Jio Offer: జియో బంపరాఫర్.. రూ.1,499కే 4G ఫోన్, 6 నెలల ఫ్రీ రీఛార్జ్
Jio Offer: జియో 10వ వార్షికోత్సవం సందర్భంగా రూ.1,499కే 4G ఫోన్, 6 నెలల ఫ్రీ కనెక్టివిటీతో ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది.
Jio Offer: జియో బంపరాఫర్.. రూ.1,499కే 4G ఫోన్, 6 నెలల ఫ్రీ రీఛార్జ్
Jio Offer: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన 10వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారుల కోసం సరికొత్త ధమాకా ఆఫర్‌ను ప్రకటించింది. దేశంలో డిజిటల్ కనెక్టివిటీని మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో 'జియో భారత్ 4G' ఫోన్‌పై భారీ రాయిితీతో కూడిన ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికీ 2G నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్న సాధారణ ఫీచర్ ఫోన్ వినియోగదారులు అత్యంత తక్కువ ఖర్చుతో 4G సాంకేతికతకు అప్‌గ్రేడ్ అయ్యేలా ఈ ఆఫర్‌ను రూపొందించారు.
ఈ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా జియో భారత్ 4G ఫోన్‌ను కేవలం రూ.1,499లకే అందిస్తున్నారు. దీనితో పాటు రూ.1,200 విలువైన 6 నెలల ఉచిత రీఛార్జ్ ప్లాన్‌ను కూడా సంస్థ ఉచితంగా అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా ప్రతి నెల 14GB డేటాతో పాటు దేశవ్యాప్తంగా అపరిమిత ఉచిత వాయిస్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. సాధారణంగా 2G వినియోగదారులు 6 నెలల కాలింగ్ రీఛార్జ్‌కే సుమారు రూ.1,200 వరకు వెచ్చిస్తుంటారు. ఆ లెక్కన చూస్తే, వినియోగదారులకు కొత్త 4G ఫోన్ కేవలం రూ.299లకే లభిస్తున్నట్లవుతుందని కంపెనీ స్పష్టం చేసింది.
సాధారణ ఫీచర్ ఫోన్‌ల కంటే భిన్నంగా జియో భారత్ ఫోన్‌లో పలు డిజిటల్ సదుపాయాలు కల్పించారు. ఇందులో జియో టీవీ యాప్ ద్వారా 500 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెళ్లు, సినిమాలు, క్రీడలు వీక్షించవచ్చు. అంతేకాకుండా 'జియోపే' (JioPay) ద్వారా యూపీఐ చెల్లింపులు, సౌండ్‌బాక్స్ వాయిస్ అలర్ట్స్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. 2.4 అంగుళాల డిస్‌ప్లే, 2000mAh శక్తివంతమైన బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్, తక్కువ బడ్జెట్‌లో పూర్తిస్థాయి 4G డిజిటల్ అనుభవాన్ని అందించనుంది.




