iOS 27 : ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఐఓఎస్ 27 రిలీజ్ డేట్ ఫిక్స్.!
iOS 27 : టెక్ దిగ్గజం యాపిల్ తమ ఐఫోన్ వినియోగదారుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'ఐఓఎస్ 27' (iOS 27) ఆపరేటింగ్ సిస్టమ్ విడుదల తేదీని అధికారికంగా
ios-27
iOS 27 : టెక్ దిగ్గజం యాపిల్ తమ ఐఫోన్ వినియోగదారుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'ఐఓఎస్ 27' (iOS 27) ఆపరేటింగ్ సిస్టమ్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఇటీవల లాంచ్ చేసిన ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ , బ్రాండ్ ఫస్ట్ ఫోల్డబుల్ మోడల్ 'ఐఫోన్ డ్యూయో' లతో పాటు పాత మోడళ్లకు కూడా ఈ కొత్త అప్‌డేట్ అందుబాటులోకి రానుంది.
ఎప్పుడు విడుదల కానుంది?
యాపిల్ ప్రకటించిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 14 నుంచి ఐఓఎస్ 27 అప్‌డేట్ సపోర్ట్ చేసే అన్ని ఐఫోన్‌లలో అందుబాటులోకి రానుంది. ఐఫోన్ 11 సిరీస్ నుంచి మొదలుకొని ఆ తర్వాత వచ్చిన అన్ని మోడళ్లతో పాటు ఐఫోన్ SE (2వ, 3వ జనరేషన్) మోడళ్లకు ఈ అప్‌డేట్ ఉచితంగా లభిస్తుంది. ఈ సరికొత్త అప్‌డేట్‌లో ఫోన్ ఇంటర్‌ఫేస్ పూర్తిగా మారిపోనుంది. 'లిక్విడ్ గ్లాస్' పేరుతో సరికొత్త డిజైన్‌ను తీసుకొచ్చారు. దీని ద్వారా యాప్స్, విజెట్స్‌కు మరింత ట్రాన్స్‌పరెన్సీ వస్తుంది. యూజర్లు తమకు నచ్చినట్లుగా స్క్రీన్ పై ఉండే ట్రాన్స్‌పరెన్సీ తీవ్రతను అడ్జస్ట్ చేసుకోవడానికి 'అపాసిటీ స్లైడర్' ఫీచర్‌ను కూడా అందించారు.
మరింత పవర్‌ఫుల్‌గా 'సిరి'
యాపిల్ వాయిస్ అసిస్టెంట్ 'సిరి' (Siri) ఈసారి మరింత తెలివిగా మారనుంది. గూగుల్ జెమిని AI సపోర్ట్‌తో పాటు యాపిల్ సొంత ఫౌండేషన్ మోడల్స్‌ను ఉపయోగించి దీనిని రీడిజైన్ చేశారు. దీని కోసం ప్రత్యేకంగా 'Siri AI' యాప్‌ను కూడా పరిచయం చేస్తున్నారు. ఇది యూజర్ల వ్యక్తిగత కాంటెక్స్ట్‌ను అర్థం చేసుకుని మేసేజ్‌లు, ఈమెయిళ్లు, ఫోటోల నుంచి క్షణాల్లో సమాచారాన్ని వెతికి పెడుతుంది. కెమెరా యాప్ ద్వారా నేరుగా పనిచేసే 'విజువల్ ఇంటెలిజెన్స్' ఫీచర్‌ను ఐఓఎస్ 27 లో చేర్చారు. కెమెరాను ఏదేని వస్తువు వైపు తిప్పి సిరిని ప్రశ్నిస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలను క్షణాల్లో స్క్రీన్‌పై చూపిస్తుంది. అలాగే స్క్రీన్‌పై కనిపిస్తున్న ఇమేజెస్ ఆధారంగా సమాచారాన్ని వెతికే వెసులుబాటు కూడా ఉంటుంది.
ఫోటో ఎడిటింగ్‌లో AI అద్భుతాలు
యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫోటోస్ యాప్‌లో సరికొత్త ఎడిటింగ్ ఆప్షన్లు వచ్చాయి. క్లీన్ అప్, ఎక్స్‌టెండ్, రీఫ్రేమ్ వంటి ఫీచర్ల ద్వారా సాధారణ ఫోటోలను కూడా ప్రొఫెషనల్ స్థాయిలో మార్చుకోవచ్చు. కేవలం టెక్స్ట్ రూపంలో కామాండ్ ఇచ్చి ఫోటోలను ఎడిట్ చేసే ఆప్షన్ కూడా ఇచ్చారు. ఈ కొత్త సిస్టమ్ అప్‌డేట్ వల్ల ఐఫోన్ పనితీరు గణనీయంగా పెరగనుంది. యాప్స్ ప్రారంభమయ్యే వేగం 30 శాతం వరకు, ఫోటోలు లోడ్ అయ్యే స్పీడ్ 70 శాతం వరకు పెరుగుతుందని యాపిల్ తెలిపింది. అలాగే ఎయిర్‌డ్రాప్ ద్వారా ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేసే వేగం కూడా 80 శాతం వరకు వేగవంతం కానుంది.
పిల్లల భద్రతకు కొత్త కంట్రోల్స్
తల్లిదండ్రులు తమ పిల్లల డివైజ్ వినియోగాన్ని పర్యవేక్షించేందుకు వీలుగా 'పేరెంటల్ కంట్రోల్స్'ను మరింత బలోపేతం చేశారు. పిల్లలు ఏవైనా యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా, సఫారీ బ్రౌజర్‌లో కొత్త వెబ్‌సైట్లు చూడాలన్నా తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసేలా 'Ask to Buy', 'Ask to Browse' ఫీచర్లను చేర్చారు. ఈ కొత్త అప్‌డేట్ రాగానే మీ ఐఫోన్ సెట్టింగ్స్ (Settings) లోకి వెళ్లాలి. అక్కడ జనరల్ (General) ఆప్షన్ ఎంచుకుని, సోఫ్ట్‌వేర్ అప్‌డేట్ (Software Update) పై క్లిక్ చేయాలి. అప్‌డేట్ అందుబాటులో ఉన్నట్లు చూపించగానే 'డౌన్‌లోడ్ & ఇన్‌స్టాల్' పై క్లిక్ చేసి ఐఓఎస్ 27 ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అయితే అప్‌డేట్ చేసే ముందు ఛార్జింగ్ సరిపడా ఉందో లేదో చూసుకోవడం మంచిది.




