OnePlus 16 Leaks: 9,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ప్రకంపనలు.!
OnePlus 16 Leaks: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వన్‌ప్లస్, విలీనమవుతున్నట్లు వార్తలు వచ్చినా తన దూకుడును మాత్రం తగ్గించడం..
oneplus 16 leaks
OnePlus 16 Leaks: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వన్‌ప్లస్.. విలీనమవుతున్నట్లు వార్తలు వచ్చినా తన దూకుడును మాత్రం తగ్గించడం లేదు. ఒప్పో , రియల్మీలతో కలిసి సాగుతున్న ఈ ప్రయాణంలో, రాబోయే ఫ్లాగ్షిప్ ఫోన్ వన్‌ప్లస్ 16 గురించి వస్తున్న లీకులు టెక్ ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా టిప్స్టర్లు వెల్లడించిన అసాధారణమైన బ్యాటరీ సామర్థ్యం , కెమెరా టెక్నాలజీ ఈ ఫోన్‌ను మార్కెట్లో టాప్ మోడల్‌గా నిలబెట్టేలా కనిపిస్తున్నాయి.
ప్రాసెసర్ పవర్.. 5.0GHz అసాధారణ వేగం
వన్‌ప్లస్ 16 కేవలం వేగంగా ఉండటమే కాకుండా, మునుపెన్నడూ లేని విధంగా అత్యున్నత పనితీరును ప్రదర్శించనుంది. అయితే.. ఇందులో క్వాల్కమ్ నుంచి రాబోతున్న అత్యంత శక్తివంతమైన Snapdragon 8 Elite Gen 6 Pro చిప్‌సెట్‌ను (మోడల్ నంబర్ SM8975) వాడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాసెసర్ వేగం ఏకంగా 5GHz వరకు ఉంటుందని సమాచారం. ఇది స్మార్ట్‌ఫోన్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన చిప్సెట్లలో ఒకటిగా నిలవడమే కాకుండా, గేమింగ్ , మల్టీ టాస్కింగ్ అనుభవాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది.
డిస్ప్లే మ్యాజిక్.. 240Hz రిఫ్రెష్ రేట్, సన్నని బెజెల్స్
డిస్ప్లే విభాగంలో కూడా వన్‌ప్లస్ విప్లవాత్మక మార్పులు చేస్తోంది. ఇందులో BOE ప్యానెల్‌తో కూడిన ఫ్లాట్ డిస్ప్లే ఉండనుంది. ఈ స్క్రీన్ 240Hz రిఫ్రెష్ రేట్ వరకు సపోర్ట్ చేసే అవకాశం ఉందని, LTPO , LIPO ప్యాకేజింగ్ టెక్నాలజీల వాడకం వల్ల ఫోన్ చుట్టూ ఉండే బెజెల్స్ కేవలం 1mm కి తగ్గిపోతాయని నివేదికలు తెలుపుతున్నాయి. దీనివల్ల వినియోగదారులకు అంచుల్లేని అద్భుతమైన విజువల్ అనుభూతి కలుగుతుంది.
అద్భుతమైన కెమెరా
ఫోటోగ్రఫీ పరంగా వన్‌ప్లస్ 16 ఒక భారీ ముందడుగు వేయనుంది. ఇందులో 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను ప్రధాన ఆకర్షణగా నిలపబోతున్నారు. ఈ సెన్సార్ పరిమాణం కూడా చాలా పెద్దదిగా (1/1.x-inch) ఉండే అవకాశం ఉందని లీకులు సూచిస్తున్నాయి. దీనికి తోడుగా 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా , మరో 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్ ఉండబోతున్నాయి. ఈ కాంబినేషన్ ద్వారా అత్యంత స్పష్టమైన జూమింగ్ , లో-లైట్ ఫోటోగ్రఫీ సాధ్యమవుతుంది.
ఊహకందని 9,000mAh సామర్థ్యం
ఇక అందరినీ విస్తుపోయేలా చేసే విషయం ఏమిటంటే, ఈ ఫోన్లో ఏకంగా 9,000mAh సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీని అమర్చబోతున్నట్లు లీకులు స్పష్టం చేస్తున్నాయి. సాధారణ ఫ్లాగ్షిప్ ఫోన్లలో ఉండే బ్యాటరీల కంటే ఇది దాదాపు రెట్టింపు సామర్థ్యం కావడం గమనార్హం. దీనివల్ల ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే రోజులకు తరబడి బ్యాటరీ లైఫ్ వచ్చే అవకాశం ఉంది, ఇది హెవీ యూజర్లకు ఒక గొప్ప వరంగా మారుతుంది.
ఇతర అదనపు ఫీచర్లు
వన్‌ప్లస్ 16 ఫోన్ కేవలం హార్డ్‌వేర్ పరంగానే కాకుండా సాఫ్ట్వేర్ , AI పరంగా కూడా అడ్వాన్స్డ్ గా ఉండబోతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక AI బటన్‌ను కూడా కేటాయించినట్లు సమాచారం. ఆండ్రాయిడ్ 17 ఆధారిత OxygenOS 17 సాఫ్ట్‌వేర్‌తో రాబోతున్న ఈ ఫోన్లో హ్యాప్టిక్స్ కోసం X-axis మోటార్, సిమ్మెట్రికల్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు , పూర్తిస్థాయి వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. అయితే.. వన్‌ప్లస్ 15 తరహాలోనే.. ఈ కొత్త ఫోన్ కూడా 2026 చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్పెసిఫికేషన్లు చూస్తుంటే వన్‌ప్లస్ తన పూర్వ వైభవాన్ని మళ్ళీ దక్కించుకోవడానికి గట్టిగానే సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.




