iPhone 17 Pro Max Discount: యాపిల్ యూజర్లకు సూపర్ న్యూస్.. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ తగ్గింపు.. వివరాలు ఇవిగో..

iPhone 17 Pro Max Discount: యాపిల్ ఐఫోన్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త. ఇండియాలో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది.

Ravi
By Ravi
Updated on: 12 Jun 2026 1:11 PM IST
iPhone
X

iPhone 17 Pro Max Discount: యాపిల్ యూజర్లకు సూపర్ న్యూస్.. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ తగ్గింపు.. వివరాలు ఇవిగో..

iPhone 17 Pro Max Discount: సాధారణంగా మార్కెట్లోకి కొత్త ఐఫోన్ సిరీస్ అడుగుపెట్టబోతోందంటే చాలు.. అంతకుముందు ఉన్న పాత మోడల్స్ ధరలు భారీగా పడిపోతుంటాయి. తాజాగా ఇండియాలో యాపిల్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త వచ్చేసింది. త్వరలో సరికొత్త 'ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్' లాంచ్ కానున్న తరుణంలో, దాని మునుపటి వర్షన్ అయిన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర అమాంతం తగ్గింది.

ప్రీమియం ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను శాసిస్తున్న ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్‌పై ఏకంగా రూ. 11,508 ధర తగ్గింది. కెమెరా, ప్రాసెసర్, డిస్‌ప్లే పరంగా అద్భుతమైన పనితీరు కనబరిచే ఈ ఫోన్‌ను ఇంత భారీ డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయం అని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే.. త్వరలోనే యాపిల్ సంస్థ తమ తదుపరి ఫ్లాగ్‌షిప్ మోడల్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. కొత్త సిరీస్ లాంచ్‌కు ముందు తమ పాత ఇన్వెంటరీని క్లియర్ చేసుకోవడంలో భాగంగా యాపిల్ సహా ఇతర ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు ఈ తరహా భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తుంటాయని నిపుణులు అంటున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story