Jio Rs 10000 Recharge Plan: జియో అదిరిపోయే ప్లాన్.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 3 ఏళ్ల వరకు నో టెన్షన్..!
Jio Rs 10000 Recharge Plan: మొబైల్ రీఛార్జ్ ఖర్చులు తగ్గించుకోవాలనుకునే జియో (Jio) కస్టమర్లకు ఒక ఆసక్తికరమైన ప్లాన్ గురించి వార్తలు వస్తున్నాయి. ఒకేసారి రూ.10,000 చెల్లిస్తే ఏకంగా మూడేళ్ల పాటు రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉందని సమాచారం.
Jio Rs 10000 Recharge Plan: జియో అదిరిపోయే ప్లాన్.. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 3 ఏళ్ల వరకు నో టెన్షన్..!
Jio Rs 10000 Recharge Plan: రిలయన్స్ జియో (Reliance Jio) తీసుకొచ్చిన ఈ కొత్త ఆఫర్ పేరు 3-Year Unlimited Connectivity Plan. దీని ధర రూ.10,000గా నిర్ణయించారు. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు ఒకేసారి రీఛార్జ్ చేసుకుంటే 36 నెలల పాటు మొబైల్ సేవలను పొందవచ్చు. తరచూ రీఛార్జ్ చేసుకునే ఇబ్బందిని తగ్గించడంతో పాటు, భవిష్యత్తులో టారిఫ్ ధరలు పెరిగినా ప్రస్తుత ధర ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది.
జియో రూ.10,000 ప్లాన్ బెనిఫిట్స్ ఇవే!
ఈ ప్లాన్‌లో రోజుకు 2.5GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ 5G డేటా సదుపాయం కూడా ఉంది. అలాగే దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. ప్రతిరోజూ 100 SMSలు ఉచితంగా పొందవచ్చు. మొత్తం 36 నెలల పాటు ఈ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి.
OTT, క్లౌడ్ స్టోరేజ్ ప్రయోజనాలు..
కేవలం కాలింగ్, డేటా మాత్రమే కాకుండా డిజిటల్ సేవలను కూడా జియో ఈ ప్లాన్‌లో అందిస్తోంది.
JioHotstar: మొబైల్ + హాలీవుడ్ కంటెంట్ యాక్సెస్.
Canva Pro Lite: 12 నెలల సబ్‌స్క్రిప్షన్.
JioAICloud: 50GB ఉచిత క్లౌడ్ స్టోరేజ్.
ఈ సేవలతో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడటంతో పాటు ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను క్లౌడ్‌లో భద్రపరుచుకోవచ్చు.
నెలకు ఎంత ఖర్చవుతుంది?
రూ.10,000ను 36 నెలలకు లెక్కిస్తే నెలకు సుమారు రూ.278 మాత్రమే ఖర్చవుతుంది. ప్రస్తుతం జియో అందిస్తున్న రూ.3,599 వార్షిక ప్లాన్‌ను మూడేళ్ల పాటు తీసుకుంటే మొత్తం రూ.10,797 అవుతుంది. ఈ లెక్కన కొత్త ప్లాన్‌తో రూ.797 వరకు ఆదా చేయవచ్చు. అయితే రెండు ప్లాన్లలో అదనపు ప్రయోజనాలు ఒకేలా ఉండవు.
ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది?
జియో కొత్త రూ.10,000 ప్లాన్‌ను 2026 నవంబర్ 7 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. MyJio యాప్, Jio అధికారిక వెబ్‌సైట్, జియో స్టోర్లు, రిటైల్ కేంద్రాల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.
మొత్తంగా మూడేళ్ల పాటు జియో నెట్‌వర్క్‌నే ఉపయోగించాలనుకునే వారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉండొచ్చు. అయితే ఒకేసారి రూ.10,000 చెల్లించాల్సి ఉండటంతో రీఛార్జ్ చేసుకునే ముందు అన్ని నిబంధనలను పరిశీలించడం మంచిది.




