OnePlus 16 : 165Hz డిస్‌ప్లే.. 200MP కెమెరా.. వన్‌ప్లస్ 16 లీక్ ఇదే

OnePlus 16 : ప్రసిద్ధ టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ తన తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'వన్‌ప్లస్ 16' (OnePlus 16)ను ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి తెచ్చేందుకు..

G Krishna
Published on: 18 Sept 2026 1:10 PM IST
OnePlus 16 leaked
X

OnePlus 16 leaked 

OnePlus 16 : ప్రసిద్ధ టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ తన తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'వన్‌ప్లస్ 16' (OnePlus 16)ను ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. అధికారిక లాంచ్ తేదీని కంపెనీ ఇంకా వెల్లడించనప్పటికీ, ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని కీలక ఫీచర్లను టీజ్ చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే ప్రముఖ లీక్‌స్టర్ 'డిజిటల్ చాట్ స్టేషన్' ఈ ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లను సోషల్ మీడియాలో లీక్ చేశారు.

అద్భుతమైన డిస్‌ప్లే , స్మూత్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్

వన్‌ప్లస్ 16 స్మార్ట్‌ఫోన్ BOE సంస్థ తయారు చేసిన X4 డిస్‌ప్లే ప్యానెల్‌తో రానున్నట్లు లీక్స్ ద్వారా తెలుస్తోంది. ఇది 165Hz గ్లోబల్ రీఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ప్రత్యేకించి గేమింగ్ ప్రియుల కోసం కొన్ని ప్రత్యేక గేమ్‌లలో రీఫ్రెష్ రేట్ ఏకంగా 185Hz వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గతేడాది వచ్చిన వన్‌ప్లస్ 15 తరహాలోనే ఇందులో కూడా అత్యుత్తమ రీఫ్రెష్ రేట్ సపోర్ట్ లభించనుంది. గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి 'విండ్ చేజర్ గేమింగ్ కోర్' , 'ఈ-స్పోర్ట్స్ ట్రిపుల్ చిప్' వంటి ఫీచర్లను కంపెనీ ఇప్పటికే ఖరారు చేసింది.

పవర్‌ఫుల్ ప్రాసెసర్ , ఆపరేటింగ్ సిస్టమ్

ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ తదుపరి తరం శక్తివంతమైన ప్రాసెసర్ అయిన 'స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో' (Snapdragon 8 Elite Gen 6 Pro) తో పనిచేస్తుందని సమాచారం. ఇది TSMC యొక్క 2nm ప్రాసెస్‌పై ఆధారపడి నిర్మించబడింది. ఇందులో ఉన్న ఆక్టా-కోర్ CPU , అడ్రినో 850 GPU ఫోన్ వేగాన్ని, గేమింగ్ పెర్ఫార్మెన్స్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్తాయి. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ ఆధారిత కలర్ OS 17 (ColorOS 17) ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ కానుంది.

200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెటప్

ఫొటోగ్రఫీ విభాగంలో వన్‌ప్లస్ 16 భారీ అప్‌గ్రేడ్‌ను పొందనుంది. దీని వెనుక వైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. ఇందులో 1/1.4-ఇంచ్ సెన్సార్ కలిగిన 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీనికి తోడు 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా , 1/1.95-ఇంచ్ సెన్సార్ కలిగిన 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా అందుబాటులో ఉండనున్నాయి.

భారీ 9,000mAh బ్యాటరీ , ఛార్జింగ్ సపోర్ట్

వన్‌ప్లస్ 16 అత్యంత భారీగా 9,000mAh బ్యాటరీ కెపాసిటీతో (రేటెడ్ కెపాసిటీ 8,780mAh) వచ్చే అవకాశం ఉందని లీక్ ద్వారా వ్యక్తమవుతోంది. ఇది మునుపటి వన్‌ప్లస్ 15లోని 7,300mAh బ్యాటరీ కంటే చాలా పెద్దది. ఈ ఫోన్ డ్యూయల్-సెల్ బ్యాటరీ డిజైన్‌ను కలిగి ఉండి, 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ , 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అయితే వన్‌ప్లస్ 15లో 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఉండగా, ఇందులో 100W ఛార్జింగ్‌ను అందించడం కొద్దిపాటి మార్పుగా చెప్పుకోవచ్చు. కనెక్టివిటీ కోసం N79 5G బ్యాండ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. కంపెనీ త్వరలోనే అధికారిక లాంచ్ తేదీని ప్రకటించనుంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.