GPT-6 Astra: AGI దిశగా OpenAI సంచలనం..మానవాళికి పెను ప్రమాదం!
GPT-6 Astra: OpenAI తన అత్యంత అధునాతన ఏఐ మోడల్ 'GPT-6 Astra'ను ఆవిష్కరించింది.
GPT-6 Astra: AGI దిశగా OpenAI సంచలనం..మానవాళికి పెను ప్రమాదం!
GPT-6 Astra: ప్రపంచ కృత్రిమ మేధస్సు రంగంలో మరో విప్లవాత్మక అధ్యాయం ప్రారంభమైంది. టెక్ ప్రపంచాన్ని శాసిస్తున్న OpenAI సంస్థ, తన అత్యంత అధునాతన మోడల్ 'GPT-6 Astra'ను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది.
ఇప్పటివరకు వచ్చిన AI మోడళ్లన్నింటికంటే ఇది అత్యంత శక్తివంతమైనదని, మానవ మేధస్సుకు సరిసాటిగా పనిచేస్తుందని సంస్థ సగర్వంగా ప్రకటించింది. సాధారణ AI మోడళ్లలాగా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికే పరిమితం కాకుండా, ఒక మనిషిలా కంప్యూటర్‌ను నేరుగా ఆపరేట్ చేసే అసాధారణ సామర్థ్యం Astra సొంతం.
ఉద్యోగాల కోసం శోధించడం, విస్తృతమైన పరిశోధనలు చేయడం, నివేదికలు తయారు చేయడం , సాంకేతిక సమస్యలను చిటికెలో పరిష్కరించడం వంటి బహుళ దశల పనులను ఇది స్వయంగా పూర్తి చేస్తుంది.
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, డేటా విశ్లేషణ, సైబర్ భద్రతా విభాగాలలో Astra చూపించే వేగం, ఖచ్చితత్వం నిపుణులనే ఆశ్చర్యపరుస్తోంది. GPT-6 Astra రాక అనేది ఒక తరాల మార్పు లాంటిది. భవిష్యత్తులో మానవాళి యుగంలోకి అడుగుపెట్టిన చారిత్రాత్మక ఘట్టంగా దీనిని గుర్తుంచుకుంటారని OpenAI అధ్యక్షుడు
గ్రెగ్ బ్రాక్‌మన్ చెప్పుకొచ్చారు. GPT-6 Astra రాకతో విద్యాసంస్థలు, ఆసుపత్రులు, పరిశ్రమలు,ప్రభుత్వ సేవల రూపురేఖలు మారబోతున్నాయి. ముఖ్యంగా దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఈ కొత్త మోడల్ పట్ల విపరీతమైన ఆసక్తి వ్యక్తమవుతోంది. అయితే, ఈ స్థాయిలో వేగంగా పెరుగుతున్న ఏఐ సామర్థ్యం పలు ఆందోళనలకూ దారితీస్తోంది.
ఈ మోడల్‌కు సైబర్ సెక్యూరిటీ లోపాలను గుర్తించి, వాటిని ఉపయోగించుకునే శక్తి ఎక్కువ. అందుకే OpenAI దీనికి ప్రత్యేక భద్రతా ప్రమాణాలను, అవసరమైతే మోడల్ కార్యకలాపాలను నిలిపివేసే అత్యవసర నియంత్రణలను ఏర్పాటు చేసింది.
ఏఐ టెక్నాలజీ భవిష్యత్తులో భూమ్మీద ఉన్న సమస్త మానవుల ఉమ్మడి మేధస్సు కంటే శక్తివంతమైన సూపర్‌హ్యూమన్' స్థాయికి చేరుకుంటుందని టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు.
తగిన నియంత్రణ లేకపోతే, ఇది మానవాళికి అణ్వాయుధాల కంటే ప్రమాదకరంగా మారి మానవ నాగరికతకే ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. GPT-6 Astra రాకతో OpenAI, Google, Microsoft, Meta, Anthropic వంటి టెక్ దిగ్గజాల మధ్య పోటీ మరింత తీవ్రమైంది.
అమెరికా, చైనా, ఐరోపా దేశాలు ఏఐ పరిశోధనల కోసం బిలియన్ల డాలర్లను కుమ్మరిస్తున్నాయి. మరోవైపు, వేగంగా మారుతున్న ఈ సాంకేతిక పరిణామాల వల్ల సాధారణ, పునరావృత పనులు చేసే ఉద్యోగాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
దీనికితోడు వ్యక్తిగత గోప్యత, డేటా భద్రత, తప్పుడు సమాచార వ్యాప్తి వంటి నైతిక సవాళ్లను అధిగమించడానికి ప్రపంచ దేశాలు నూతన విధానాలను రూపొందిస్తున్నాయి. ఏఐ మానవ సామర్థ్యాలను రెట్టింపు చేసే అద్భుత సాధనంగా మారుతుందా లేక నాగరికతకే సవాల్‌గా పరిణమిస్తుందా అనేది రాబోయే కాలమే నిర్ణయించాలి.




