Moto Pad 70 : ఆగస్టు 9న 5G ట్యాబ్లెట్ సునామీ.. ఫ్రీ Moto Penతో వస్తున్న Moto Pad 70.!

Moto Pad 70 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా భారత మార్కెట్లోకి సరికొత్త ట్యాబ్లెట్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. 'మోటో ప్యాడ్ 70' (Moto Pad 70)

G Krishna
Updated on: 25 July 2026 6:15 PM IST
Moto Pad 70
X

Moto Pad 70

Moto Pad 70 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా భారత మార్కెట్లోకి సరికొత్త ట్యాబ్లెట్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. 'మోటో ప్యాడ్ 70' (Moto Pad 70) పేరుతో రాబోతున్న ఈ 5G ట్యాబ్లెట్ వచ్చే నెల ఆగస్టు 9న లాంచ్ కానున్నట్లు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) అధికారికంగా ధృవీకరించింది. ఫ్లిప్‌కార్ట్‌లో దీనికి సంబంధించిన ప్రత్యేక మైక్రోసైట్ ప్రత్యక్షమవ్వడంతో ఈ ప్యాడ్ ప్రధాన ఫీచర్లు , విశేషాలు అధికారికంగా వెలుగులోకి వచ్చాయి.

డిస్‌ప్లే విశేషాలు , ఉచితంగా 'మోటో పెన్'

ఈ మోటో ప్యాడ్ 70 ట్యాబ్లెట్ 12.1 అంగుళాల పెద్ద 2.5K రెజల్యూషన్ డిస్‌ప్లేతో రానుంది. ఇందులో 800 నిట్స్ వరకు హై బ్రైట్‌నెస్ మోడ్ సపోర్ట్ ఉండటంతో పాటు DCI-P3 కలర్ గేమట్‌లో 96 శాతం కవరేజ్ అందుతోంది. దీనివల్ల గేమింగ్, కంటెంట్ వీక్షణకు అద్భుతమైన విజువల్ అనుభూతి లభిస్తుంది. ఈ ట్యాబ్లెట్ కొనుగోలుదారులకు ప్రత్యేకంగా 'మోటో పెన్' (Moto Pen) ను కంపెనీ బాక్స్‌లోనే ఉచితంగా అందించనుంది. ఈ పెన్‌లో 4096 లెవెల్స్ ప్రెజర్ సెన్సిటివిటీ, టిల్ట్ డిటెక్షన్ , పామ్ రిజెక్షన్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉండటం వల్ల నోట్స్ రాసుకోవడానికి, డిజిటల్ రైటింగ్ , డ్రాయింగ్ పనులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

శక్తివంతమైన ప్రాసెసర్, ఏఐ ఫీచర్లు

వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ ట్యాబ్లెట్‌లో ఎన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను పొందుపరిచారు. ఏఐ రీరైట్, సర్కిల్ టూ సెర్చ్, ఏఐ సమ్మరీ, ఏఐ కంటిన్యూ రైటింగ్‌తో పాటు గూగుల్ జెమిని ఇంటిగ్రేషన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. పనితీరు పరంగా ఈ ట్యాబ్లెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది కేవలం 6.29 మిమీ అత్యంత సన్నని మందంతో, 530 గ్రాముల బరువుతో ఎంతో స్లిమ్‌గా , తేలికగా ఉంటుంది. అంతేకాకుండా మ్యాగ్నెటిక్ స్నాప్-ఆన్ సపోర్ట్ ఉన్న మోటో ఫోలియో కీబోర్డ్‌తో కూడా ఇది అనుకూలంగా పనిచేస్తుంది.

భారీ బ్యాటరీ , సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు

ఈ మోటో ప్యాడ్‌లో ఏకంగా 10,200mAh భారీ బ్యాటరీని అమర్చారు. దీనికి 68W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. డాల్బీ ఆట్మాస్ సపోర్ట్‌తో కూడిన నాలుగు (క్వాడ్) స్పీకర్లు మల్టీమీడియా అనుభూతిని పెంచుతాయి. వేర్వేరు డివైజ్‌ల మధ్య ఫైళ్లను వేగంగా షేర్ చేసుకోవడానికి 'స్మార్ట్ కనెక్ట్' ఫీచర్ ఇందులో ఉంది. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రానుండగా, ఆండ్రాయిడ్ 18 వరకు ఓఎస్ అప్‌డేట్‌లను , 2030 వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఇస్తామని మోటోరోలా హామీ ఇచ్చింది. మరోవైపు, మోటో ప్యాడ్ 70 కంటే ముందే జూలై 31న 'మోటో ప్యాడ్ 70 గ్రూవ్' (Moto Pad 70 Groove) అనే మరో మోడల్‌ను కూడా 12.1 ఇంచుల 2.5K డిస్‌ప్లే, 10,200mAh బ్యాటరీతో ఇండియాలో లాంచ్ చేసేందుకు మోటోరోలా సిద్ధమైంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story