DLSS 5: ఎన్విడియా నుంచి DLSS 5 గ్రాఫిక్స్ లో అద్భుతాలు చేయనున్న AI మోడల్!
DLSS 5: ఎన్విడియా నుంచి DLSS 5 రాబోతోంది. ఇది గ్రాఫిక్స్ లో అద్భుతాలు చేసే AI మోడల్ గా చెబుతున్నారు. ఈ వేసవిలో రానున్న DLSS 5 గురించి పూర్తి వివరాలు
DLSS 5
DLSS 5: కంప్యూటర్ గ్రాఫిక్స్ లో 2018లో రియల్-టైమ్ రే ట్రేసింగ్ వచ్చింది. ఆ తరువాతగా మళ్ళీ అంతకు మించిన టెక్నాలజీని ఎన్విడియా ఇప్పుడు తీసుకువస్తోంది. అదే DLSS 5. GTCలో ఈ వారం DLSS 5 గురించి ఎన్విడియా ప్రకటించింది. DLSS 5 అనేది ఒక రియల్-టైమ్ న్యూరల్ రెండరింగ్ మోడల్. ఇది గేమ్ ఫ్రేమ్‌లలోకి ఫోటోరియల్ లైటింగ్, మెటీరియల్స్ ను ఇన్సెర్ట్ చేస్తుంది. దీనివలన ఇప్పటివరకూ ఫ్రేమ్ రెండర్ చేయడానికి నిముషాలు.. గంటలు తీసుకుంటున్న హాలీవుడ్ VFX పైప్లైన్లకు మాత్రమే పరిమితమైన విజువల్ క్వాలిటీని రియల్ టైమ్ లోనే అందిస్తుంది.
టెక్ దిగ్గజం జెన్సన్ హువాంగ్ DLSS 5ను మాన్యువల్ రెండరింగ్ అలాగే జనరేటివ్ AIల కలయికగా అభివర్ణిస్తున్నారు. ఈ టెక్నాలజీ ఏదైనా గేమ్ లోని కలర్, మోషన్ వెక్టార్స్ ను ఇన్ ఫుట్ గా తీసుకుంటుంది. దానిని ట్రైన్డ్ AI మోడల్ ను ఉపయోగించి ఫోటో రియలిస్టిక్ లైటింగ్, మెటీరియల్స్ తో ఇమేజిని రీ కంస్ట్రక్ట్ చేస్తుంది. ఇది ఒరిజినల్ 3D కంటెంట్ కు ఏ మాత్రం ఇబ్బంది కలగనీయకుండా.. ఫ్రేమ్ టు ఫ్రేమ్ స్టెబిలిటీని నిలుపుతూ వర్క్ చేస్తుంది. ఇది 4K రిజల్యూషన్ వరకు రియల్ టైమ్‌లో నడుస్తుంది.
DLSS 5 పనిచేసే విధానం:
ఒకే ఫ్రేమ్‌ను విశ్లేషించడం ద్వారా, పాత్రలు, జుట్టు, డ్రెస్, ట్రాన్స్పరెంట్ స్కిన్ వంటి టిపికల్ ఇమేజినరీని, ఆలాగే దృశ్యంలో ఉన్న లైటింగ్ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఈ మోడల్ కు పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇస్తారు.
స్కిన్ మీద ఉపరితల లైట్ రిఫ్లేక్షన్, క్లాత్ లో ఉండే సున్నితమైన మెరుపు, జుట్టుపై లైట్ మెటీరియల్ రిఫ్లేక్షన్స్, ఇవన్నీ సాంప్రదాయ రియల్-టైమ్ రెండరింగ్ తో కచ్చితమైన ఒరిజినల్ ఎఫెక్ట్ తో తీసుకువస్తాయి.
DLSS 5 తో వస్తున్న గేమ్‌లలో స్టార్ఫీల్డ్, హాగ్వార్ట్స్ లెగసీ, రెసిడెంట్ ఈవిల్ రిక్వియమ్ ఉన్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో చేరిన పబ్లిషర్లలో బెథెస్డా, క్యాప్కామ్, యుబిసాఫ్ట్, వార్నర్ బ్రదర్స్ గేమ్స్ ఉన్నాయి. అస్సాసిన్స్ క్రీడ్ షాడోస్, స్టార్ఫీల్డ్, రెసిడెంట్ ఈవిల్ రిక్వియమ్, ది ఎల్డర్ స్క్రాల్స్ IV: ఒబ్లివియన్ రీమాస్టర్డ్ వంటి టైటిల్స్‌కు DLSS 5 ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. GTC డెమో ప్రస్తుతం రెండు RTX 5090లపై నడుస్తోంది—ఒకటి రెండరింగ్ కోసం, మరొకటి DLSS 5 మోడల్‌కు ప్రత్యేకంగా. కానీ, రిలీజ్ కంటే ముందే దీనిని ఒకే GPU కోసం ఆప్టిమైజ్ చేస్తామని ఎన్విడియా చెబుతోంది. DLSS 5 ఈ వేసవిలోనే అందుబాటులోకి వస్తుంది.




