Oppo F35 Series: 10,000mAh బ్యాటరీతో వస్తున్న కొత్త ఫోన్.. లాంచ్ డేట్ ఇదే.!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో (Oppo) భారతీయ వినియోగదారుల ముందుకు తన సరికొత్త 'F35 సిరీస్'ను తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ కొత్త సిరీస్‌ను అక్టోబర్ 5న

G Krishna
Published on: 28 Sept 2026 2:02 PM IST
Oppo F35 Series
X

Oppo F35 Series

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో (Oppo) భారతీయ వినియోగదారుల ముందుకు తన సరికొత్త 'F35 సిరీస్'ను తీసుకురావడానికి సిద్ధమైంది. ఈ కొత్త సిరీస్‌ను అక్టోబర్ 5న అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ తన 'X' (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించింది. ఈ సిరీస్‌లో భాగంగా 'Oppo F35' , 'Oppo F35 Pro' అనే రెండు ఆకర్షణీయమైన మోడళ్లు లాంచ్ కానున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ ప్రో వర్షన్, చైనాలో విడుదలైన Oppo A7 Pro Max కు రీబ్రాండెడ్ మోడల్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టవచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

అమెజాన్ అందుబాటు, ప్రీ-ఆర్డర్లు షురూ

అక్టోబర్ 5న గ్రాండ్ లాంచ్ కానున్న ఈ ఫోన్‌లు ఇప్పటికే ఈ-కామర్స్ దిగ్గజం 'అమెజాన్' (Amazon) ప్లాట్‌ఫామ్‌లో లిస్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. కంపెనీ ఇప్పటికే ప్రీ-ఆర్డర్లను స్వీకరించడం ప్రారంభించిందని తెలుస్తోంది. ట్రెండీగా ఉండే ఆరెంజ్ , వైట్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో మెరిసిపోనుంది.

1.5K రిజల్యూషన్‌తో 6.78 అంగుళాల OLED డిస్‌ప్లే

Oppo F35 Pro మోడల్‌లో 6.78 అంగుళాల అత్యుత్తమ OLED డిస్‌ప్లేను అందించే అవకాశం ఉంది. 1.5K రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌కు ఇది సపోర్ట్ చేయనుంది. ఫలితంగా గేమింగ్ ఆడేటప్పుడు, హై-క్వాలిటీ వీడియోలు చూసేటప్పుడు , రోజూవారీ స్క్రోలింగ్ సమయంలో వినియోగదారులకు అద్భుతమైన, స్మూత్ విజ్యువల్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది.

స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, భారీ స్టోరేజ్

పనితీరు విషయానికి వస్తే, ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 5 (Snapdragon 4 Gen 5) ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ను వాడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ వేగవంతమైన ప్రాసెసర్‌కు తోడుగా 12GB వరకు RAM , 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్‌ను కంపెనీ అందించనుందని తెలుస్తోంది. దీంతో మల్టీటాస్కింగ్, హెవీ యాప్స్ వినియోగం అత్యంత సులువుగా మారుతుంది.

ఆశ్చర్యపరిచే 10,000mAh బ్యాటరీ & 80W ఫాస్ట్ ఛార్జింగ్

ఈ సిరీస్‌లోనే అతిపెద్ద విశేషం దీని బ్యాటరీ కెపాసిటీ! Oppo F35 Pro మోడల్‌లో ఏకంగా 10,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించబోతున్నట్లు వార్తలు ఉత్సాహాన్ని నింపుతున్నాయి. దానికి తోడు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండనుంది. ఇది గనక నిజమైతే, ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజులకు పైగా ఛార్జింగ్ అవసరం లేకుండా నిరంతరాయంగా వాడుకోవచ్చు.

50MP సెల్ఫీ.. మెయిన్ కెమెరా, IP69K రేటింగ్ రక్షణ

కెమెరా విభాగంలో కూడా ఈ ఫోన్ ఏమాత్రం తగ్గేలా లేదు. వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 2MP సెకండరీ కెమెరా, , 10x డిజిటల్ జూమ్ సపోర్ట్ అందుబాటులో ఉండనుంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఏకంగా 50MP ఫ్రంట్ కెమెరాను ఇవ్వడం గమనార్హం.

మరొక ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, ఈ ఫోన్‌కు IP69K వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది. ఇది అత్యంత కఠినమైన దుమ్ము, వేడి నీటి చుక్కల నుంచి ఫోన్‌కు బలమైన రక్షణను ఇస్తుంది. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆధారిత ColorOS 16 ఆపరేటింగ్ సిస్టమ్ , వేగవంతమైన 5G కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో కొలువుదీరనున్నాయి.

భారత్‌లో అంచనా ధర ఎంత ఉండవచ్చు?

ప్రస్తుతానికి Oppo F35, F35 Pro మోడళ్ల అధికారిక ధరలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అక్టోబర్ 5న జరగబోయే లాంచ్ ఈవెంట్‌లో ఈ సిరీస్ ధరలు, లభ్యమయ్యే వేరియంట్లు, బ్యాంక్ ఆఫర్లు , మొదటి సేల్ తేదీలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా బయటకు రానున్నాయి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.