జియో రూ.449 vs రూ.500 ప్లాన్.. రూ.51లు అదనంగా పెడితే ఏమొస్తుంది?

Jio prepaid plans: జియో యూజర్ల కోసం రూ.449, రూ.500 ధరల్లో రెండు 28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ధరలో కేవలం రూ.51 తేడా ఉన్నా.. డేటా, OTT, AI సబ్‌స్క్రిప్షన్ల విషయంలో రెండింటి మధ్య గణనీయమైన తేడా ఉంది.

Venkat
Published on: 13 Oct 2026 11:40 PM IST
Jio prepaid plans
X

జియో రూ.449 vs రూ.500 ప్లాన్.. రూ.51లు అదనంగా పెడితే ఏమొస్తుంది?

Jio prepaid plans: రిలయన్స్ జియో (Reliance Jio) ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం విభిన్న ప్రయోజనాలతో పలు రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. ఇందులో రూ.449, రూ.500 ధరలతో ఉన్న రెండు ప్లాన్స్ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. రెండింటికీ 28 రోజుల వ్యాలిడిటీ ఉన్నప్పటికీ.. రోజువారీ డేటా పరిమాణం, OTT సేవలు, AI సబ్‌స్క్రిప్షన్ల విషయంలో తేడాలు ఉన్నాయి. దీంతో రూ.51 అదనంగా చెల్లించడం వల్ల ఏం ప్రయోజనం వస్తుందనే విషయం తెలుసుకోవడం ఆసక్తికరంగా మారింది.

జియో రూ.449 ప్లాన్‌లో ఏం వస్తుంది?

రూ.449 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రధానంగా ఎక్కువ రోజువారీ డేటా అవసరమయ్యే వారికి అనుకూలంగా ఉంది. ఈ రీఛార్జ్‌తో 28 రోజుల పాటు ప్రతిరోజూ 3GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 84GB డేటాను ఉపయోగించుకోవచ్చు.

డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయం ఉంటుంది. రోజుకు 100 SMSలను కూడా పంపుకోవచ్చు. అర్హత ఉన్న వినియోగదారులకు అన్‌లిమిటెడ్ 5G డేటా ప్రయోజనం కూడా అందుతుంది.

ఈ ప్లాన్‌లో కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. జియోహాట్‌స్టార్ (JioHotstar), 50GB ఉచిత జియోఏఐక్లౌడ్ (JioAICloud) లభిస్తాయి. అంతేకాదు, రూ.35,100 విలువైన 18 నెలల ఉచిత గూగుల్ ఏఐ ప్రో (Google AI Pro) ప్లాన్‌ను వినియోగించుకునే అవకాశం ఉంది. దీనికి అదనంగా 12 నెలల కాన్వా ప్రో లైట్ (Canva Pro Lite) సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

రూ.500 ప్లాన్‌లో ప్రత్యేకత ఏమిటి?

జియో రూ.500 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అయితే రూ.449 ప్లాన్‌తో పోలిస్తే రోజువారీ డేటా తక్కువగా ఉంటుంది. ఈ రీఛార్జ్‌లో రోజుకు 2GB చొప్పున మొత్తం 56GB డేటా అందుతుంది.

అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలతో పాటు అర్హత ఉన్న వినియోగదారులకు అన్‌లిమిటెడ్ 5G డేటా ప్రయోజనం కూడా ఉంటుంది.

ఈ ప్లాన్ ప్రధాన ఆకర్షణ మాత్రం OTT ప్రయోజనాలు. జియోటీవీ (JioTV) యాప్ ద్వారా యూట్యూబ్ ప్రీమియం (YouTube Premium), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), సోనీలివ్ (SonyLIV), జీ5 (ZEE5), సన్‌నెక్స్ట్ (Sun NXT), లయన్స్ గేట్ ప్లే (Lionsgate Play), డిస్కవరీ+ (Discovery+), కంచ లంక, ఈటీవీ విన్ (ETV Win), చౌపాల్, ఫ్యాన్‌కోడ్ (FanCode), తరాంగ్ ప్లస్, టైమ్స్ ప్లే, హోయిచోయ్ (Hoichoi) వంటి పలు OTT సేవలు అందుబాటులో ఉంటాయి.

దీంతో పాటు జియోహాట్‌స్టార్ మొబైల్, హాలీవుడ్ కంటెంట్ కూడా లభిస్తుంది. 18 నెలల గూగుల్ జెమిని ఏఐ ప్రో (Google Gemini AI Pro) ప్లాన్, 12 నెలల కాన్వా ప్రో లైట్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఈ ప్లాన్‌లో ఉన్నాయి. అదనంగా 1,000కి పైగా లైవ్ టీవీ ఛానెల్స్‌ను కూడా యూజర్లు చూడవచ్చు.

రూ.51 తేడాతో ఏది బెటర్?

రెండు ప్లాన్స్ మధ్య ధరలో రూ.51 మాత్రమే తేడా ఉంది. అయితే అవసరాలను బట్టి సరైన ఎంపిక మారుతుంది. ప్రతిరోజూ ఎక్కువ మొబైల్ డేటా వినియోగించే వారికి రూ.449 ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో రోజుకు 3GB డేటా లభించడం ప్రధాన ఆకర్షణ.

అదే OTT కంటెంట్, లైవ్ టీవీ, AI సబ్‌స్క్రిప్షన్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వారికి రూ.500 ప్లాన్ ఆసక్తికరమైన ఎంపికగా ఉంటుంది. ముఖ్యంగా ఒకే రీఛార్జ్‌లో అనేక వినోద సేవలు కావాలనుకునే వారికి ఈ ప్లాన్‌లో అదనపు ప్రయోజనాలు ఉన్నాయి.

అందువల్ల కేవలం ధరను చూసి ప్లాన్ ఎంచుకోవడం కంటే.. మీకు రోజువారీ డేటా ఎక్కువగా అవసరమా, లేక OTT, AI, లైవ్ టీవీ వంటి ప్రయోజనాలు కావాలా అనేది ముందుగా నిర్ణయించుకోవడం మంచిది. మీ వినియోగానికి సరిపోయే ప్లాన్‌ను ఎంచుకుంటే రూ.51 అదనపు ఖర్చు కూడా అర్థవంతంగా ఉంటుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.