Instagram Instants : ఇన్‌స్టాలో 'Instants' ఫీచర్ వచ్చేసింది.! స్నాప్‌చాట్‌కు ఇక చుక్కలే.!

Instagram Instants : మెటా (Meta) కంపెనీ సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ కోసం

G Krishna
Published on: 14 May 2026 1:56 PM IST
Instagram Instants
X

Instagram Instants

Instagram Instants : మెటా (Meta) కంపెనీ సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ కోసం 'Instants' అనే సూపర్ కూల్ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఫ్రెండ్స్ మధ్య ఫోటో షేరింగ్‌ని మరింత ఫాస్ట్ గా, ఎలాంటి ఫిల్టర్లు లేకుండా నాచురల్ గా ఉంచడమే ఈ ఫీచర్ మెయిన్ గోల్. సింపుల్ గా చెప్పాలంటే, మనం డైలీ లైఫ్ లో జరిగే మూమెంట్స్ ని అప్పటికప్పుడు క్యాప్చర్ చేసి పంపేయడమే అన్నమాట..

అసలు ఈ 'Instants' అంటే ఏంటి.. ఎలా పనిచేస్తుంది..?

ఈ ఫీచర్ మీకు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌బాక్స్ (DMs) లో కింద రైట్ సైడ్ కార్నర్‌లో కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే కెమెరా ఓపెన్ అవుతుంది. మీరు ఒక ఫోటో తీసి మీ 'Close Friends' కి లేదా మ్యూచువల్ ఫాలోవర్స్ కి సెండ్ చేయవచ్చు. ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే.. ఈ ఫోటోలు 'Ephemeral' అంటే ఒక్కసారి చూశాక మాయమైపోతాయి! ఎడిటింగ్ హడావుడి, ఫిల్టర్ల సోది ఏమీ లేకుండా పక్కా నాచురల్ గా ఫోటోలు షేర్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్.

ఎడిటింగ్ లేదు.. పక్కా ఒరిజినల్..!

మెటా ఈ ఫీచర్‌ను డిజైన్ చేసిన విధానం చాలా డిఫరెంట్. మీరు ఫోటో తీశాక కేవలం 'Caption' మాత్రమే యాడ్ చేయగలరు. ఫోటో పంపిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేయడం గానీ, పాత ఫోటోలను గ్యాలరీ నుండి అప్లోడ్ చేయడం గానీ కుదరదు. అంటే, మీరు ఆ మూమెంట్ లో ఎలా ఉన్నారో అలాగే కనిపిస్తారు! ఫోటో పంపిన తర్వాత అవతలి వ్యక్తి దాన్ని చూడగానే అది డిలీట్ అయిపోతుంది. ఒకవేళ పొరపాటున ఎవరికైనా రాంగ్ ఫోటో పంపితే, వారు ఓపెన్ చేయకముందే 'Undo' చేసే ఛాన్స్ కూడా ఇచ్చారు.

సపరేట్ 'Instants' యాప్.. ఎందుకంటే..?

మెటా కేవలం ఇన్‌స్టాగ్రామ్ లోనే కాకుండా, దీని కోసం ఒక Standalone App ని కూడా టెస్ట్ చేస్తోంది. కొన్ని దేశాల్లో ఆండ్రాయిడ్ , ఐఓఎస్ యూజర్స్ కోసం దీన్ని రిలీజ్ చేశారు. ఈ యాప్ వల్ల బెనిఫిట్ ఏంటంటే.. మీరు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి మెసేజెస్ లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా యాప్ ఓపెన్ చేయగానే కెమెరా కనిపిస్తుంది, టక్కున ఫోటో తీసి పంపేయడమే! మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తోనే దీనికి లాగిన్ అవ్వొచ్చు.

ఆర్కైవ్ , రీక్యాప్ స్టోరీస్

మీరు పంపిన ఫోటోలు ఫ్రెండ్స్ చూశాక డిలీట్ అయిపోయినా, అవి మీ పర్సనల్ Archive లో ఒక సంవత్సరం వరకు సేవ్ అయి ఉంటాయి. ఇది కేవలం మీకు మాత్రమే కనిపిస్తుంది. ఒక వారం లేదా నెల తర్వాత ఆ ఫోటోలన్నీ కలిపి ఒక 'Recap Story' లాగా క్రియేట్ చేసుకునే ఆప్షన్ కూడా మెటా ఇస్తోంది. అంటే మీ పాత మెమరీస్ ని మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకోవచ్చన్నమాట.

ప్రైవసీ , సేఫ్టీ.. పక్కా లోడ్..

ప్రైవసీ విషయంలో మెటా చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఈ ఫీచర్ లో పంపిన ఫోటోలను ఎవరూ Screenshot తీయలేరు, కనీసం Screen Recording కూడా చేయడం కుదరదు. అలాగే బ్లాక్, మ్యూట్ వంటి ఇన్‌స్టాగ్రామ్ సేఫ్టీ టూల్స్ అన్నీ ఇక్కడ కూడా పనిచేస్తాయి. టీనేజర్స్ కోసం స్పెషల్ గా రాత్రి 10 నుండి ఉదయం 7 వరకు 'Sleep Mode' ఉంటుంది, ఆ టైమ్ లో నోటిఫికేషన్లు రావు. పేరెంట్స్ కూడా తమ పిల్లలు ఈ యాప్ వాడుతున్నారో లేదో 'Family Centre' ద్వారా మానిటర్ చేయవచ్చు.


G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story