Nothing new phones 2027: ఒకట్రెండు కాదు.. నథింగ్‌ నుంచి ఏకంగా 6 ఫోన్లు.. ఇది పెద్ద ప్లానే భయ్యో..!

Nothing new phones 2027: నథింగ్‌ (Nothing) 2027 ఏడాదికి సంబంధించి తన ప్రొడక్ట్ ప్లాన్‌ను ప్రకటించింది. 2026తో పోలిస్తే వచ్చే ఏడాది రెట్టింపు కంటే ఎక్కువ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Venkat
Published on: 30 Oct 2026 7:30 PM IST
Nothing new phones 2027
X

Nothing new phones 2027: ఒకట్రెండు కాదు.. నథింగ్‌ నుంచి ఏకంగా 6 ఫోన్లు.. ఇది పెద్ద ప్లానే భయ్యో..!

Nothing new phones 2027: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నథింగ్‌ (Nothing) వచ్చే ఏడాది మరిన్ని కొత్త ఫోన్లతో మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది. 2027లో 2026తో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ సంఖ్యలో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో వచ్చే ఏడాది నథింగ్‌ నుంచి ఆరు కంటే ఎక్కువ ఫోన్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

నథింగ్‌ ఇండియా సహ వ్యవస్థాపకుడు, ప్రెసిడెంట్ అకిస్ ఎవాంజెలిడిస్ (Akis Evangelidis) ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 2026లో కంపెనీ మూడు స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చింది. నథింగ్‌ ఫోన్ 4a (Nothing Phone 4a), నథింగ్‌ ఫోన్ 4a ప్రో (Nothing Phone 4a Pro), నథింగ్‌ ఫోన్ 4b (Nothing Phone 4b) ఈ ఏడాది విడుదలైన మోడళ్లు.

2027లో ఆరు కంటే ఎక్కువ ఫోన్లు?

2026లో విడుదల చేసిన మూడు ఫోన్ల కంటే వచ్చే ఏడాది రెట్టింపు కంటే ఎక్కువ మోడళ్లను తీసుకురావాలని నథింగ్‌ నిర్ణయించడంతో, 2027లో కనీసం ఆరు కంటే ఎక్కువ హ్యాండ్‌సెట్లను చూడొచ్చని అంచనా. అయితే కంపెనీ ఇప్పటివరకు ఈ ఫోన్ల పేర్లు, లాంచ్ తేదీలు, స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు.

కొత్త ఫోన్లపై ముందుగానే చూపించనున్న నథింగ్‌

నథింగ్‌ త్వరలో ఢిల్లీలోని తన ఇండియా కార్యాలయంలో నథింగ్‌ కో-క్రియేషన్ ప్రోగ్రామ్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో 2027లో విడుదల చేయబోయే కొన్ని కొత్త డివైజ్‌లను కమ్యూనిటీ సభ్యులకు ముందుగానే చూపించనుంది. కొత్త ఉత్పత్తులపై కమ్యూనిటీ సభ్యుల అభిప్రాయాలను కూడా కంపెనీ తీసుకోనుంది. ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో మాత్రమే సీట్లు ఉన్నాయని నథింగ్‌ తెలిపింది.

ఫ్లాగ్‌షిప్ ఫోన్‌కు ఎందుకు బ్రేక్?

2026లో నథింగ్‌ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయకూడదని నిర్ణయించింది. ర్యామ్, స్టోరేజ్ చిప్‌ల ధరలు పెరగడం వల్ల తయారీ వ్యయాలు పెరగడమే దీనికి ప్రధాన కారణంగా కంపెనీ పేర్కొంది. నథింగ్‌ అనుబంధ బ్రాండ్ సీఎంఎఫ్ (CMF) కూడా 2026లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయలేదు.

ఇదే సమయంలో భారత మార్కెట్లో నథింగ్‌ ఫోన్ 4bతో కంపెనీ కొత్త బడ్జెట్ సిరీస్‌ను ప్రారంభించింది. జూలై 7న విడుదలైన ఈ ఫోన్ 6GB + 128GB వేరియంట్‌కు ₹29,999 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. 2026లో నథింగ్‌, సీఎంఎఫ్ రెండూ స్మార్ట్‌ఫోన్లతో పాటు కొత్త ఆడియో ఉత్పత్తులను కూడా భారత మార్కెట్లో తీసుకొచ్చాయి.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.