Recharge plan: జియోలో కొత్త రీఛార్జ్ ప్లాన్.. రూ. 149 ప్లాన్‌తో 30 రోజుల వ్యాలిడిటీ, బెనిఫిట్స్ ఇవే
Recharge plan: క్రికెట్ అభిమానుల కోసం రిలయన్స్ జియో రూ. 149 ధరలో కొత్త డేటా ప్లాన్‌ను తీసుకొచ్చింది.
Recharge plan
Recharge plan: క్రికెట్ అభిమానుల కోసం రిలయన్స్ జియో రూ. 149 ధరలో కొత్త డేటా ప్లాన్‌ను తీసుకొచ్చింది. తక్కువ ఖర్చుతో మ్యాచ్‌లను ఆన్లైన్‌లో స్ట్రీమింగ్ చేయాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పటికే జియో సిమ్ వాడుతున్న ప్రీపెయిడ్ యూజర్లకు ఇది అదనపు డేటా ప్యాక్‌గా ఉపయోగపడుతుంది.
రూ. 149 ప్లాన్‌లో ఏమేమి లభిస్తాయి?
ఈ ప్లాన్ ఒక డేటా యాడ్-ఆన్ మాత్రమే. అంటే ఇది వాడాలంటే మీ వద్ద ముందుగా ఒక యాక్టివ్ జియో ప్రీపెయిడ్ ప్లాన్ ఉండాలి. ఈ రీచార్జ్‌తో మొత్తం 10GB హై స్పీడ్ డేటా లభిస్తుంది. ఇందులో రోజువారీ పరిమితి ఉండదు కాబట్టి మీకు అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఈ డేటా వినియోగానికి 30 రోజుల వాలిడిటీ ఇస్తారు. అదనంగా, ఈ ప్లాన్‌తో 90 రోజుల పాటు JioHotstar మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది. రోజూ డేటా సరిపోక ఇబ్బంది పడేవారికి లేదా మ్యాచ్‌ల సమయంలో ఎక్కువ డేటా అవసరమైన వారికి ఇది మంచి ఎంపిక.
క్రికెట్‌తో పాటు ఎంటర్టైన్‌మెంట్
ఈ ప్లాన్‌లో భాగంగా వచ్చే JioHotstar సబ్‌స్క్రిప్షన్ వల్ల వినియోగదారులు లైవ్ క్రికెట్ మ్యాచ్‌లను ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా చూడగలరు. అంతేకాకుండా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇతర స్పోర్ట్స్ కంటెంట్‌తో పాటు ఎంటర్టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌లను కూడా సులభంగా ఆస్వాదించవచ్చు.
అయితే రూ. 149 ప్లాన్ పూర్తిగా డేటా కోసం మాత్రమే రూపొందించారు కాబట్టి ఇందులో వాయిస్ కాల్స్ లేదా SMS సదుపాయం ఉండదు. అలాగే ఇది ప్రధాన ప్లాన్ కాదు కాబట్టి మీ నంబర్ యాక్టివ్‌గా ఉండాలంటే మరో రెగ్యులర్ ప్లాన్ తప్పనిసరిగా ఉండాలి. ఎక్కువ డేటా అవసరమైతే రూ. 195 ప్లాన్ కూడా అందుబాటులో ఉంది, ఇందులో 15GB డేటా లభిస్తుంది, అదే 30 రోజుల వాలిడిటీతో పాటు 90 రోజుల JioHotstar సబ్‌స్క్రిప్షన్ ఇస్తారు. మరోవైపు, పూర్తి సదుపాయాలు కావాలనుకునే వారికి రూ. 189 రెగ్యులర్ ప్లాన్ మంచి ఆప్షన్, ఇందులో కాల్స్, రోజువారీ డేటా, SMS వంటి అన్ని ప్రయోజనాలు లభిస్తాయి.




