iPhone 18 Pro Max Leaks: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్.. లీకైన అదిరిపోయే ఫీచర్లు.!
iPhone 18 Pro Max Leaks: ఆపిల్ ప్రియుల్లో ఇప్పుడు ఐఫోన్ 18 సిరీస్ గురించి ఉత్కంఠ నెలకొంది. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, టెక్ వర్గాల్లో
iPhone 18 Pro Max Leaks
iPhone 18 Pro Max Leaks: ఆపిల్ ప్రియుల్లో ఇప్పుడు ఐఫోన్ 18 సిరీస్ గురించి ఉత్కంఠ నెలకొంది. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, టెక్ వర్గాల్లో దీనిపై చర్చలు అప్పుడే మొదలయ్యాయి. ఈసారి ఆపిల్ తన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లో విప్లవాత్మక మార్పులు చేయబోతోందని తాజా లీక్‌లు , రిపోర్ట్‌లు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా డిజైన్, కెమెరా సామర్థ్యం , బ్యాటరీ విషయంలో ఈ ఫోన్ కొత్త రికార్డులను సృష్టించబోతోంది.
కెమెరా , కొత్త డిజైన్
ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో కెమెరా మాడ్యూల్ గత మోడల్స్ కంటే పెద్దదిగా ఉండబోతోంది. లీకైన డమ్మీ యూనిట్ల ప్రకారం, కెమెరా ప్లేట్ మందం సుమారు 13.77 మి.మీ. వరకు పెరగవచ్చు. ఇది కేవలం డిజైన్ మార్పు మాత్రమే కాదు, ఇందులో అమర్చబోయే 'వేరియబుల్ అపెర్చర్' (Variable Aperture) కలిగిన అధునాతన సెన్సార్ల కోసం ఈ స్థలాన్ని పెంచినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఫొటోగ్రఫీలో మునుపెన్నడూ లేని విధంగా స్పష్టత, లోతు లభిస్తాయి. అలాగే, ఫేస్ ఐడి (Face ID) సెన్సార్లను డిస్‌ప్లే కిందకు మార్చడం ద్వారా 'డైనమిక్ ఐలాండ్' సైజ్ కూడా తగ్గే అవకాశం ఉంది.
కొత్త సిగ్నేచర్ కలర్
ఈసారి ఆపిల్ తన రంగుల సెలక్షన్లలో సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ప్రధానంగా 'డార్క్ చెర్రీ' (Dark Cherry) రంగులో అలరించబోతోంది. ఇది చూడటానికి బర్గండీ, డార్క్ పర్పుల్ కలిపి ఉండి, ఫోన్‌కు అత్యంత ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. దీనితో పాటు లైట్ బ్లూ, డార్క్ గ్రే , సిల్వర్ రంగుల్లో కూడా ఈ ఫోన్ లభించవచ్చు. ఐఫోన్ 17 సిరీస్‌లోని కాస్మిక్ ఆరెంజ్ స్థానంలో ఈ కొత్త డార్క్ చెర్రీ రంగు రాబోతోంది.
బిగ్ బ్యాటరీ.. పెరిగిన వెయిట్
ఐఫోన్ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన బ్యాటరీని ఈ ఫోన్‌లో చూడబోతున్నాం. దాదాపు 5,100mAh నుండి 5,200mAh సామర్థ్యం గల బ్యాటరీని ఆపిల్ ఇందులో అమర్చనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా రాబోతున్న 2nm ఆర్కిటెక్చర్‌తో తయారైన A20 ప్రో చిప్ వల్ల ఈ బ్యాటరీ లైఫ్ మరింత పెరుగుతుంది. అయితే, పెద్ద బ్యాటరీ కారణంగా ఫోన్ బరువు సుమారు 240 గ్రాములకు పెరగవచ్చు. అయితే.. ఇది ఐఫోన్లలోనే అత్యంత బరువైన మోడల్‌గా నిలిచే అవకాశం ఉంది. అయినప్పటికీ, ఛార్జింగ్ సమస్య లేకుండా రోజంతా ఫోన్ వాడాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.
A20 చిప్.. ఇన్‌హౌస్ మోడెమ్
టెక్నికల్ పరంగా చూస్తే, ఆపిల్ స్వయంగా తయారు చేసిన 'C2' 5G మోడెమ్ ఈ ఫోన్‌తో పరిచయం కానుంది. ఇప్పటివరకు క్వాల్‌కామ్ మోడెమ్‌లపై ఆధారపడిన ఆపిల్, ఇప్పుడు సొంత మోడెమ్‌తో కనెక్టివిటీని మరింత మెరుగుపరచనుంది. 2nm ప్రాసెస్‌పై తయారైన A20 చిప్ సెట్ వల్ల 15% వేగవంతమైన పనితీరు, 30% మెరుగైన పవర్ ఎఫిషియెన్సీ లభిస్తుంది. దీనివల్ల గేమింగ్, AI టాస్క్‌లు ఎంతో సులభతరం అవుతాయి.
ధర.. విడుదల వివరాలు
ఆపిల్ ఎప్పటిలాగే.. సెప్టెంబర్ 2026లో ఈ ఐఫోన్ 18 సిరీస్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర సుమారు $1,199 అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు లక్ష పైన ఉండవచ్చు. అయితే, భారతదేశంలో పన్నులు , దిగుమతి సుంకాల కారణంగా దీని ప్రారంభ ధర రూ.1,50,000 నుండి రూ.1,60,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది.




