Oppo Watch 5: లాంచ్‌కు ముందే లీకైన ఒప్పో వాచ్ 5 డిజైన్.. ఫిదా చేస్తోన్న స్క్వేర్ డయల్..!
Oppo Watch 5: ఒప్పో తన కొత్త స్మార్ట్‌వాచ్ ఒప్పో వాచ్ 5ను ఈ నెలలోనే చైనాలో లాంచ్ చేయనుంది. దీంతో పాటు ఒప్పో రెనో 17 సిరీస్, ఒప్పో ప్యాడ్ ఎయిర్ 6ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది.
Oppo Watch 5: లాంచ్‌కు ముందే లీకైన ఒప్పో వాచ్ 5 డిజైన్.. ఫిదా చేస్తోన్న స్క్వేర్ డయల్..!
Oppo Watch 5: ఒప్పో వాచ్ 5 లాంచ్ దగ్గర పడుతున్న వేళ దాని రియల్ లైఫ్ ఫోటో ఆన్‌లైన్‌లో లీకైంది. ఈ వాచ్ డిజైన్ ఒప్పో వాచ్ 4 ప్రోని పోలి ఉందని కనిపిస్తోంది. ఇందులో స్క్వేర్ షేప్ డయల్, ఫ్లాట్ టచ్‌స్క్రీన్ ఉండే అవకాశం ఉంది. కుడివైపు రొటేటింగ్ క్రౌన్ కూడా ఉండవచ్చని అంచనా.
లీకైన ఫోటోలో ఏముంది?
గిజ్మోచైనా (Gizmochina) రిపోర్ట్ ప్రకారం, మ్యూజిక్ గ్రూప్ ఐ-డిల్ (i-dle) సభ్యురాలు సాంగ్ యుకీ బయట ఈ వాచ్‌ను ధరించి కనిపించింది. ఆ ఫోటోలో వాచ్ డిజైన్ స్పష్టంగా కనిపించింది.
స్క్వేర్ ఆకారపు డయల్, చుట్టూ సన్నని బెజెల్స్‌తో టచ్‌స్క్రీన్. వెండి రంగులో మెటల్ ఫ్రేమ్ ఉండే అవకాశం. ఫోటోలో పర్పుల్ రంగు బ్యాండ్ కనిపించింది. కుడివైపు రొటేటింగ్ క్రౌన్.
అల్ట్రా-థిన్ డిజైన్..
ఈ వాచ్ "అల్ట్రా-థిన్" డిజైన్‌తో వస్తుందని రిపోర్ట్ చెబుతోంది. దీని బరువు సుమారు 27 గ్రాములు, మందం 9.2mm ఉంటుందట. ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం అల్లాయ్ మిడ్-ఫ్రేమ్‌ను ఇందులో వాడినట్లు సమాచారం.
లాంచ్, ధర..
ఒప్పో ఈ వాచ్‌ను ఈ నెలలోనే రెనో 17 సిరీస్, ప్యాడ్ ఎయిర్ 6తో కలిపి లాంచ్ చేస్తామని ఇటీవల ప్రకటించింది. ప్రారంభ ధర 1,000 యువాన్లు (సుమారు రూ.14,000) ఉంటుందని రిపోర్టులు చెబుతున్నాయి. ఒప్పో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా చైనాలో ప్రీ-ఆర్డర్‌లు ఇప్పటికే మొదలయ్యాయి. ఆ మైక్రోసైట్‌లో కనిపించిన వాచ్ సిల్హౌట్ కూడా లీకైన ఫోటోలోని డిజైన్‌తో సరిపోలుతోంది.
వాచ్ 4 ప్రోతో పోలిక..
ఒప్పో వాచ్ 5, ఒప్పో వాచ్ 4 ప్రోకు సక్సెసర్‌గా వస్తోంది. వాచ్ 4 ప్రో 2023 ఆగస్టు 29న చైనాలో విడుదలైంది. సిలికాన్ స్ట్రాప్ వేరియంట్ ధర 2,299 యువాన్లు (సుమారు రూ.33,000), లెదర్ స్ట్రాప్ వేరియంట్ ధర 2,499 యువాన్లు (సుమారు రూ.36,000).
వాచ్ 4 ప్రో ముఖ్య ఫీచర్లు..
1.91 అంగుళాల కర్వ్డ్ LTPO AMOLED డిస్‌ప్లే (378 x 496 పిక్సెల్స్). స్నాప్‌డ్రాగన్ W5 చిప్‌సెట్, హెంగ్‌షువాన్ 2700 చిప్. 2GB ర్యామ్, 32GB స్టోరేజ్.




