వన్‌ప్లస్ నుంచి సరికొత్త 'N' సిరీస్.. మార్కెట్లో అత్యంత చౌకైన ఫోన్ ఇదే?
OnePlus N6: అమెజాన్ మైక్రోసైట్ ద్వారా ఈ సరికొత్త వన్‌ప్లస్ N6 డిజైన్, రంగులకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి.
వన్‌ప్లస్ నుంచి సరికొత్త 'N' సిరీస్.. మార్కెట్లో అత్యంత చౌకైన ఫోన్ ఇదే?
OnePlus N6: భారతీయ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు సరికొత్త టెక్నాలజీ అనుభూతిని అందించేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం వన్‌ప్లస్ సిద్ధమైంది. దేశీయ మార్కెట్లో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ, సరికొత్త ‘N’ సిరీస్‌ను భారత్‌లో పరిచయం చేయబోతోంది. ఇందులో భాగంగా వన్‌ప్లస్ N6 స్మార్ట్‌ఫోన్ త్వరలోనే విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన అధికారిక టీజర్, డిజైన్ వివరాలు ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
భారత్‌లో వన్‌ప్లస్ కొత్త ప్రయాణం.. త్వరలో వన్‌ప్లస్ N6..
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ భారత్‌లో సరికొత్త సిరీస్‌ను ప్రారంభించేందుకు అడుగులు వేస్తోంది. గురువారం నాడు కంపెనీ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. భారత మార్కెట్లోకి సరికొత్తగా అడుగుపెడుతున్న ఈ సిరీస్ లో మొదటి ఫోన్‌గా 'వన్‌ప్లస్ N6' రాబోతోంది. ఈ మేరకు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఒక ప్రత్యేక మైక్రోసైట్ కూడా లైవ్ అయింది. ఈ వెబ్‌పేజీ శీర్షిక ఆధారంగా ఈ కొత్త ఫోన్ పేరు వన్‌ప్లస్ N6 అని స్పష్టంగా తెలుస్తోంది. సాధారణంగా వన్‌ప్లస్ నుంచి వచ్చే ప్రీమియం ఫోన్లను భిన్నంగా సామాన్య వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ సరికొత్త బడ్జెట్ సిరీస్‌ను కంపెనీ రంగంలోకి దించుతోంది.
ఆకట్టుకునే డిజైన్.. అదిరిపోయే రంగులు..
అమెజాన్ మైక్రోసైట్ ద్వారా ఈ సరికొత్త వన్‌ప్లస్ N6 డిజైన్, రంగులకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫ్లాట్ రియర్ ప్యానెల్, ఫ్లాట్ ఫ్రేమ్‌తో క్లాసిక్ లుక్‌ను కలిగి ఉండబోతోంది. ఫోన్ వెనుక భాగంలో పైవైపున కెమెరా మాడ్యూల్ కాస్త ఉబ్బెత్తుగా డిజైన్ చేశారు. స్మార్ట్‌ఫోన్ కుడి వైపున పవర్ బటన్ తో పాటు వాల్యూమ్ కంట్రోల్స్ అమర్చారు. ఎడమ వైపును ఎలాంటి బటన్లు లేకుండా పూర్తిగా క్లీన్‌గా వదిలేశారు. ఇక రంగుల విషయానికి వస్తే, ఈ ఫోన్ కనీసం బ్లాక్, బ్లాక్, గ్రీన్ రంగుల్లో లభిస్తుందని టీజర్ ద్వారా స్పష్టమవుతోంది.
అత్యంత చౌకైన వన్‌ప్లస్ ఫోన్‌గా రికార్డ్..?
ఇటీవల కాలంలో మార్కెట్లోకి వచ్చిన వన్‌ప్లస్ నోర్డ్ CE 6 లైట్ మోడల్ ప్రస్తుతానికి కంపెనీ నుంచి లభిస్తున్న అత్యంత చౌకైన ఫోన్‌గా ఉంది. అయితే, రాబోయే వన్‌ప్లస్ N సిరీస్ ఫోన్లు అంతకంటే తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అందుతున్న లీకుల ప్రకారం.. ఈ సరికొత్త సిరీస్‌లోని కొన్ని మోడళ్ల ధర రూ. 20,000 కంటే తక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఇదే నిజమైతే, మధ్యతరగతి స్మార్ట్‌ఫోన్ ప్రియులకు వన్‌ప్లస్ బ్రాండ్ మరింత దగ్గర కానుంది.
జులైలోనే లాంచ్.. అంచనాలు భారీ..!
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సరికొత్త వన్‌ప్లస్ N6 స్మార్ట్‌ఫోన్ వచ్చే జులై నెలలోనే భారత మార్కెట్లో అధికారికంగా విడుదల కానుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వన్‌ప్లస్ నోర్డ్ CE 6 లైట్ బేస్ వేరియంట్ ధర రూ. 20,999 గా ఉంది. రాబోయే N సిరీస్ అంతకంటే తక్కువ ధరకే వస్తుండటంతో, ఇది నోర్డ్ లైట్ సిరీస్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఖచ్చితమైన విడుదల తేదీ, ధరల వివరాలను కంపెనీ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.
భారతీయ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు వన్‌ప్లస్ వేస్తున్న అడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తక్కువ ధరలో ప్రీమియం బ్రాండ్ అనుభవాన్ని సొంతం చేసుకోవాలనుకునే వారికి ఈ వన్‌ప్లస్ N6 ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారనుంది. త్వరలోనే ఈ ఫోన్‌కు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ రానున్నాయి.




