New Aadhaar Update: ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు.. ఫోన్ నుంచే మొబైల్ నంబర్ మార్చుకోండి!
New Aadhaar Update: ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ మరియు చిరునామా మార్పు కోసం UIDAI సరికొత్త ఆన్‌లైన్ సదుపాయాన్ని తీసుకొచ్చింది.
New Aadhaar Update: ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు.. ఫోన్ నుంచే మొబైల్ నంబర్ మార్చుకోండి!
New Aadhaar Update: ఆధార్ కార్డులో మార్పులు చేర్పుల కోసం ఆధార్ కేంద్రాల వద్ద పడిగాపులు కాసే రోజులకు కాలం చెల్లింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సామాన్యుల సౌకర్యార్థం 'mAadhaar' యాప్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఇకపై మొబైల్ నంబర్ అప్‌డేట్ చేయడం లేదా చిరునామా మార్చుకోవడం వంటి పనులను మీ స్మార్ట్‌ఫోన్ నుంచే నిమిషాల్లో పూర్తి చేసుకోవచ్చు.
గతంలో మొబైల్ నంబర్ లింక్ చేయాలన్నా లేదా మార్చాలన్నా బయోమెట్రిక్ తప్పనిసరి ఉండేది. కానీ ఇప్పుడు mAadhaar యాప్‌లో 'అప్‌డేట్ మొబైల్ నంబర్' ఆప్షన్ ద్వారా కొత్త నంబర్‌ను సులభంగా నమోదు చేయవచ్చు. ఓటీపీ (OTP) ధృవీకరణ తర్వాత, అత్యాధునిక 'ఫేస్ ఆథెంటికేషన్' (Face Authentication) ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసే వెసులుబాటు కల్పించారు.
చిరునామా మార్పు కోసం యాప్‌లోని 'అడ్రస్ అప్‌డేట్' విభాగంలో కొత్త వివరాలను నమోదు చేసి, సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం రూ. 75 రుసుము చెల్లిస్తే సరిపోతుంది. ఆన్‌లైన్‌లోనే అభ్యర్థన (Request) స్థితిని కూడా ట్రాక్ చేసుకోవచ్చు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు, వృద్ధులు ఆధార్ కేంద్రాలకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ డిజిటల్ సేవలు ఎంతో మేలు చేస్తాయి. సరైన ఇంటర్నెట్ కనెక్షన్ మరియు ధృవీకరణ పత్రాలు ఉంటే చాలు, ఇంట్లో కూర్చునే ఆధార్ సేవలను పొందవచ్చు.




