Vulgar Reels: ఛీ ఛీ.. వ్యూస్ కోసం ఇంత దిగజారాలా..? కూతురితో తండ్రి పాడు పనులు

Vulgar Reels: ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యూస్, ఫాలోవర్ల కోసం ఒక కుటుంబం పవిత్రమైన బంధాలను భ్రష్టు పట్టిస్తూ చేస్తున్న అసభ్యకరమైన రీల్స్ సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

Naresh.k
Updated on: 1 July 2026 11:59 AM IST
Vulgar Reels
X

Vulgar Reels: ఛీ ఛీ.. వ్యూస్ కోసం ఇంత దిగజారాలా..? కూతురితో తండ్రి పాడు పనులు 

Instagram Reels: ఇంటర్నెట్ యుగం.. చేతిలో స్మార్ట్‌ఫోన్.. సోషల్ మీడియాలో అకౌంట్ ఉంటే చాలు, కొందరికి లోకం దానంతట అదే లొంగిపోయినట్లు అనిపిస్తోంది. లైక్‌లు, వ్యూస్, ఫాలోవర్ల కోసం ఈ మధ్యకాలంలో కొందరు ఎంతటికైనా తెగిస్తున్నారు. పవిత్రమైన కుటుంబ బంధాలను, సమాజం గర్వించే సామాజిక విలువలను నడిరోడ్డుపై భ్రష్టు పట్టిస్తున్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక కుటుంబం చేస్తున్న వికృతమైన కంటెంట్ సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారడంతో పాటు నెటిజన్ల నుండి తీవ్ర ఆగ్రహాన్ని మూటగట్టుకుంటోంది.

వివరాల్లోకి వెళితే.. ఇన్‌స్టాగ్రామ్‌లో తండ్రి, తల్లి, కూతురు కలిసి ఒక ‘ఫ్యామిలీ అకౌంట్’ నడుపుతున్నారు. పేరుకు కుటుంబమే కానీ, ఈ అకౌంట్ నుంచి సమాజం తలదించుకునేలా అత్యంత ఘోరమైన, అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రదర్శిస్తున్నారు. ఇప్పటివరకు ఇంటర్నెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని ఒక అత్యంత చెడు సందేశాన్ని, వికృత సంస్కృతిని వీరు ప్రచారం చేస్తున్నారు. మరింత ఆశ్చర్యకరమైన, ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ చెత్త కంటెంట్‌ను చూడటానికి ఏకంగా 86,000 మందికి పైగా ఫాలోవర్లు ఉండటం సామాజిక విశ్లేషకులను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.

మొదట్లో ఈ అకౌంట్‌లో తల్లీ-కొడుకుల వీడియోలు వచ్చేవి. అందులో పవిత్రమైన మాతృత్వాన్ని కించపరిచేలా, వారిద్దరూ అసభ్యకరంగా ఒకరినొకరు తాకుతూ రీల్స్ చేసేవారు. నెటిజన్లు దీనిపై ఛీత్కరించుకుంటుండగానే, ఇప్పుడు వారు మరో దారుణమైన వికృత కంటెంట్‌కు తెరలేపారు.

సమాజంలో తండ్రి-కూతుళ్ల బంధాన్ని కూడా వదలకుండా వికృత చేష్టలు మొదలుపెట్టారు. తండ్రి తన యవ్వనంలో ఉన్న కూతురిని అసభ్యకరంగా ముద్దు పెట్టుకుంటూ, స్మూచ్ చేస్తూ రీల్స్ తీసి పోస్ట్ చేస్తుండటం తీవ్ర కలకలం రేపుతోంది. ఒక కూతురికి తండ్రితో ఉండే బంధం ఎంతో అమూల్యమైనది, గౌరవప్రదమైనది.. కొండంత రక్షణ ఇచ్చేది. కానీ, కేవలం వ్యూస్, ఫాలోవర్ల వేటలో పడి ఆ పవిత్రమైన బంధం యొక్క గౌరవాన్ని ఈ కుటుంబం మట్టిపాలు చేస్తోందని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఈ వికృత వీడియోలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. సోషల్ మీడియా వేదికగా నిలదీస్తూ కామెంట్లు పెడుతున్నారు. డబ్బులు, వ్యూస్ కోసం సోషల్ మీడియాలో బంధాలను ఇంతలా భ్రష్టు పట్టిస్తారా? కన్న కూతురితో ఏ తండ్రి అయినా ఇలా ప్రవర్తిస్తాడా? వీరికి అసలు సంస్కారమే లేదా? అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story