Oppo: 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ.. గేమింగ్ లవర్స్ కోసం ఒప్పో నుంచి పవర్ ప్యాక్డ్ టాబ్లెట్
Oppo: భారతీయ టెక్ మార్కెట్లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో సరికొత్త కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ టాబ్లెట్‌ను ఆవిష్కరించింది.
Oppo Pad Mini
Oppo: భారతీయ టెక్ మార్కెట్లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో సరికొత్త కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ టాబ్లెట్‌ను ఆవిష్కరించింది. ఒప్పో ప్యాడ్ మిని పేరుతో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ డివైజ్ బెస్ట్ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసింగ్ కెపాసిటీతో రూపొందింది. టాబ్లెట్‌లో సినిమాలు చూడటం, గేమ్స్ ఆడటం, స్టైలస్ సహాయంతో నోట్స్ రాసుకోవడం వంటి పనులను సులభతరం చేసేలా కంపెనీ దీనిని డిజైన్ చేసింది. ప్రీమియం లుక్‌తో రాబోతున్న ఈ టాబ్లెట్ వినియోగదారులకు సరికొత్త డిజిటల్ అనుభవాన్ని అందించనుంది.
అద్భుతమైన డిస్‌ప్లే, మ్యాట్ ఫినిషింగ్
ఒప్పో ప్యాడ్ మిని టాబ్లెట్‌లో 8.8 అంగుళాల 2.5K OLED స్క్రీన్‌ను అమర్చారు. ఇది 2,520×1,680 పిక్సెల్స్ రెజల్యూషన్‌ను కలిగి ఉండి, 144Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే గరిష్టంగా 1,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో పాటు 344 PPI పిక్సెల్ డెన్సిటీని అందిస్తుంది. వెలుతురు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా ప్రత్యేక మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చారు. దీనివల్ల కళ్లపై ఒత్తిడి పడకుండా ఎక్కువ సమయం ఉపయోగించుకునే వెసులుబాటు లభిస్తుంది.
పవర్‌ఫుల్ ప్రాసెసర్, బ్యాటరీ కెపాసిటీ
ఈ కాంపాక్ట్ టాబ్లెట్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో పాటు అడ్రెనో 829 GPUను పొందుపరిచారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ ఓఎస్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇది పనిచేస్తుంది. ఇందులో LPDDR5X ర్యామ్, USF 4.1 స్టోరేజ్ టెక్నాలజీని అందించారు. రోజంతా నిరంతరాయంగా పనిచేసేందుకు వీలుగా 8,000mAh భారీ బ్యాటరీని అమర్చారు. ఇది 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల చాలా తక్కువ సమయంలోనే టాబ్లెట్ పూర్తి ఛార్జింగ్ అవుతుంది.
కెమెరా, కనెక్టివిటీ వివరాలు, విక్రయాలు
కెమెరా విభాగ పరిశీలన చేస్తే వెనుక వైపు 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను, వీడియో కాల్స్, సెల్ఫీల కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను కేటాయించారు. కనెక్టివిటీ కోసం వై-ఫై 7, బ్లూటూత్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ వంటి నూతన ఫీచర్లు ఉన్నాయి. భారత్‌లో 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.94,999గా కంపెనీ నిర్ణయించింది. లావెండర్ రంగులో లభ్యమయ్యే ఈ ఒప్పో ప్యాడ్ మిని అక్టోబర్ 29వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ అలాగే ఒప్పో అధికారిక ఆన్‌లైన్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులోకి రానుంది.




