రూ.12,999కే 5G ఫోన్.. 6000mAh బ్యాటరీతో MIVI ONE 5G..!
దేశీయ ప్రముఖ ఆడియో , టెక్ బ్రాండ్ 'మివి' (MIVI), భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అధికారికంగా అడుగుపెడుతూ MIVI ONE 5G పేరుతో తన మొదటి 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల
MIVI ONE 5G
దేశీయ ప్రముఖ ఆడియో , టెక్ బ్రాండ్ 'మివి' (MIVI), భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అధికారికంగా అడుగుపెడుతూ MIVI ONE 5G పేరుతో తన మొదటి 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. బడ్జెట్ ధరలోనే వేగవంతమైన 5G కనెక్టివిటీ, పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీ , స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను ఈ ఫోన్‌లో అందించారు. ఈ MIVI ONE 5G స్మార్ట్‌ఫోన్ మొత్తం మూడు విభిన్న ర్యామ్ , స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 4GB RAM + 128GB వేరియంట్ ధర రూ. 12,999గా ఉండగా, 6GB RAM + 128GB వేరియంట్ ధర రూ. 14,999 , 8GB RAM + 128GB టాప్ వేరియంట్ ధర రూ. 16,499గా కంపెనీ నిర్ణయించింది. కొనుగోలు సమయంలో UPI ద్వారా చెల్లింపులు చేసే కస్టమర్లకు రూ. 1,000 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుందని కంపెనీ ప్రకటించింది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో రాబోయే బిగ్ బిలియన్ డేస్ (Big Billion Days) సేల్ సందర్భంగా అక్టోబర్ 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
డిస్‌ప్లే , స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్
ఈ ఫోన్‌లో 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయడం వల్ల వీడియోలు చూడటంలో, సోషల్ మీడియా స్క్రోలింగ్‌లో , సాధారణ వినియోగంలో స్మూత్ అనుభూతి లభిస్తుంది. పనితీరు విషయానికి వస్తే, ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 (Snapdragon 4 Gen 2) 5G ప్రాసెసర్‌ను ఉపయోగించారు. అలాగే వేగవంతమైన మల్టీటాస్కింగ్ కోసం LPDDR4X ర్యామ్ సాంకేతికతను సమకూర్చారు.
కెమెరా , ఆపరేటింగ్ సిస్టమ్
ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసం ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అమర్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ మాట్లాడేందుకు ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇక సాఫ్ట్‌వేర్ పరంగా ఎలాంటి అనవసరమైన యాప్‌లు లేకుండా క్లీన్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే 'ప్యూర్ ఆండ్రాయిడ్ 16' (Pure Android 16) ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. దీనితో పాటు మెరుగైన కాలింగ్ అనుభవం కోసం ప్రత్యేకంగా 'Super Call Feature'ను కూడా అందించారు.
బ్యాటరీ సామర్థ్యం , సర్వీస్ సపోర్ట్
రోజంతా నిరంతరాయంగా పనిచేసేందుకు ఇందులో 6000mAh భారీ బ్యాటరీని అమర్చారు. దీనికి తోడు ఛార్జింగ్ కోసం 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను ఇచ్చారు. అమ్మకాల తర్వాత కస్టమర్ సర్వీస్ కోసం భారత్‌లోని 19,000 కంటే ఎక్కువ పిన్‌కోడ్‌లలో సర్వీస్ అందుబాటులో ఉందని, దేశవ్యాప్తంగా 500కి పైగా అధికారిక సర్వీస్ సెంటర్లు సిద్ధంగా ఉన్నాయని MIVI సంస్థ తెలిపింది. బడ్జెట్ ధరలో 5G ఫోన్ కోరుకునే వారికి ఇది ఒక మంచి ప్రత్యామ్నాయంగా నిలవనుంది.




