Kagi Mail: జీమెయిల్‌కు పోటీగా కాగి మెయిల్.. యాడ్స్, నిఘా లేకుండా ఈమెయిల్ సర్వీస్..!

Kagi Mail: జీమెయిల్‌కు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న యూజర్లకు కాగి (Kagi) కొత్త ఆప్షన్‌ను తీసుకొచ్చింది. యాడ్స్, యూజర్ల నిఘా లేకుండా ఈ సర్వీస్ పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. నూతన యూజర్లకు 60 రోజుల ఉచిత ట్రయల్ లభిస్తుంది.

Venkat
Published on: 27 Nov 2026 8:31 PM IST
Kagi Mail
X

Kagi Mail: జీమెయిల్‌కు పోటీగా కాగి మెయిల్.. యాడ్స్, నిఘా లేకుండా ఈమెయిల్ సర్వీస్..!

Kagi Mail: ఆఫీస్ పనుల నుంచి ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఆన్‌లైన్ ఖాతాల వరకు ఈమెయిల్ అవసరం చాలా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో చాలామందికి జీమెయిలే మొదటి ఎంపికగా ఉంది. ఈ నేపథ్యంలో జీమెయిల్‌ను సవాల్ చేయడానికి కొత్త ఆప్షన్ ముందుకొచ్చింది.

కాగి మెయిల్ అంటే ఏంటి?

కాగి ఇప్పటికే గూగుల్ సెర్చ్‌కు ప్రత్యామ్నాయంగా పెయిడ్ సెర్చ్ ఇంజన్‌ను అందిస్తోంది. అలాగే క్రోమ్‌కు ఆప్షన్‌గా ఓరియన్ (Orion) బ్రౌజర్‌ను కూడా అందుబాటులో ఉంచింది. అదే దిశలో ఇప్పుడు కాగి మెయిల్ పేరుతో ఈమెయిల్ సర్వీస్‌ను తీసుకొచ్చింది. ఈమెయిల్ వాడేటప్పుడు యూజర్లు ప్రకటనలు, నిఘాను ఇబ్బందులు లేకుండా ఈ సర్వీస్‌ను రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది. ఇందులో ఓపెన్ స్టాండర్డ్స్‌కు సపోర్ట్ కూడా ఉంది. యూజర్లు ఏదో ఒక ప్లాట్‌ఫామ్‌కు ఫిక్స్ కాకుండా ఉండేలా ఈమెయిల్ సర్వీస్ అందించడమే కంపెనీ లక్ష్యం.

ధర ఎంత?

ప్రస్తుతం కాగి మెయిల్ పబ్లిక్ బీటా రూపంలో అందుబాటులో ఉంది.

కొత్త యూజర్లకు మొదట 60 రోజుల ఉచిత ట్రయల్ లభిస్తుంది.

ఆ తర్వాత ఏడాదికి 99 డాలర్లు (సుమారు రూ.8,800) చెల్లించాలి.

కంపెనీ నెలకు 25 డాలర్లు ఉండే కాగి అల్టిమేట్ సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా కూడా కాగి మెయిల్‌ను వాడవచ్చు.

ఫీచర్లు..

@kagimail.com డొమైన్‌తో ఈమెయిల్ అడ్రస్ లభిస్తుంది.

అపరిమిత ఈమెయిల్ అడ్రస్‌లు, వేర్వేరు డొమైన్‌లు వాడే సదుపాయం ఉంది.

50GB స్టోరేజ్ ఇస్తున్నారు.

ఇన్‌బిల్ట్ కేలండర్ లభిస్తుంది. దీంతో ఈమెయిల్‌తో పాటు కేలండర్ సదుపాయం కూడా ఒకే సర్వీస్‌లో ఉంటుంది.

2027లో రానున్న ఫీచర్లు..

కాగి తన ఈ ఈమెయిల్ సర్వీస్‌కు రానున్న ఫీచర్ల రోడ్‌మ్యాప్‌ను కూడా ప్రకటించింది.

2027 మొదటి త్రైమాసికంలో (Q1) కాంటాక్ట్స్, అడ్రస్ బుక్ ఫీచర్ జోడించనున్నట్లు తెలిపింది. నేటివ్ మొబైల్ యాప్‌ల కోసం యూజర్లు 2027 మూడో త్రైమాసికం (Q3) వరకు వేచి ఉండాల్సి రావచ్చు.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.