Lava Bold N4 Pro 5G: రూ.13,999కే లావా 5G ఫోన్.. 6,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.!
Lava Bold N4 Pro 5G: భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా తన బోల్డ్ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది.
Lava Bold N4 Pro 5G: రూ.13,999కే లావా 5G ఫోన్.. 6,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.!
Lava Bold N4 Pro 5G: భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా తన బోల్డ్ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. Lava Bold N4 Pro 5G పేరుతో వచ్చిన ఈ ఫోన్.. గతంలో ఆగస్టులో మార్కెట్లోకి వచ్చిన Bold N4 Liteకి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా నిలిచింది. పెద్ద బ్యాటరీ, 5G కనెక్టివిటీ, మెరుగైన హార్డ్‌వేర్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లే, Unisoc T8200 చిప్‌సెట్, 6GB RAM, 6GB వర్చువల్ RAMతో పాటు 6,000mAh బ్యాటరీ ఇందులో ఉన్నాయి.
రూ.13,999కే లావా బోల్డ్ N4 ప్రో 5G
Lava Bold N4 Pro 5Gని 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే విడుదల చేసింది. దీని ప్రత్యేక ప్రారంభ ధర రూ.13,999గా నిర్ణయించింది. అన్ని ఆఫర్లను కలుపుకుని ఈ ధరను ప్రకటించినట్లు కంపెనీ తెలిపింది. సెప్టెంబర్ 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్‌లో ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. మొనాకో బ్లూ, ఓప్యులెంట్ లిలాక్ రంగుల్లో ఇది లభించనుంది.
120Hz డిస్‌ప్లే.. Unisoc T8200 చిప్
ఈ ఫోన్‌లో 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. Unisoc T8200 5G చిప్‌సెట్‌తో పనిచేసే Bold N4 Proలో 6GB RAMతో పాటు మరో 6GB వర్చువల్ RAM సదుపాయం ఉంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఫోన్ వస్తుంది. క్లీన్ సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని అందించేలా దీన్ని రూపొందించినట్లు లావా పేర్కొంది.
50MP AI కెమెరా
కెమెరా విషయానికి వస్తే.. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ AI ఆధారిత డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. కెమెరా సిస్టమ్‌లో రెండు ప్రధాన లెన్స్‌లతో పాటు LED ఫ్లాష్‌ను అందించారు. ముందు భాగంలో సెల్ఫీల కోసం వాటర్‌డ్రాప్ నాచ్ డిజైన్‌తో ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. అయితే ఫ్రంట్ కెమెరా రిజల్యూషన్, ఇతర కెమెరా ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
6,000mAh బ్యాటరీ.. IP64 రేటింగ్
Lava Bold N4 Pro 5Gలో 6,000mAh సామర్థ్యంతో పెద్ద బ్యాటరీని అందించారు. అయితే ఫోన్‌కు సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వివరాలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. దుమ్ము, నీటి చిమ్ముళ్ల నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్ ఇచ్చారు. దీంతో రోజువారీ వినియోగంలో అదనపు రక్షణ లభించనుంది.
ఫ్లాట్ డిజైన్‌తో కొత్త లుక్
డిజైన్ పరంగా ఈ ఫోన్ ఫ్లాట్ బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది. వెనుక ఎడమవైపు పై భాగంలో గుండ్రని మూలలతో కూడిన కెమెరా మాడ్యూల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో రెండు పెద్ద కెమెరా లెన్స్‌లు, మరో చిన్న సర్క్యులర్ ఎలిమెంట్, LED ఫ్లాష్ ఉన్నాయి. ఫోన్‌కు ఫ్లాట్ ఫ్రేమ్‌ను ఇచ్చారు. కుడివైపు పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి.
ఇంటివద్దకే సర్వీస్
ఫోన్ కొనుగోలుదారులకు అమ్మకాల తర్వాత సేవలను కూడా లావా అందిస్తోంది. ఇందులో భాగంగా ‘Free Service at Home’ సదుపాయాన్ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా వినియోగదారులకు ఇంటివద్దే ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ అందించేలా ఈ సేవను తీసుకొచ్చింది. ప్రస్తుతం అమెజాన్ లిస్టింగ్‌లో కొన్ని స్పెసిఫికేషన్లు మాత్రమే వెల్లడయ్యాయి. మరిన్ని వివరాలు విక్రయాలు ప్రారంభమయ్యేలోపు వెలువడే అవకాశం ఉంది.




