థమైపోతాయన్నమాట.

అందరూ మీ చాట్లు చదివేస్తారా..?

"అమ్మో..! ఇకపై నా గర్ల్ ఫ్రెండ్‌తో మాట్లాడే మాటలన్నీ మార్క్ అన్నయ్య చదివేస్తాడా?" అని టెన్షన్ పడిపోకండి. మీరు పంపే ప్రతి మెసేజ్ ని ఇన్‌స్టాగ్రామ్ ఖాళీగా కూర్చుని చదవదు. ఇది కేవలం మీ అకౌంట్ సెక్యూరిటీని పెంచడానికి, ఏదైనా అక్రమ కార్యకలాపాలు జరిగినప్పుడు కనిపెట్టడానికి చేస్తున్న మార్పు అని కంపెనీ చెబుతోంది. కానీ, ప్రైవసీ పిచ్చోళ్లకు మాత్రం ఇది ఒక పెద్ద షాకే. ఎందుకంటే, "మేము చదవం" అని వాళ్ళు చెబుతున్నా.. చదవగలిగే అవకాశం ఉంది అనేది కదా అసలు పాయింట్..

మీ డిఎమ్స్ పరిస్థితి ఏంటి..

మే 8 తర్వాత మీరు పంపే మెసేజ్‌లు అన్నీ డిఫాల్ట్‌గా ఎన్‌క్రిప్టెడ్ కావు. అంటే మీ చాట్ బాక్స్ లో ఆ లాక్ సింబల్ కనిపించకపోవచ్చు. ఒకవేళ మీకు ఇప్పటికీ అంత సీక్రెట్ గానే ఉండాలనుకుంటే, మీరు మాన్యువల్‌గా 'సీక్రెట్ చాట్' లేదా మళ్ళీ సెట్టింగ్స్ లోకి వెళ్లి ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే, మీ చాటింగ్ ఒక ఓపెన్ గ్రౌండ్ లాంటిదే. ఎవరైనా హ్యాక్ చేసినా, ఏదైనా లీక్ అయినా మీ మెసేజ్‌లు బయటకు వచ్చే ప్రమాదం కొంచెం ఎక్కువగానే ఉంటుంది.

మనం ఏం చేయాలి..?

నిజం చెప్పాలంటే.. మనలో సగం మంది పంపే మెసేజ్‌లు "తిన్నావా?", "ఏం చేస్తున్నావ్?", "రీల్ చూశావా?" అనే ఉంటాయి. ఇలాంటి మెసేజ్‌లను ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళు చదివి మాత్రం ఏం చేసుకుంటారు? వాళ్ళకే బోర్ కొడుతుంది..! కానీ, మీరు నిజంగానే దేశరహస్యాలు, భారీ బిజినెస్ డీల్స్ ఇన్‌స్టాగ్రామ్ లో మాట్లాడుతుంటే మాత్రం.. ఇకపై కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. లేదా హాయిగా వాట్సాప్ కి మకాం మార్చేయడం మంచిది.

మే 8 తర్వాత ఇన్‌స్టాగ్రామ్ లో మీ చాటింగ్ చేస్తున్నప్పుడు.. పక్కన ఎవరో నిలబడి చూస్తున్నారన్న ఫీలింగ్ తో చాట్ చేయండి. పిచ్చి పిచ్చి ఫోటోలు, పాస్‌వర్డ్‌లు, పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేసేటప్పుడు ఒక్క నిమిషం ఆలోచించండి. ప్రైవసీ అనేది మన చేతుల్లోనే ఉంటుంది లేదా జుకర్‌బర్గ్ చేతుల్లో ఉంటుంది..! కాబట్టి, మే 8 తర్వాత మీ వేళ్లకు కొంచెం పని చెప్పండి.. అంటే సెట్టింగ్స్ మార్చుకోమని..!


G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story