Ninja CRISPi: భారత్‌లోకి వైరల్ గ్లాస్ ఎయిర్ ఫ్రయ్యర్.. దీని స్పెషాలిటీ ఏంటంటే?
Ninja CRISPi గ్లాస్ ఎయిర్ ఫ్రయ్యర్ భారత్‌లోకి వచ్చింది. పారదర్శక గ్లాస్ కంటైనర్లు, 360° ఎయిర్ సర్క్యులేషన్, ReCrisp ఫీచర్ ప్రత్యేకం.
Ninja CRISPi
ప్రముఖ హోమ్ అప్లయెన్సెస్ బ్రాండ్ SharkNinjaకు చెందిన Ninja CRISPi™ Portable Glass Cooking System భారత్‌లోకి అడుగుపెట్టింది. ప్రపంచ మార్కెట్లలో ఇప్పటికే విపరీతమైన ఆదరణ పొందిన ఈ గ్లాస్ ఎయిర్ ఫ్రయ్యర్‌ను ఇప్పుడు భారతీయ వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు.
సాధారణ ఎయిర్ ఫ్రయ్యర్లకు భిన్నంగా Ninja CRISPiలో పారదర్శకమైన గ్లాస్ కంటైనర్‌ను ఉపయోగించారు. దీంతో ఆహారం ఉడుకుతున్న సమయంలో లోపల ఏం జరుగుతుందో నేరుగా చూడొచ్చు. ఆహారం క్రిస్పీగా, బ్రౌన్‌గా మారే ప్రక్రియను మూత తీయకుండానే గమనించే అవకాశం ఉంటుంది.
ఈ ఉత్పత్తి కోసం కంపెనీ ‘Looks Good. Cooks Better.’ అనే ప్రచారాన్ని నిర్వహిస్తోంది. వేగంగా వంట చేయడంతో పాటు వంట ప్రక్రియను సులభంగా గమనించాలనుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందించారు. స్నాక్స్ నుంచి కుటుంబానికి సరిపడే భోజనం వరకు వివిధ రకాల వంటకాలను ఇందులో తయారు చేసుకోవచ్చు.
Ninja CRISPiలో 360 డిగ్రీల గాలి ప్రసరణ వ్యవస్థ ఉంది. దీని వల్ల వేడి గాలి అన్ని వైపులా సమానంగా ప్రసరించి ఆహారం సమానంగా ఉడికేందుకు, క్రిస్పీగా మారేందుకు సహాయపడుతుంది.
ఇందులో ఉపయోగించిన CleanCrisp™ గ్లాస్ పారదర్శకంగా ఉండటంతో పాటు నాన్ టాక్సిక్, షాక్ రెసిస్టెంట్‌గా ఉంటుంది. వంట సమయంలో ఆహారంలోని తేమ, రుచి నిలిచేలా ఈ గ్లాస్ కంటైనర్ రూపొందించారు. ముఖ్యంగా వంట చేసిన తర్వాత అదే పాత్రలో ఆహారాన్ని సర్వ్ చేసి, నిల్వ చేసుకోవచ్చు.
Ninja CRISPiతో 1.4 లీటర్లు, 3.8 లీటర్ల సామర్థ్యం కలిగిన రెండు బోరోసిలికేట్ గ్లాస్ కంటైనర్లు లభిస్తాయి. ఒక వ్యక్తికి సరిపడే చిన్న భోజనం నుంచి కుటుంబమంతా తినే పరిమాణం వరకు అవసరానికి అనుగుణంగా వీటిని ఉపయోగించుకోవచ్చు.
ఈ ఎయిర్ ఫ్రయ్యర్‌లోని ReCrisp ఫంక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే వండిన ఆహారానికి మళ్లీ క్రిస్పీ టెక్స్చర్‌ను తీసుకురావడానికి ఇది ఉపయోగపడుతుంది. సమోసాలు, పకోడీలు, పిజ్జా, మిగిలిపోయిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.
రెండు CleanCrisp™ గ్లాస్ కంటైనర్లు PFAS రహితంగా ఉంటాయి. వీటిని వంట చేయడానికి, ఆహారాన్ని సర్వ్ చేయడానికి, నిల్వ చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు.
భారత్‌లో లాంచ్‌కు ముందే Ninja CRISPiకి మంచి స్పందన లభించింది. ప్రీ-ఆర్డర్లకు వచ్చిన ఆదరణతో తొలి పరిమిత బ్యాచ్ కొద్ది రోజుల్లోనే పూర్తిగా అమ్ముడైనట్లు SharkNinja APAC వెల్లడించింది.
“CRISPi అనేది Ninja బ్రాండ్ ఆలోచనా విధానానికి మంచి ఉదాహరణ. ఇప్పటికే ఉన్న ఎయిర్ ఫ్రయ్యర్ విభాగాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించి, వినియోగదారులకు ఉపయోగకరంగా ఉండేలా దీనిని రూపొందించాం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే మంచి ఆదరణ పొందిన ఈ ఉత్పత్తిని భారత్‌కు తీసుకురావడం ఆనందంగా ఉంది” అని SharkNinja APAC ఇండియా ఎండీ, కంట్రీ హెడ్ Mrunmay Mehta తెలిపారు.
“భారతీయ ఇళ్లకు కొత్త సాంకేతికతను అందించడమే మా లక్ష్యం. ఆధునిక వంటగదులకు Ninja CRISPi మంచి ఎంపికగా ఉంటుంది. మా కస్టమర్లకు దీనిని అందించేందుకు SharkNinjaతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది” అని విజయ్ సేల్స్ డైరెక్టర్ Nilesh Gupta పేర్కొన్నారు.
SharkNinja APAC అనేది Shark, Ninja బ్రాండ్లకు సంబంధించిన ఆసియా పసిఫిక్ ప్రాంత లైసెన్స్‌డ్ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. రోజువారీ జీవితాన్ని సులభతరం చేసే వినూత్న ఉత్పత్తులను స్థానిక వినియోగదారులకు అందించడంపై సంస్థ దృష్టి సారిస్తోంది. భారత్‌లో Shark, Ninja ఉత్పత్తులు ప్రముఖ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా అందుబాటులో ఉన్నాయి.




