OnePlus N6 Lite: వన్ ప్లస్ నుంచి అత్యంత చౌకైన ఫోన్.. సెప్టెంబర్ 22న గ్రాండ్ లాంచ్, ఫీచర్లు అదుర్స్!
OnePlus N6 Lite: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా పేరుగాంచిన వన్‌ప్లస్ భారతీయ వినియోగదారుల కోసం మరో సరికొత్త బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది.
OnePlus N6 Lite
OnePlus N6 Lite: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా పేరుగాంచిన వన్‌ప్లస్ భారతీయ వినియోగదారుల కోసం మరో సరికొత్త బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. ఇప్పటివరకు విడుదలైన ఫోన్ల కంటే అత్యంత సరసమైన ధరలో సరికొత్త వన్ ప్లస్ N6 లైట్‌ను లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 22, 2026న ఈ ఫోన్ విడుదల కానుండటంతో టెక్ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
అద్భుతమైన డిస్ప్లే, భారీ బ్యాటరీ
ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో అనేక ప్రత్యేక ఫీచర్లు ఉండనున్నట్లు లీకులు వస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో 6.75 అంగుళాల భారీ ఫ్లాట్ డిస్ప్లే ఇవ్వనున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు ఎక్వా టచ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుందని సమాచారం. దీనివల్ల ఫోన్ టచ్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్ ప్రధాన హైలైట్ దీని బ్యాటరీ అనే చెప్పాలి. ఇందులో ఏకంగా 7,000mAh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీని ఇస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ ఫోన్ ఏకంగా మూడు రోజుల పాటు నిరంతరం పనిచేస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
ఏఐ ఫీచర్లు, ప్రాసెసర్, కెమెరా విశేషాలు
తక్కువ ధరలో వస్తున్నప్పటికీ, ఈ ఫోన్లో ఆధునిక కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత ఫీచర్లను అందిస్తున్నారు. దీనివల్ల వినియోగదారులకు మరింత మెరుగైన అనుభూతి దక్కుతుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే, కొన్ని లీకుల ప్రకారం ఇది యూనిసోక్ T7250 ప్రాసెసర్‌తో పాటు 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రావచ్చు. మరోవైపు కొన్ని నివేదికలు ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 ప్రాసెసర్ ఉండవచ్చని చెబుతున్నాయి. ఇక కెమెరా పరంగా వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉండొచ్చు. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో పాటు 5 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉండే అవకాశం ఉంది.
ధర ఎంత ఉండొచ్చు? ఎక్కడ కొనొచ్చు?
సెప్టెంబర్ 22న అధికారికంగా లాంచ్ కానున్న ఈ ఫోన్ అమ్మకాలు లాంచ్ అయిన తర్వాతి నుంచి ప్రారంభమవుతాయి. వినియోగదారులు దీనిని వన్‌ప్లస్ అధికారిక వెబ్సైట్, అమెజాన్ ఇండియా అలాగే వన్‌ప్లస్ స్టోర్ యాప్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అధికారిక ధర ఇంకా వెల్లడి కాలేదు కానీ, మార్కెట్ అంచనాల ప్రకారం ఈ ఫోన్ ప్రారంభ ధర సుమారు రూ.18,999 ఉండవచ్చని తెలుస్తోంది. తక్కువ ధరలో భారీ బ్యాటరీ, పెద్ద డిస్ప్లే కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.




