ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. రూ.27,999 నుంచే..!
Nothing Phone 4a Pro: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో నథింగ్ ఫోన్ 4 సిరీస్‌తో పాటు ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్స్, స్మార్ట్‌వాచ్‌లు, ఛార్జర్లపై భారీ తగ్గింపు ధరలు ప్రకటించింది.
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. రూ.27,999 నుంచే..!
Nothing Phone 4a Pro: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా నథింగ్ (Nothing) తన ఫోన్ 4 సిరీస్‌పై ప్రత్యేక ధరలను ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ సేల్ అక్టోబర్ 9న ప్రారంభం కానుండగా, అర్హత ఉన్న కస్టమర్లకు అక్టోబర్ 8 నుంచే ముందస్తు యాక్సెస్ ఉంటుంది.
నథింగ్ ఫోన్ (4a) ప్రోలో 8GB + 128GB వేరియంట్ రూ.49,999కు లభిస్తుంది. 8GB + 256GB మోడల్ రూ.52,999, 12GB + 256GB వేరియంట్ రూ.54,999గా ఉంది. ఈ మోడళ్లకు రూ.4,500 బ్యాంక్ ఆఫర్‌తో పాటు రూ.500 ఎక్స్చేంజ్ బోనస్ వర్తిస్తుంది.
నథింగ్ ఫోన్ (4a) 6GB + 128GB మోడల్‌పై రూ.3,000 ధర తగ్గింపుతో, బ్యాంక్ ఆఫర్, ఎక్స్చేంజ్ ప్రయోజనాల తర్వాత రూ.32,999కు అందుబాటులో ఉంటుంది. 8GB + 128GB, 8GB + 256GB, 12GB + 256GB వేరియంట్లు వరుసగా రూ.40,999, రూ.45,999, రూ.46,999 ధరలకు లభిస్తాయి.
నథింగ్ ఫోన్ (4b)లో 6GB + 128GB వేరియంట్ రూ.27,999కి దిగొచ్చింది. 8GB + 128GB మోడల్ రూ.35,999, 8GB + 256GB వేరియంట్ రూ.36,999గా ఉంది.
ఫోన్లతో పాటు నథింగ్ హెడ్‌ఫోన్ (1) రూ.16,999కు, ఇయర్ ఓపెన్ రూ.14,999కు, ఇయర్ రూ.7,999కు, ఇయర్ (a) రూ.4,999కు లభిస్తాయి. CMF ఆడియో ఉత్పత్తులు, వాచ్‌లు, ఛార్జర్లపైనా తగ్గింపు ధరలు ఉన్నాయి.




