Jio Car Sync : వైర్ల తిప్పలు వదిలేయండి.. జియో కార్‌సింక్ వచ్చేసింది.!

Jio Car Sync : మీ కారు ఎక్కగానే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? జేబులో ఉన్న ఫోన్ బయటకు తీసి, ఆ వైర్ ఎక్కడుందో వెతికి, కారుకి కనెక్ట్ చేయడం. ఒక్కోసారి ఆ

G Krishna
Published on: 7 May 2026 2:35 PM IST
jio-car-sync
X

jio-car-sync

Jio Car Sync : మీ కారు ఎక్కగానే మొట్టమొదటి పని ఏంటో తెలుసా? జేబులో ఉన్న ఫోన్ బయటకు తీసి, ఆ వైర్ ఎక్కడుందో వెతికి, కారుకి కనెక్ట్ చేయడం. ఒక్కోసారి ఆ వైర్ లూజ్ అయ్యి మధ్యలో కనెక్షన్ కట్ అయితే వచ్చే చిరాకు అంతా ఇంతా కాదు. "అన్నీ వైర్‌లెస్‌గా మారుతున్నాయి కానీ, ఈ కార్ ప్లే మాత్రం మారట్లేదేంటి సామీ?" అని మీరు అనుకుంటే, మీ గోడు జియో విన్నట్టుంది. అందుకే వైర్ల గందరగోళానికి చెక్ పెట్టేందుకు 'జియో కార్‌సింక్' (JioCarSync) పేరుతో ఒక చిన్న మ్యాజిక్ బాక్స్‌ను లాంచ్ చేసింది.

ఒక్క ప్లగ్.. మొత్తం వైర్‌లెస్..

ఈ జియో కార్‌సింక్ చూడటానికి మీ జేబులో పట్టేంత చిన్నగా ఉన్నా, చేసే పని మాత్రం పెద్దదే. దీని సెటప్ చేయడం చాలా ఈజీ.. జస్ట్ మీ కారులోని USB పోర్టుకు దీన్ని తగిలించి, ఫోన్ బ్లూటూత్ ఆన్ చేస్తే చాలు. ఒకసారి పేరు (Pair) చేస్తే, మళ్ళీ ఆ వైర్ మొహం చూడాల్సిన అవసరం లేదు. మీరు కారు ఎక్కి ఇంజిన్ స్టార్ట్ చేసిన ఐదు సెకన్లలోపే మీ ఫోన్ ఆటోమేటిక్‌గా కారు స్క్రీన్‌తో కనెక్ట్ అయిపోతుంది. అంటే, మీరు సీట్ బెల్ట్ పెట్టుకునే లోపే మీ ఫోన్ లోని సాంగ్స్ సిద్ధంగా ఉంటాయన్నమాట!

ధర వింటే "జియో" అనాల్సిందే..

ఇలాంటి వైర్‌లెస్ అడాప్టర్లు మార్కెట్లో గతంలో కూడా ఉన్నాయి కానీ, వాటి ధరలు వింటే గుండె గుభేల్ మనేవి. కానీ జియో ఎప్పుడూ తన స్టైల్ లోనే తక్కువ ధరకే దీన్ని తీసుకొచ్చింది. కేవలం రూ. 2,399 కే అమెజాన్ లో ఇది దొరుకుతోంది. మీరు కారులో వాడుతున్న వైర్లకు మనం పెట్టే ఖర్చు కంటే ఇది ఎంతో బెటర్. అంతేకాదు, దీని మీద ఒక సంవత్సరం వారంటీ కూడా ఇస్తున్నారు.

ఫీచర్లు అన్నీ మునుపటి లాగే.. కానీ ఫ్రీగా..

వైర్‌లెస్‌గా మారినంత మాత్రాన కారు కంట్రోల్స్ పనిచేయవు అనుకోకండి. మీ స్టీరింగ్ మీద ఉండే బటన్లతోనే పాటలు మార్చుకోవచ్చు, వాల్యూమ్ పెంచుకోవచ్చు. గూగుల్ అసిస్టెంట్ లేదా సిరిని పిలిచి "మా ఇంటికి దారి చెప్పు" అని వాయిస్ కమాండ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ ఎక్కడా లాగ్ (Lag) లేకుండా స్మూత్ గా సాగిపోతాయని కంపెనీ చెబుతోంది. బ్లూటూత్ 5.3 , 5GHz వై-ఫై సాయంతో డేటా ట్రాన్స్‌ఫర్ జరుగుతుంది కాబట్టి క్వాలిటీ లో ఎక్కడా రాజీ ఉండదు.

స్మార్ట్ డ్రైవింగ్ కు పచ్చ జెండా..

మీ దగ్గర ఐఫోన్ ఉన్నా లేదా ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా.. రెండింటికీ ఇది ఒకేలా సపోర్ట్ చేస్తుంది. పాత కారును కూడా కొత్త హంగులతో మార్చుకోవాలనుకునే వారికి ఇదొక బెస్ట్ ఆప్షన్. వైర్లతో కుస్తీ పడటం మానేసి, రిలాక్స్డ్ గా డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం జియో కార్‌సింక్ మంచి గ్యాడ్జెట్ అని చెప్పొచ్చు. ఇప్పుడిక కారు ఎక్కగానే ఫోన్ కనెక్ట్ చేసే పని లేదు.. హాయిగా సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ వెళ్లిపోవడమే..


G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story