అక్టోబర్‌లో రిలీజ్ కానున్న స్మార్ట్ ఫోన్స్ ఇవే.. అందరి చూపు ఆఫోన్‌పైనే..!

Upcoming Smartphones India: అక్టోబర్ 2026లో భారత మార్కెట్‌లో పలు కొత్త స్మార్ట్‌ఫోన్లు అడుగుపెట్టనున్నాయి. కెమెరా, డిస్‌ప్లే, ప్రాసెసర్‌తో పాటు భారీ బ్యాటరీలు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నాయి.

Venkat
Published on: 29 Sept 2026 8:06 PM IST
Upcoming Smartphones India
X

అక్టోబర్‌లో రిలీజ్ కానున్న స్మార్ట్ ఫోన్స్ ఇవే.. అందరి చూపు ఆఫోన్‌పైనే..!

Upcoming Smartphones India: అక్టోబర్ 2026లో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ కొత్త మోడళ్లతో కళకళలాడనుంది. వీటిలో కొన్ని ఫోన్ల విడుదల తేదీలు అధికారికంగా ఖరారయ్యాయి. మరికొన్ని మోడళ్లపై లీకులు, నివేదికలు ఆధారంగా అంచనాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా భారీ బ్యాటరీలు ఈసారి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కొన్ని ఫోన్స్‌ 8,000mAh, 10,000mAh బ్యాటరీలతో రానున్నాయి. కెమెరా విభాగంలో Zeiss సహకారంతో రూపొందిన సెన్సర్లు, ప్రత్యేక టెలిఫోటో కెమెరాలు కూడా కొత్త అనుభవాన్ని అందించే అవకాశం ఉంది. డిస్‌ప్లే విషయంలో 120Hz, 144Hz రిఫ్రెష్ రేట్లకు ప్రాధాన్యం కనిపిస్తోంది. ఈ జాబితాలో Vivo V80, Vivo S2 FE, Vivo X Fold 6, Oppo F35 Pro, Motorola Edge 70 Neo ఉన్నాయి. వీటిలో ప్రతి మోడల్‌కు ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి.

మొదటగా వివో వి80 (Vivo V80) అక్టోబర్ 6న భారత్‌లో అధికారికంగా విడుదల కానుంది. ఇందులో Zeiss సహకారంతో రూపొందిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండొచ్చని సమాచారం. 50MP ప్రధాన కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 8MP అల్ట్రావైడ్ సెన్సర్ ఉండనున్నాయి. టెలిఫోటో కెమెరా 3x ఆప్టికల్ జూమ్, 100x డిజిటల్ జూమ్‌కు మద్దతు ఇవ్వొచ్చని అంచనా. ముందు భాగంలో 50MP కెమెరా ఉండనుంది. 6.59 అంగుళాల 1.5K OLED స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 7,200mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉండనున్నాయి.

అదే రోజు వివో ఎస్2 ఎఫ్ఈ (Vivo S2 FE) కూడా విడుదల కానుంది. దీని ప్రత్యేకత 10,000mAh బ్యాటరీ. ఇది Vivo S సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద బ్యాటరీగా నిలిచే అవకాశం ఉంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్, 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉండొచ్చని సమాచారం. MediaTek Dimensity 7300E చిప్‌సెట్, 50MP ప్రధాన కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉండే అవకాశం ఉంది.

వివో ఎక్స్ ఫోల్డ్ 6 (Vivo X Fold 6) ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 1న, భారత్‌లో అక్టోబర్ 6న వచ్చే అవకాశం ఉంది. 8.02 అంగుళాల ప్రధాన స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 200MP కెమెరా, 50MP అల్ట్రావైడ్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా వంటి స్పెసిఫికేషన్లు అంచనా వేస్తున్నారు. 7,000mAh బ్యాటరీ, 80W వైర్డ్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఉండొచ్చని సమాచారం.

ఒప్పో ఎఫ్35 ప్రో (Oppo F35 Pro) అక్టోబర్ ప్రారంభంలో రావచ్చని తెలుస్తోంది. దీని స్పెసిఫికేషన్లపై లీకుల్లో భిన్నమైన సమాచారం ఉంది. Snapdragon 4 Gen 5కు బదులుగా MediaTek Dimensity 7360 Max చిప్ ఉండొచ్చనే కొత్త అంచనా వెలువడింది. 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్, 50MP ఫ్రంట్ కెమెరా, IP69K రేటింగ్ ఉండొచ్చని సమాచారం.

మోటరోలా ఎడ్జ్ 70 నియో (Motorola Edge 70 Neo)పై కూడా ఆసక్తి నెలకొంది. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. Android 17 బీటా సైన్‌అప్ పేజీలో పేరు కనిపించడంతో భారత్‌లో విడుదలకు సంకేతాలు కనిపించాయి. Geekbench వివరాల ప్రకారం Snapdragon 7s Gen 3, 6GB RAM, Android 16 ఉండే అవకాశం ఉంది. కెమెరా విషయంలో 200MP లేదా 50MP Sony LYT-710 సెన్సర్‌ ఎంపికలపై లీకులు ఉన్నాయి.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.