Motorola: భారత మార్కెట్లోకి మోటోరోలా సరికొత్త సంచలనం.. 'ఎడ్జ్ 70 ప్రో' లాంచ్ డేట్ ఫిక్స్..!

Motorola Edge 70 Pro India: మోటోరోలా తన ఫ్టాగ్ షిప్ ఫోన్ 'ఎడ్జ్ 70 ప్రో'ను భారత్ లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. కళ్లు చెదిరే ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో గట్టి పోటీని ఇవ్వనుంది.

Venkat
Published on: 16 April 2026 10:53 AM IST
Motorola
X

Motorola: భారత మార్కెట్లోకి మోటోరోలా సరికొత్త సంచలనం.. 'ఎడ్జ్ 70 ప్రో' లాంచ్ డేట్ ఫిక్స్..!

Motorola Edge 70 Pro India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ 'ఎడ్జ్ 70 ప్రో'ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. అద్భుతమైన కెమెరా, ఫవర్ ఫుల్ బ్యాటరీ, అత్యాధునిక కృత్రిమ మేధస్సు (AI) ఫీచర్లతో రానున్న ఈ ఫోన్, స్మార్ట్‌ఫోన్ ప్రియుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. ఈ నెలాఖరున ఈ ఫోన్ అధికారికంగా సందడి చేయనుంది.

విడుదల తేదీ..

మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో భారతదేశంలో ఏప్రిల్ 22న ఘనంగా విడుదల కానుంది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు ఆకర్షణీయమైన రంగులలో లభించనుంది. పాంటోన్ టీ (శాటిన్ ఫినిష్), పాంటోన్ టైటాన్ (ఫ్యాబ్రిక్ ఫినిష్), పాంటోన్ లిల్లీ వైట్ (మార్బుల్ ఫినిష్) వేరియంట్లలో ఇది కనువిందు చేయనుంది.

అద్భుతమైన డిస్ప్లే..

ఈ ఫోన్ 6.8 అంగుళాల అమోలెడ్ డిస్ప్లేతో వస్తోంది. ఇది 1.5కే నాణ్యతను, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటును కలిగి ఉంటుంది. గరిష్టంగా 5,200 నిట్స్ బ్రైట్‌నెస్ ఇవ్వడం వల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐని వాడారు. అంతేకాకుండా నీరు, ధూళి నుంచి రక్షణ కోసం ఐపీ68/69 రేటింగ్‌తో వస్తోంది.

పవర్ ఫుల్ ప్రాసెసర్..

మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్‌ట్రీమ్ చిప్‌సెట్‌తో పనిచేసే ఈ ఫోన్, వేగవంతమైన పనితీరును అందిస్తుంది. ఇందులో 12జీబీ ర్యామ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత 'హలో యూఐ'తో ఇది నడుస్తుంది. దీనికి మూడు ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, ఐదేళ్ల భద్రతా అప్‌డేట్లు లభిస్తాయి. మోటో ఏఐ, జెమిని, పెర్ప్లెక్సిటీ వంటి అధునాతన కృత్రిమ మేధస్సు ఫీచర్లు ఇందులో ప్రత్యేక ఆకర్షణ.

కెమెరా, బ్యాటరీ విశేషాలు..

ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా (సోనీ సెన్సార్), 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. అన్ని కెమెరాల ద్వారా 4కే నాణ్యతతో వీడియోలను రికార్డ్ చేయవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో భారీ 6,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది రెండు రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీనిని త్వరగా ఛార్జ్ చేయడానికి 90 వాట్ల టర్బో ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది.

తక్కువ కాంతిలో కూడా అద్భుతమైన ఫోటోలు తీయగల సామర్థ్యం, శక్తివంతమైన కూలింగ్ సిస్టమ్, డాల్బీ అట్మోస్ సౌండ్ వంటి ఫీచర్లతో మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో గట్టి పోటీని ఇవ్వనుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story