Oppo K14x 5G: రూ.12,999 కే ఒప్పో కొత్త 5G ఫోన్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Oppo K14x 5G: బడ్జెట్ ధరలో ఒప్పో సరికొత్త 5G ధమాకా.. కేవలం రూ. 12,999 ధరకే 'ఒప్పో K14x 5G' కొత్త వేరియంట్ లాంచ్ చేసింది. 6,500mAh భారీ బ్యాటరీ, 50MP AI కెమెరా, 120Hz రిఫ్రెష్ రేట్ వంటి అదిరిపోయే ఫీచర్లు ఈ ఫోన్ సొంతం. ఈ కొత్త మోడల్ ధర, ఆఫర్లు, పూర్తి స్పెసిఫికేషన్లు ఈ స్టోరీలో చూడండి.
Oppo K14x 5G: రూ.12,999 కే ఒప్పో కొత్త 5G ఫోన్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో (Oppo), తన పాపులర్ మోడల్ Oppo K14x 5Gలో సరికొత్త 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న 128GB మోడల్స్‌కు అదనంగా, తక్కువ బడ్జెట్‌లో ఈ కొత్త వెర్షన్‌ను కంపెనీ పరిచయం చేసింది. తక్కువ ధరలో మంచి పర్ఫార్మెన్స్ ఆశించే వారి కోసం ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ధర & ఆఫర్లు..
ఈ కొత్త 4GB + 64GB వేరియంట్ ధరను రూ.12,999గా నిర్ణయించారు. ఇది ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart), ఒప్పో ఈ-స్టోర్‌లో కొనుగోలుకు రెడీగా ఉంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.750 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, 3 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. ఈ ఫోన్ ఐసీ బ్లూ, ప్రిజం వైలెట్ కల్లర్స్‌లో లభిస్తుంది.
ఫీచర్లు ఇవే:
* 6.75-అంగుళాల HD+ డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది ఎండలో కూడా స్పష్టంగా కనిపించేలా 1125 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.
* ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని 6,500mAh బ్యాటరీ. దీనికి తోడు 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
* ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.
* బ్యాక్ సైడ్ 50MP AI మెయిన్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఫోటోలను మెరుగుపరిచేందుకు AI ఎరేజర్, AI అన్‌బ్లర్ వంటి స్మార్ట్ ఫీచర్లను కూడా ఒప్పో అందించింది.
* ఆండ్రాయిడ్ 15.. కలర్ ఓఎస్ 15 (ColorOS 15)పై ఈ ఫోన్ పని చేస్తుంది. 48 నెలల పాటు ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా స్మూత్‌గా పనిచేస్తుందని కంపెనీ హామీ ఇస్తోంది.
* ఈ ఫోన్‌కు IP64 రేటింగ్ ఉంది.
మొత్తానికి రూ.13 వేల లోపు ధరలో హై బ్యాటరీ, 5G కనెక్టివిటీ కోరుకునే వారికి ఒప్పో K14x 5G ఒక మంచి ఆప్షన్‌గా నిలవనుంది టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.




