జియో వర్సెస్ ఎయిర్‌టెల్.. ఎక్కువ రోజులు సిమ్ యాక్టివ్‌లో ఉండాలటే ఈ రెండు ప్లాన్స్‌లో ఏది బెస్ట్ ఆప్షన్
Recharge Plan: తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి జియో, ఎయిర్‌టెల్ రెండూ 84 రోజుల వ్యాలిడిటీతో ప్రత్యేక రీచార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి.
జియో వర్సెస్ ఎయిర్‌టెల్.. ఎక్కువ రోజులు సిమ్ యాక్టివ్‌లో ఉండాలటే ఈ రెండు ప్లాన్స్‌లో ఏది బెస్ట్ ఆప్షన్
Recharge Plan: తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి జియో, ఎయిర్‌టెల్ రెండూ 84 రోజుల వ్యాలిడిటీతో ప్రత్యేక రీచార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఈ రెండు ప్లాన్‌ల్లో రోజువారీ డేటా ఉండదు. అయితే అన్‌లిమిటెడ్ కాలింగ్, ఎస్‌ఎంఎస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఇంతకీ ఆ ప్లాన్స్ ఏంటంటే.?
జియో రూ.448 ప్లాన్‌లో ఏమేం లభిస్తాయి?
జియో రూ.448 ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఈ ప్లాన్‌తో దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. అలాగే మొత్తం 1,000 ఎస్‌ఎంఎస్‌లు కూడా అందిస్తారు. అయితే ఈ ప్లాన్‌లో రోజువారీ మొబైల్ డేటా ఉండదు. ఇంటర్నెట్ అవసరమైతే ప్రత్యేకంగా డేటా వోచర్‌ను రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో లేదా కార్యాలయంలో వై-ఫై ఉపయోగించే వారికి ఈ ప్లాన్ మంచి ఎంపికగా చెప్పవచ్చు.
ఎయిర్‌టెల్ రూ.469 ప్లాన్‌లో ఉన్న ప్రయోజనాలు ఇవే
ఎయిర్‌టెల్ రూ.469 ప్లాన్‌లో కూడా 84 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, మొత్తం 1,000 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. జియో ప్లాన్‌లాగే ఇందులో కూడా రోజువారీ డేటా ఉండదు. కాబట్టి మొబైల్ డేటాను ఎక్కువగా ఉపయోగించని వారికి ఇది కూడా అనుకూలమైన ప్లాన్‌గా ఉంటుంది.
ఎయిర్‌టెల్ అదనంగా ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి?
ధరలో రూ.21 ఎక్కువ ఉన్నప్పటికీ ఎయిర్‌టెల్ తన ప్లాన్‌తో కొన్ని అదనపు సౌకర్యాలను అందిస్తోంది. ఇందులో Adobe Express Premiumకు 12 నెలల యాక్సెస్ లభిస్తుంది. అలాగే Safe Network సేవతో పాటు ఉచిత HelloTunes సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ అదనపు ఫీచర్లను ఉపయోగించే వారికి ఎయిర్‌టెల్ ప్లాన్ మరింత విలువైనదిగా మారుతుంది.
ఏ ప్లాన్ ఎవరికి బెస్ట్?
మీకు ప్రధానంగా కాలింగ్ మాత్రమే అవసరమై, ఇంటర్నెట్ కోసం ఇంటి వై-ఫై లేదా బ్రాడ్‌బ్యాండ్‌పై ఆధారపడితే జియో రూ.448 ప్లాన్ మంచి ఎంపిక. తక్కువ ధరలో 84 రోజుల వ్యాలిడిటీతో పాటు కాలింగ్ సౌకర్యం లభిస్తుంది.
అయితే కాలింగ్‌తో పాటు అదనపు డిజిటల్ బెనిఫిట్స్ కూడా కావాలనుకుంటే ఎయిర్‌టెల్ రూ.469 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. Adobe Express Premium, Safe Network, HelloTunes వంటి సేవలు ఈ ప్లాన్‌కు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. కాబట్టి మీ అవసరాలను బట్టి ఈ రెండు ప్లాన్‌లలో మీకు సరిపోయేదాన్ని ఎంపిక చేసుకోవచ్చు.




