Lava Virat V1 Pro 5G : రూ. 14 వేలకే లావా 5G ఫోన్.. 6000mAh బ్యాటరీతో దుమ్మురేపే ఫీచర్లు

Lava Virat V1 Pro 5G : మీరు రూ.15,000 లోపు బడ్జెట్‌లో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే భారతీయ బ్రాండ్ 'లావా' తీసుకొచ్చిన కొత్త

G Krishna
Published on: 30 Aug 2026 4:03 PM IST
Lava Virat V1 Pro 5G
X

Lava Virat V1 Pro 5G

Lava Virat V1 Pro 5G : మీరు రూ.15,000 లోపు బడ్జెట్‌లో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే భారతీయ బ్రాండ్ 'లావా' తీసుకొచ్చిన కొత్త స్మార్ట్‌ఫోన్ మీకు మంచి ఆప్షన్ కావచ్చు. లావా కంపెనీ ఇటీవల భారత్‌లో విడుదల చేసిన తన సరికొత్త 'లావా విరాట్ V1 ప్రో 5G' (Lava Virat V1 Pro 5G) అమ్మకాలు ఆగస్టు 31న మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభం కానున్నాయి. తక్కువ ధరలో 6,000mAh పెద్ద బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 50MP AI కెమెరా వంటి అద్భుతమైన ఫీచర్లను ఈ ఫోన్‌లో అందించారు. లావా విరాట్ సిరీస్‌లో భాగంగా వస్తున్న ఈ మూడో మోడల్‌ ధర, ఆఫర్లు , స్పెసిఫికేషన్లపై ఒక లుక్కేద్దాం.

ధర , బ్యాంక్ ఆఫర్లు

లావా విరాట్ V1 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. దీని అసలు మార్కెట్ ధర రూ.15,999 కాగా, లాంచ్ ఆఫర్‌లో భాగంగా కంపెనీ రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్‌ను పూర్తిగా ఉపయోగించుకుంటే ఈ ఫోన్‌ను కేవలం రూ.13,999 కే సొంతం చేసుకోవచ్చు. ఆగస్టు 31న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ (Flipkart) వేదికగా దీని మొదటి సేల్ ప్రారంభం కానుంది. ఈ డివైజ్ 'సిక్కిం మిడ్‌నైట్' , 'స్పితి ఫ్రాస్ట్' అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

డిస్‌ప్లే , పెర్ఫార్మెన్స్

ఈ ఫోన్ 6.75-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేయడం వల్ల గేమ్స్ ఆడేటప్పుడు, వీడియోలు చూసేటప్పుడు లేదా యాప్స్‌లో స్క్రోల్ చేసేటప్పుడు యూజర్లకు చాలా స్మూత్ అనుభూతి లభిస్తుంది. దీని డిస్‌ప్లే పిక్సెల్ డెన్సిటీ 260 ppiగా ఉంది. దుమ్ము, నీటి చినుకుల నుండి ఫోన్‌ను రక్షించడానికి దీనికి IP64 రేటింగ్ అందించారు. ప్రాసెసింగ్ విషయానికి వస్తే.. ఇందులో ఆక్టా-కోర్ యూనిసోక్ T8200 (Unisoc T8200) చిప్‌సెట్‌ను ఉపయోగించారు. 6GB RAM + 128GB స్టోరేజ్ కాంబినేషన్ వల్ల రోజువారీ వాడకం, సోషల్ మీడియా బ్రౌజింగ్, మల్టీటాస్కింగ్ , క్యాజువల్ గేమింగ్‌కు ఇది చక్కగా సరిపోతుంది.

కెమెరా, బ్యాటరీ

ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసం ఇందులో 50MP AI ప్రైమరీ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ మాట్లాడటానికి ముందుభాగంలో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇక ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని భారీ 6,000mAh బ్యాటరీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా సులభంగా వాడుకోవచ్చు. కనెక్టివిటీ కోసం 5G, 4G LTE, వై-ఫై 5, బ్లూటూత్ 5.4, , GPS వంటి అన్ని ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story