iPhone 18 Pro: లీకైన ఐఫోన్ 18 ప్రో ధర.. సామ్సంగ్ ఫ్లాగ్‌షిప్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిందిగా..!
iPhone 18 Pro price India: టెక్ ప్రపంచంలో మరో పెద్ద చర్చ మొదలైంది. ఐఫోన్ 18 ప్రో ధర లీక్ కావడంతో యూజర్లలో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ఇది సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా కంటే తక్కువ ధరలో రావొచ్చన్న వార్త మార్కెట్లో సంచలనం రేపుతోంది. కొత్త ఫీచర్లతో ఈ ఫోన్ ఎలా ఉండబోతుందో చూద్దాం.
iPhone 18 Pro: లీకైన ఐఫోన్ 18 ప్రో ధర.. సామ్సంగ్ ఫ్లాగ్‌షిప్‌కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిందిగా..!
iPhone 18 Pro price India: ప్రస్తుతం లీక్ అయిన సమాచారం ప్రకారం, ఐఫోన్ 18 ప్రో భారత మార్కెట్లో సుమారు రూ.1,34,900 ధరతో లాంచ్ అయ్యే అవకాశముంది. ఇదే సమయంలో ఇటీవల విడుదలైన సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ధర రూ.1,39,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ధర వ్యత్యాసంతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులకు కీలక నిర్ణయంగా మారే అవకాశం ఉంది. ఐఫోన్ సాధారణంగా ఎక్కువ ధరతో వస్తుంది అనే అభిప్రాయాన్ని ఈసారి ఆపిల్ మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
లాంచ్ ఎప్పుడు?
లీక్ రిపోర్టుల ప్రకారం, ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్ 2026 సెప్టెంబర్ 3 నుంచి 9 మధ్య లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఆపిల్ ఇంకా అధికారికంగా తేదీ ప్రకటించకపోయినా, ప్రతీ ఏడాది లాగే సెప్టెంబర్‌లోనే ఈ సిరీస్ విడుదల అవుతుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
కొత్త కలర్ ఆప్షన్స్..
ఈసారి ఐఫోన్ 18 ప్రో కొత్త రంగులతో వినియోగదారులను ఆకట్టుకోనుంది. అందులో కాఫీ బ్రౌన్, బర్గండీ, పర్పుల్, డార్క్ రెడ్ ఉన్నాయి. ఈ కలర్ వేరియంట్స్ ప్రీమియం లుక్‌ను మరింత పెంచేలా ఉంటాయని అంచనా.
స్పెసిఫికేషన్స్ – కొత్తగా ఏమున్నాయంటే..?
లీక్ సమాచారం ప్రకారం, ఐఫోన్ 18 ప్రోలో 6.3 అంగుళాల OLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందించే అవకాశం ఉంది. పర్ఫార్మెన్స్ విషయంలో, 2nm ప్రాసెస్‌తో తయారైన A20 ప్రో చిప్సెట్ ఉపయోగించనున్నారు. ఇది వేగంతోపాటు పవర్ ఎఫిషియెన్సీని గణనీయంగా పెంచుతుంది. ఇక మెమరీ విషయానికి వస్తే, 12GB RAM, 1TB వరకు స్టోరేజ్ అందించనున్నారు.
కెమెరా ఫీచర్లు..
ఫోటోగ్రఫీ కోసం, ఐఫోన్ 18 ప్రోలో 48MP మెయిన్ కెమెరా ఉండే అవకాశం ఉంది. సెల్ఫీ కోసం 18MP ఫ్రంట్ కెమెరా ఇవ్వొచ్చు. ఈ కెమెరా అప్‌గ్రేడ్స్ ద్వారా ఫోటోలు, వీడియోలు మరింత క్వాలిటీతో వస్తాయని అంచనా వేస్తున్నారు.
మార్కెట్లో ప్రభావం..
ఐఫోన్ 18 ప్రో ధర సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా కంటే తక్కువగా ఉంటే, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ ఏర్పడుతుంది. ఇప్పటి వరకు ఎక్కువ మంది వినియోగదారులు ధర కారణంగా సామ్సంగ్ వైపు మొగ్గు చూపితే, ఇప్పుడు ఐఫోన్ వైపు కూడా భారీగా మారే అవకాశముంది.




