iPhone 18 Proలో కలర్ ట్విస్ట్.. ఈసారి మూడు కొత్త షేడ్స్..

టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ మెగా ఈవెంట్ 'సర్‌ప్రైజ్ అండ్ షైన్' (Surprise and Shine) ప్రారంభానికి..

G Krishna
Updated on: 2 Sept 2026 1:12 PM IST
iPhone 18 Pro three new colors
X

iPhone 18 Pro three new colors 

టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ మెగా ఈవెంట్ 'సర్‌ప్రైజ్ అండ్ షైన్' (Surprise and Shine) ప్రారంభానికి సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 9న అదరగొట్టేందుకు ప్లాన్ చేస్తున్న ఈ గ్రాండ్ ఈవెంట్‌లో నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ 18 ప్రో , ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లను కంపెనీ ఆవిష్కరించనుంది. అయితే ఈ అధికారిక లాంచ్‌కి ముందే ఈ ఫ్లాగ్‌షిప్ సిరీస్ లైనప్ , రంగులకు సంబంధించిన కొన్ని క్రేజీ లీక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తున్నాయి.

సరికొత్త మూడు కలర్ ఆప్షన్లు.. పాత రంగులకు గుడ్ బై

చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ 'ఫిక్స్డ్-ఫోకస్ డిజిటల్ కెమెరాస్' వేదికగా షేర్ చేసిన లీక్స్ ప్రకారం, ఈసారి ఐఫోన్ 18 ప్రో సిరీస్ మూడు సరికొత్త రంగుల్లో మార్కెట్‌లోకి రాబోతోంది. ఇందులో రాయల్ డిజైన్‌తో కూడిన డార్క్ రెడ్ షేడ్‌లో 'బర్గుండి' (Burgundy) లేదా డార్క్ చెర్రీ, లైట్ అండ్ అత్యంత క్లాసీగా ఉండే 'స్కై బ్లూ' (Sky Blue), గత వర్షన్ల కంటే మరింత డార్క్‌గా మెరిసే క్లాసిక్ 'ప్యూర్ బ్లాక్' (Pure Black) ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. గత ఏడాది ఐఫోన్ 17 ప్రో సిరీస్‌లో ప్రవేశపెట్టిన కాస్మిక్ ఆరెంజ్, డిస్టెంట్ బ్లూ , సిల్వర్ రంగులను యాపిల్ ఈసారి పూర్తిగా పక్కన పెట్టనున్నట్లు సమాచారం.

సర్‌ప్రైజ్ అండ్ షైన్' ఈవెంట్ హైలైట్స్

సెప్టెంబర్ 9న కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్‌లో భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఈ వేడుక గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 18 ప్రో సిరీస్‌తో పాటు యాపిల్ చరిత్రలోనే మొదటిసారిగా వస్తున్న మడిచే ఫోన్ 'ఐఫోన్ ఆల్ట్రా' (iPhone Ultra) ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వీటితో పాటు స్మార్ట్‌వాచ్ ప్రియుల కోసం యాపిల్ వాచ్ సిరీస్ 12 , ఆడియో డివైజెస్ విభాగంలో ఎయిర్‌పాడ్స్ 5 వంటి అడ్వాన్స్‌డ్ గాడ్జెట్లను కూడా యాపిల్ వేదికపై పరిచయం చేసే అవకాశం ఉంది.

అడ్వాన్స్‌డ్ ప్రాసెసర్ అండ్ బిగ్గర్ కెమెరా సెటప్

డిజైన్ పరంగా చూస్తే ఐఫోన్ 18 ప్రో సిరీస్ మునుపటి మోడళ్ల రూపురేఖలనే కొనసాగించినప్పటికీ, వెనుక వైపు కెమెరా మాడ్యూల్ పరిమాణాన్ని మరింత పెద్దదిగా మార్చారు. ఇందులో ఫోటోగ్రఫీ క్వాలిటీని పెంచేలా సరికొత్త ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తున్నారు. ఇక పెర్ఫార్మన్స్ , స్పీడ్ విషయంలో రాజీపడకుండా యాపిల్ లేటెస్ట్ పవర్‌ఫుల్ A20 ప్రో చిప్‌సెట్ ద్వారా ఈ డివైజులు రన్ కానున్నాయి. సెప్టెంబర్ 9 ఈవెంట్ నాటికి ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల ధర, డిస్‌ప్లే స్పెక్స్ , బ్యాటరీ కెపాసిటీకి సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు వెల్లడికానున్నాయి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.