iQOO Neo 12 వచ్చేస్తోంది.. 9,000mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లేతో అదిరిపోయే ఫీచర్లు..!
iQOO Neo 12: ఐక్యూ నియో 12 త్వరలో చైనా మార్కెట్లోకి రానుంది. అక్టోబర్ 28న విడుదల కానున్న ఈ ఫోన్‌కు ఇప్పటికే ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.
iQOO Neo 12 వచ్చేస్తోంది.. 9,000mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లేతో అదిరిపోయే ఫీచర్లు..!
iQOO Neo 12: వివోకు చెందిన ఐక్యూ బ్రాండ్ కొత్త నియో సిరీస్ ఫోన్ iQOO Neo 12ను చైనాలో విడుదల చేసేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 28న స్థానిక సమయం రాత్రి 7 గంటలకు ఈ ఫోన్‌ను ఆవిష్కరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం ఇది సాయంత్రం 4:30 గంటలకు జరుగుతుంది. ఇప్పటికే చైనాలోని వివో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఫోన్‌కు ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.
9,000mAh భారీ బ్యాటరీ..
iQOO Neo 12లో 9,000mAh బ్లూ ఓషన్ బ్యాటరీ ఉంటుంది. ఐదో తరం సిలికాన్ యానోడ్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించినట్లు కంపెనీ తెలిపింది. బ్యాటరీ శక్తి సాంద్రత 916Wh/L వరకు ఉంటుందని పేర్కొంది. దీనికి గ్లోబల్ డైరెక్ట్ డ్రైవ్ పవర్ సప్లై 2.0 సాంకేతికత కూడా అందుబాటులో ఉంటుంది.
ఫోన్ 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 11.6 గంటల వరకు ఎంఓబీఏ గేమింగ్ లేదా 29.9 గంటల వరకు షార్ట్ వీడియోలను చూడవచ్చని కంపెనీ చెబుతోంది.
2K 185Hz డిస్‌ప్లే..
డిస్‌ప్లే ఈ ఫోన్‌లో మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 2K రిజల్యూషన్‌తో 185Hz రిఫ్రెష్ రేట్ కలిగిన స్క్రీన్‌ను అందిస్తున్నట్లు ఐక్యూ వెల్లడించింది. ఇందులో నాలుగో తరం పీటీఎస్‌ఎఫ్ టెక్నాలజీని ఉపయోగించారు.
స్క్రీన్ 500Hz మల్టీ-టచ్ టచ్ శాంప్లింగ్ రేట్, 5,000Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్‌ను అందిస్తుంది. క్యూఫ్లెక్స్ కంట్రోల్ టెక్నాలజీ కూడా ఉంటుంది. గరిష్ఠంగా 2,200 నిట్స్ ప్రకాశం, కనిష్ఠంగా 1 నిట్ ప్రకాశాన్ని ఈ డిస్‌ప్లే అందిస్తుంది.
శక్తివంతమైన చిప్‌సెట్..
iQOO Neo 12లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ఉంటుంది. 3nm తయారీ ప్రక్రియపై ఆధారపడిన ఈ చిప్‌కు ప్రత్యేకమైన క్యూ3 గేమింగ్ చిప్‌ను జత చేశారు. గేమింగ్ పనితీరును మెరుగుపరిచే లక్ష్యంతో ఈ కలయికను అందిస్తున్నట్లు తెలుస్తోంది.
ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా వ్యవస్థ ఉంటుందని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. కాంటెస్ట్, షాడో బ్లాక్, ఫ్రాస్ట్ బ్లేడ్ బ్లూ అనే 3 రంగుల్లో ఫోన్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతానికి వెల్లడైన వివరాలు చైనా మార్కెట్‌కు సంబంధించినవే.




