IPhone 18 Proలో అదిరే ఫీచర్లు.. 2nm చిప్, 5,500mAh బ్యాటరీ..!
IPhone 18 Pro: యాపిల్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త ఐఫోన్ లాంచ్‌కు సమయం దగ్గరపడింది.
IPhone 18 Proలో అదిరే ఫీచర్లు.. 2nm చిప్, 5,500mAh బ్యాటరీ..!
IPhone 18 Pro: యాపిల్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త ఐఫోన్ లాంచ్‌కు సమయం దగ్గరపడింది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో నిర్వహించే వార్షిక ఈవెంట్‌లో ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro), ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ (iPhone 18 Pro Max) మోడళ్లను పరిచయం చేసేందుకు యాపిల్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంతేకాకుండా, ఈసారి ఐఫోన్ లవర్స్‌ను ఆశ్చర్యపరుస్తూ కంపెనీ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను కూడా ఈ వేదికపైనే ఆవిష్కరించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఫోర్బ్స్ కథనం ప్రకారం, ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 9న జరిగే అవకాశం ఉంది.
లాంచ్, ప్రి-ఆర్డర్లు, సేల్ టైమ్‌లైన్
సాధారణంగా యాపిల్ సంస్థ తన సెప్టెంబర్ ఈవెంట్ ప్రకటనను సుమారు రెండు వారాల ముందే అధికారికంగా విడుదల చేస్తుంది. ఆ లెక్కన చూస్తే ఆగస్టు 25 లేదా 26 తేదీల్లో ఈవెంట్‌కు సంబంధించిన అధికారిక ముహూర్తాన్ని వెల్లడించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 9న క్యుపెర్టినోలోని ప్రసిద్ధ యాపిల్ పార్క్‌లో ఈవెంట్ జరిగితే, సెప్టెంబర్ 11 లేదా 12 తేదీల్లో ప్రి-ఆర్డర్లు ప్రారంభమై, సెప్టెంబర్ 18 నాటికి స్టోర్లలో ప్రత్యక్షంగా అమ్మకాలు , డెలివరీలు షురూ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
సాధారణంగా శుక్రవారం (సెప్టెంబర్ 11) రోజునే ప్రి-ఆర్డర్లు ప్రారంభమవ్వాల్సి ఉంది. అయితే 2001 సెప్టెంబర్ 11న అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడికి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంలో, యాపిల్ గతంలో 2015లో చేసినట్లే ప్రి-ఆర్డర్ల తేదీని శనివారానికి (సెప్టెంబర్ 12) మార్చే వెసులుబాటు ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
డిజైన్‌లో ఊహించని మార్పులు.. పవర్‌ఫుల్ ప్రోసెసర్
డిజైన్ విషయానికి వస్తే, ఐఫోన్ 18 ప్రో మోడళ్లలో డిస్‌ప్లే సైజులు 6.3 ఇంచులు (ప్రో), 6.9 ఇంచులు (ప్రో మ్యాక్స్) యథాతథంగానే కొనసాగనున్నాయి. అయితే స్క్రీన్ పైభాగంలో వినియోగదారుల దృష్టిని ఆకర్షించే 'డైనమిక్ ఐలాండ్' పరిమాణాన్ని ఏకంగా 35 శాతం వరకు తగ్గించేందుకు యాపిల్ కసరత్తు చేస్తోంది. దీనివల్ల స్క్రీన్ వీక్షణ స్థలం మరింత పెరగనుంది.
పెర్ఫార్మెన్స్ పరంగా ఈ సిరీస్‌లో అత్యంత అధునాతనమైన TSMC 2nm ప్రాసెస్ ఆధారంగా తయారైన శక్తివంతమైన 'A20 ప్రో' చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నారు. దీనివల్ల ఫోన్ ప్రాసెసింగ్ వేగం 15 శాతం పెరగడమే కాకుండా, దాదాపు 30 శాతం వరకు ఛార్జింగ్ , బ్యాటరీ సామర్థ్యం ఆదా అవుతుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
వేరియబుల్ అపెర్చర్ కెమెరా, AI సిరి , భారీ బ్యాటరీ
కెమెరా , సాఫ్ట్‌వేర్ విభాగాల్లో కూడా యాపిల్ భారీ అప్‌గ్రేడ్స్ ప్లాన్ చేస్తోంది. పరిసరాల్లోని కాంతి తీవ్రతకు అనుగుణంగా లెన్స్ అపెర్చర్‌ను స్వయంచాలకంగా మార్చుకునే 'వేరియబుల్ అపెర్చర్' వెసులుబాటును ఈసారి ప్రధాన కెమెరాలో తీసుకొచ్చే అవకాశం ఉంది.
దీనివల్ల నైట్ మోడ్ , పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీ సరికొత్త స్థాయిలో ఉండబోతున్నాయి. ఈ ఫోన్లు iOS 27 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రానుండగా, ఇందులో 'యాపిల్ ఇంటెలిజెన్స్' ఆధారంగా పనిచేసే మరింత తెలివైన 'సిరి' వాయిస్ అసిస్టెంట్ లభించనుంది. ఇక బ్యాటరీ పరంగా ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ చైనా వేరియంట్‌లో ఏకంగా 5,500mAh నిరీక్షిత బ్యాటరీని అందించవచ్చని తెలుస్తోంది.
ఈ భారీ బ్యాటరీ కారణంగా ఫోన్ బరువు సుమారు 240 గ్రాములు, మందం 9 మిమీ ఉండే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. అయితే ఈ వివరాలన్నీ లీకైన సమాచారం , నివేదికల ఆధారంగా వచ్చినవే కాబట్టి, యాపిల్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.




