Oppo Reno17: Oppo Reno 17 Pro కు గ్లోబల్ మార్కెట్లో నో ఎంట్రీ.. ఎందుకంటే..?
Oppo Reno17: చైనాలో లాంచ్‌కు ముందే ఒప్పో రెనో 17 సిరీస్‌పై సంచలన వార్త బయటకు వచ్చింది. ప్రో మోడల్ గ్లోబల్ మార్కెట్‌కు రాకపోవచ్చని టిప్‌స్టర్ చెబుతుండగా, స్టాండర్డ్ రెనో 17 కీలక స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి.
Oppo Reno17: Oppo Reno 17 Pro కు గ్లోబల్ మార్కెట్లో నో ఎంట్రీ.. ఎందుకంటే..?
Oppo Reno 17: చైనా టెక్ దిగ్గజం ఒప్పో తన నెక్స్ట్ జనరేషన్ మిడ్-రేంజ్ సిరీస్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. వచ్చే వారం చైనాలో Oppo Reno 17 సిరీస్ ఆవిష్కరణకు రంగం సిద్ధమైంది. ఈ సిరీస్‌లో కనీసం రెండు మోడళ్లు - Oppo Reno 17, Oppo Reno 17 Pro రానున్నాయి. అయితే లాంచ్‌కు ముందే గ్లోబల్ వెర్షన్లపై కీలక లీక్ వెలుగులోకి వచ్చింది, ఇది టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రో మోడల్‌కు షాక్..!
విశ్వసనీయ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ (@heyitsyogesh) X (ట్విట్టర్) వేదికగా సంచలన విషయాన్ని వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం, Oppo Reno 17 Pro మోడల్ చైనా దాటి బయటకు రాకపోవచ్చు. అంటే గ్లోబల్ మార్కెట్లలో ప్రో వెర్షన్ లాంచ్ అయ్యే అవకాశం లేదు. దీంతో భారత్‌లో ప్రో మోడల్ విడుదలపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి.
ఒప్పో గతంలో కూడా చైనా-ఎక్స్క్లూసివ్ వ్యూహాన్ని అనుసరించింది. ఇప్పుడు మళ్లీ అదే బాటలో నడుస్తున్నట్టు కనిపిస్తోంది. దీంతో ప్రో మోడల్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ తప్పదనే చెప్పాలి.
స్టాండర్డ్ Reno 17: అదిరిపోయే స్పెసిఫికేషన్లు..
మరోవైపు స్టాండర్డ్ Oppo Reno 17 గ్లోబల్ వేరియంట్ కీలక స్పెక్లు లీక్ అయ్యాయి.
లీక్ ప్రకారం..
ప్రాసెసర్: క్వాల్‌కాం Octa-Core Snapdragon 7 Gen 4 చిప్సెట్
డిస్ప్లే: 6.5-అంగుళాల AMOLED డిస్ప్లే, 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్
బ్యాటరీ: భారీ 7,200mAh బ్యాటరీ, 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
OS: లేటెస్ట్ ColorOS 17, Android 17 ఆధారంగా
కెమెరా: వెనుక ట్రిపుల్ 50MP సెటప్, ముందు 50MP సెల్ఫీ కెమెరా
మిడ్-రేంజ్‌లోనే ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు అందిస్తూ ఒప్పో మరోసారి సంచలనానికి సిద్ధమవుతోందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కెమెరాపైనే ప్రత్యేక ఫోకస్..
కెమెరా విషయంలో ఒప్పో ఎలాంటి రాజీ పడటం లేదు. కంపెనీ స్వయంగా Weibo లో ప్రకటించిన వివరాల ప్రకారం, చైనా వేరియంట్ Reno 17 సిరీస్‌లో ట్రిపుల్ 50MP రియర్ కెమెరా సిస్టమ్ ఉంటుంది.
అందులో 50MP ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్, 50MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం హోల్-పంచ్ డిస్ప్లేలో 50MP వైడ్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు.
అంతేకాదు, ఈ సిరీస్ 4K వీడియో రికార్డింగ్ సామర్థ్యంతో రానుంది. ఆరు సెకన్ల వరకు 4K వీడియోలు తీసే Live Photo మోడ్ ను కూడా కంపెనీ ధృవీకరించింది.
లాంచ్ ఎప్పుడు?
ఒప్పో రెనో 17 సిరీస్ చైనాలో సెప్టెంబర్ 16న సాయంత్రం 7 గంటలకు (IST సాయంత్రం 4:30) లాంచ్ కానుంది. ఈ ఫోన్లు మూడు ఆకర్షణీయమైన రంగుల్లో రానున్నాయి - Cocoa Brown, Encounter with the Cat, Ice Moon White.
మొత్తంగా చూస్తే, ప్రో మోడల్ గ్లోబల్ లాంచ్‌పై సందిగ్ధత నెలకొన్నా, స్టాండర్డ్ Reno 17 మాత్రం స్పెసిఫికేషన్ల పరంగా మార్కెట్‌ను షేక్ చేసేలా కనిపిస్తోంది. భారత లాంచ్‌పై అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.




