OnePlus India Launch: వన్‌ప్లస్ నుంచి ఊహించని ట్విస్ట్: బడ్జెట్ సెగ్మెంట్‌లోకి మరో ఫోన్.. ఫీచర్లు చూస్తే పరేషానే..!
OnePlus India Launch: భారత మార్కెట్లో సరసమైన ధరకే బ్రాండెడ్ మొబైల్ కోరుకునే వారి కోసం వన్‌ప్లస్ ఈ సరికొత్త 4G ఫోన్‌ను సిద్ధం చేస్తోంది.
OnePlus India Launch: వన్‌ప్లస్ నుంచి ఊహించని ట్విస్ట్: బడ్జెట్ సెగ్మెంట్‌లోకి మరో ఫోన్.. ఫీచర్లు చూస్తే పరేషానే..!
OnePlus 4G Phone: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ భారత మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని సరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది. 5G హవా నడుస్తున్న తరుణంలో, బడ్జెట్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా 4G స్మార్ట్‌ఫోన్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. వచ్చే సెప్టెంబర్ నెలలోనే ఈ ఆసక్తికర డివైస్ భారతీయ వినియోగదారుల ముందుకు రానున్నట్లు సమాచారం.
ప్రముఖ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పంచుకున్న వివరాల ప్రకారం, ప్రముఖ టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ వచ్చే సెప్టెంబర్‌లో సరికొత్త 4G మొబైల్‌ను భారత మార్కెట్లోకి తేనుంది. ఈ హ్యాండ్‌సెట్ కేవలం మన దేశానికి మాత్రమే ప్రత్యేకం కానుంది. ఈ ఏడాది భారత్‌లో కంపెనీ విడుదల చేయబోయే ఆఖరి స్మార్ట్‌ఫోన్ ఇదే కావచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇతర వన్‌ప్లస్ మోడల్స్ అన్నీ 5G సదుపాయంతో రాగా, ఇది కేవలం 4G కనెక్టివిటీతోనే రాబోతుండటం గమనార్హం. ఎంట్రీ-లెవల్ బడ్జెట్ వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
వన్‌ప్లస్ N6x స్థానంలో సరికొత్త మోడల్?
ఇటీవలే జులై 31న లాంచ్ అయిన వన్‌ప్లస్ N6x స్థానాన్ని ఈ కొత్త 4G ఫోన్ భర్తీ చేసే అవకాశం ఉంది. కంపెనీ ప్రవేశపెట్టిన ఎన్ సిరీస్‌లో N6x బడ్జెట్ శ్రేణిగా నిలిచింది. దాని ప్రాథమిక వేరియంట్ 4GB ర్యామ్, 64GB స్టోరేజ్‌తో రూ. 18,999 ధరకు, 4GB ర్యామ్ తో పాటు 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 20,999 ధరకు మార్కెట్లోకి వచ్చాయి. అయితే సరికొత్త 4G వేరియంట్ మరింత చౌకగా లభించే అవకాశం ఉంది.
మునుపటి ఫీచర్ల ఆధారంగా అంచనాలు..
గత మోడల్ వన్‌ప్లస్ N6x ఫీచర్లను పరిశీలిస్తే, అందులో 6.8-అంగుళాల HD+ 120Hz డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6360 అపెక్స్ ప్రాసెసర్ అందించారు. ఫోటోల కోసం 13-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, సెల్ఫీల కోసం 5-మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. అలాగే 15W చార్జింగ్ సపోర్ట్‌తో కూడిన భారీ 7,000mAh బ్యాటరీ ని అమర్చారు. ఇప్పుడు రాబోయే 4G ఫోన్‌లో కూడా దాదాపు ఇలాంటి సమతుల్య స్పెసిఫికేషన్లు ఉండే అవకాశం ఉంది.




