Moto G37 : 7000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మోటో G37 సిరీస్ ఎంట్రీ.!
Moto G37 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా భారత మార్కెట్లోకి తన సరికొత్త 'G' సిరీస్ లైనప్‌ను మంగళవారం అధికారికంగా విడుదల చేసింది.
Moto-G37
Moto G37 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా భారత మార్కెట్లోకి తన సరికొత్త 'G' సిరీస్ లైనప్‌ను మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులను టార్గెట్ చేస్తూ మోటో G37, మోటో G37 పవర్ అనే రెండు సరికొత్త హ్యాండ్‌సెట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ రెండు ఫోన్లు కూడా లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌తో పనిచేసే ఈ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. సాధారణ మోటో G37 మోడల్ 5,200mAh బ్యాటరీతో వస్తుండగా, మోటో G37 పవర్ మోడల్ ఏకంగా 7,000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది.
అద్భుతమైన డిస్‌ప్లే.. స్క్రీన్ ప్రొటెక్షన్
ఈ రెండు డ్యూయల్ సిమ్ (నానో + నానో) మోటోరోలా హ్యాండ్‌సెట్లు డిస్‌ప్లే విషయంలో ఒకేలాంటి ఫీచర్లను పంచుకుంటున్నాయి. వీటిలో 8-బిట్ 6.6-అంగుళాల HD+ LCD స్క్రీన్‌ను అందించారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, 120Hz టచ్ సాంప్లింగ్ రేట్ , 264ppi పిక్సెల్ డెన్సిటీని సపోర్ట్ చేస్తుంది. అవుట్‌డోర్ ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1,050 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇందులో ఇచ్చారు. అంతేకాకుండా, స్క్రీన్‌కు గీతలు పడకుండా , కింద పడినా పగలకుండా ఉండేందుకు వీలుగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను ఈ బడ్జెట్ ఫోన్లలో అమర్చడం విశేషం.
పవర్‌ఫుల్ ప్రాసెసర్.. ర్యామ్ బూస్ట్ ఫీచర్
పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ రెండు మోటోరోలా ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 6400 SoC ప్రాసెసర్‌తో రన్ అవుతాయి. అయితే స్టోరేజ్ వేరియంట్ల పరంగా ఈ రెండింటి మధ్య తేడాలు ఉన్నాయి. బేస్ మోడల్ అయిన మోటో G37 ఫోన్ 4GB ర్యామ్ , 64GB ఇన్బిల్ట్ స్టోరేజ్‌తో వస్తుండగా, మోటో G37 పవర్ మోడల్ గరిష్టంగా 8GB ర్యామ్ , 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తుంది. ఈ రెండు ఫోన్లలోనూ మోటోరోలాకు చెందిన 'ర్యామ్ బూస్ట్' ఫీచర్ అందుబాటులో ఉంది. దీని ద్వారా వర్చువల్‌గా ర్యామ్‌ను 12GB వరకు పెంచుకోవచ్చు. అలాగే మైక్రో ఎస్‌డీ కార్డ్ సహాయంతో స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించుకునే సదుపాయం కూడా ఉంది.
కెమెరా సెటప్.. అదనపు ఫీచర్లు
ఫోటోగ్రఫీ కోసం ఈ రెండు హ్యాండ్‌సెట్లలో వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో f/1.8 ఎపర్చరు , ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్ (PDAF) కలిగిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ప్రధానమైనదిగా ఉంది. ఇక సెకండరీ కెమెరాగా 2-ఇన్-1 లైట్ సెన్సార్‌ను ఇచ్చారు, ఇది యాంబియంట్ లైట్ సెన్సార్‌తో పాటు ఫ్లికర్ డిటెక్టర్‌గా పనిచేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, వైఫై 5, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌తో పాటు సంగీత ప్రియుల కోసం 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను కూడా కొనసాగించారు.
సైజు, ఛార్జింగ్ వివరాలు
భారీ బ్యాటరీ కారణంగా మోటో G37 పవర్ మోడల్ కొంచెం మందంగా, బరువుగా ఉంటుంది. సాధారణ మోటో G37 ఫోన్ 7.85mm మందంతో, 191 గ్రాముల బరువు ఉంటే.. G37 పవర్ మోడల్ 8.89mm మందంతో, 215 గ్రాముల బరువు ఉంటుంది. భద్రత కోసం వీటికి సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. అలాగే ఇవి IP64 రేటింగ్‌తో ధూళి, నీటి తుంపర్ల నుండి రక్షణ ఇవ్వడమే కాకుండా, కఠినమైన పరిస్థితులను తట్టుకునేలా MIL-STD-810H మిలిటరీ సర్టిఫికేషన్‌ను కలిగి ఉన్నాయి. బ్యాటరీ విషయానికి వస్తే, మోటో G37 ఫోన్ 20W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5,200mAh బ్యాటరీని కలిగి ఉండగా, మోటో G37 పవర్ వేరియంట్ 30W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 7,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ రెండు ఫోన్లు కూడా ఇతర డివైజ్‌లను ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా 6W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయడం అదనపు ప్రయోజనం.




