6000mAh బ్యాటరీ, డ్యూయల్ డిస్‌ప్లేతో వచ్చేసిన లావా ఆరా కర్వ్ 5జీ ధర ఎంతంటే!

Lava Aura Curve 5G: భారత్‌లో లావా ఆరా కర్వ్ 5జీ (Lava Aura Curve 5G) పేరుతో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది.

Venkat
Published on: 21 Oct 2026 11:26 PM IST
Lava Aura Curve 5G
X

6000mAh బ్యాటరీ, డ్యూయల్ డిస్‌ప్లేతో వచ్చేసిన లావా ఆరా కర్వ్ 5జీ ధర ఎంతంటే!

Lava Aura Curve 5G: భారత్‌లో లావా ఆరా కర్వ్ 5జీ (Lava Aura Curve 5G) పేరుతో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. కర్వ్డ్ ఆల్మాండ్ డిస్‌ప్లేతో పాటు వెనుక భాగంలో సెకండరీ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 50MP Sony కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. రూ.23,999 ధరతో లభించే ఈ ఫోన్ ప్రత్యేకంగా ఆఫ్‌లైన్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చారు.

లావా ఆరా కర్వ్ 5జీ: రూ.23,999కే డ్యూయల్ డిస్‌ప్లే ఫోన్

లావా భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను విడుదల చేసింది. లావా ఆరా కర్వ్ 5జీ పేరుతో వచ్చిన ఈ ఫోన్‌ను ప్రధానంగా ఆఫ్‌లైన్ మార్కెట్ కోసం తీసుకొచ్చారు. కర్వ్డ్ డిస్‌ప్లే, వెనుక భాగంలో సెకండరీ డిస్‌ప్లే, 6000mAh భారీ బ్యాటరీ వంటి ప్రత్యేక ఫీచర్లను ఇందులో అందించారు. మీడియా టెక్ చిప్‌సెట్‌తో పనిచేసే ఈ ఫోన్ ద్వారా ప్రీమియం హ్యాండ్‌సెట్ అనుభూతిని అందించాలన్నది కంపెనీ లక్ష్యం.

లావా ఆరా కర్వ్ 5జీ ధరను భారత్‌లో రూ.23,999గా నిర్ణయించారు. ఈ ధరకు 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ లభిస్తుంది. ఫోన్‌ను హిమ్ సిల్వర్, అంబర్ బ్లూ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ను లావా ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా విక్రయించనుంది.

లావా ఆరా కర్వ్ 5జీ డిస్‌ప్లే..

లావా ఆరా కర్వ్ 5జీలో 6.67 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. గరిష్ఠంగా 1100 నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. HDR+ సపోర్ట్ కూడా ఉంది.

ఈ ఫోన్ ప్రత్యేకతల్లో వెనుక భాగంలో ఇచ్చిన సెకండరీ డిస్‌ప్లే ఒకటి. ఇందులో బ్యాటరీ స్టేటస్, వాల్యూమ్, నోటిఫికేషన్లు, ఎమోజీలు వంటి వివరాలను చూడొచ్చు.

మీడియాటెక్ ప్రాసెసర్

పనితీరు కోసం మీడియా టెక్ డైమెన్సిటీ Dimensity 7100 ఆక్టాకోర్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీనికి 6GB LPDDR5 RAM, 128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ జత చేశారు.

50MP Sony కెమెరా..

కెమెరా విభాగంలో వెనుకవైపు సింగిల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP f/1.8 Sony IMX 752 సెన్సార్ ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 13MP కెమెరా అందించారు.

6000mAh బ్యాటరీ.. 45W ఛార్జింగ్..

లావా ఆరా కర్వ్ 5జీలో 6000mAh బ్యాటరీ ఉంది. ఇది 45W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అయితే ఫోన్ బాక్స్‌లో కంపెనీ 33W ఛార్జర్ అందిస్తోంది.

ఇతర ఫీచర్లలో ఫింగర్‌ప్రింట్ స్కానర్, USB Type-C పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. రెండు సంవత్సరాల పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని కంపెనీ తెలిపింది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.