Instagram: పిల్లలు ఇన్‌స్టాలో ఏం చూస్తున్నారో తెలుసుకోవాలంటే పేరెంట్స్ ఐడీ ప్రూఫ్ ఇవ్వాల్సిం

Instagram: పిల్లల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను తల్లిదండ్రులు నేరుగా యాక్సెస్ చేయడం సాధ్యం కాదని మెటా స్పష్టం చేసింది. ప్రైవసీ చట్టాల కారణంగా పిల్లల అకౌంట్‌లో నేరుగా లాగిన్ కావడానికి కుదరదు.

CR Reddy
Published on: 1 Oct 2026 8:37 AM IST
Instagram
X

Instagram

Instagram: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌ను మీ పిల్లలు ఉపయోగిస్తుంటే, వారి ఆన్‌‌లైన్ యాక్టివిటీపై కన్నేయాలని తల్లిదండ్రులు భావించడం సహజం. అయితే టెక్ దిగ్గజం మెటా నిబంధనల ప్రకారం తల్లిదండ్రులు తమ టీనేజ్ పిల్లల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను నేరుగా యాక్సెస్ చేయడానికి అనుమతి లేదు. ప్రైవసీ చట్టాల ప్రకారం అకౌంట్ యజమాని కాకుండా వేరే ఎవరికీ దానిపై అనధికారిక ప్రవేశం కల్పించడం కుదరదు. ఇన్‌స్టాగ్రామ్‌లో 13 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న యూజర్లను ఆ అకౌంట్‌కు అసలు హక్కుదారులుగా పరిగణిస్తారు. అందువల్ల పేరెంట్స్ నేరుగా లాగిన్ అయ్యి పిల్లల పర్సనల్ మెసేజ్‌లు లేదా పూర్తి వివరాలు నేరుగా చూడలేరు.

సూపర్విజన్ టూల్ ద్వారా పర్యవేక్షణ

నేరుగా లాగిన్ అయ్యే అవకాశం లేకపోయినప్పటికీ, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న టీనేజ్ పిల్లల భద్రత కోసం మెటా సూపర్విజన్ అనే అద్భుతమైన టూల్‌ను అందుబాటులో ఉంచింది. ఈ ఫీచర్ సహాయంతో తల్లిదండ్రులు తమ పిల్లల అకౌంట్ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయో పరిశీలించవచ్చు. ఒకవేళ పిల్లలు అకౌంట్ భద్రతను తగ్గించే మార్పులు ఏదైనా చేయాలని చూస్తే, ఆ మార్పులను అంగీకరించడం లేదా తిరస్కరించే అధికారం తల్లిదండ్రులకు లభిస్తుంది. అయితే ఈ అదనపు సూపర్విజన్ సౌకర్యం అన్ని దేశాల్లో అందుబాటులో లేదు. ఫ్లోరిడా, కనెక్టికట్, టెక్సాస్, ప్యూర్టో రికో, ఇండోనేషియా, యూరోపియన్ యూనియన్, వియత్నాం, బ్రెజిల్ వంటి కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే ఈ ప్రత్యేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

గుర్తింపు కోసం ఐడీ వెరిఫికేషన్ తప్పనిసరి

సూపర్విజన్ ఫీచర్ సెటప్ చేయాలనుకునే తల్లిదండ్రులు ముందుగా తమ గుర్తింపును రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. సరైన ప్రభుత్వ గుర్తింపు కార్డు (ID) లేదా రెండు నాన్-గవర్నమెంట్ ఐడీలను సబ్మిట్ చేయడం ద్వారా పేరెంట్స్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఈ ఐడీ వెరిఫికేషన్ పూర్తవడానికి దాదాపు 48 గంటల సమయం పట్టవచ్చు. మెటా సంస్థ పేరెంట్స్ సమర్పించిన ఐడీలను అత్యంత సురక్షితంగా ఉంచుతుంది. వెరిఫికేషన్ పూర్తయిన 30 రోజుల లోపే ఆ డేటాను శాశ్వతంగా డిలీట్ చేస్తుంది. ఈ సమాచారాన్ని ప్రకటనలు చూపించడం లేదా ఇతర కమర్షియల్ అవసరాల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించబోమని కంపెనీ స్పష్టం చేసింది.

టీనేజ్ పిల్లల అంగీకారం కూడా కీలకం

తల్లిదండ్రుల ఐడీ వెరిఫికేషన్ ప్రక్రియ విజయవంతంగా ముగిసిన తర్వాత, వారు తమ టీనేజ్ పిల్లికి సూపర్విజన్ కోసం రిక్వెస్ట్ పంపవచ్చు. ఆ తర్వాత పిల్లలు తమ పేరెంట్స్ ఎవరో ఆ అప్లికేషన్‌లో కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పిల్లలు ఆ రిక్వెస్ట్‌ను తిరస్కరించినా లేదా 7 రోజుల పాటు ఎటువంటి స్పందన ఇవ్వకపోయినా, తల్లిదండ్రులు మళ్లీ ఇన్విటేషన్ పంపే అవకాశం ఉంటుంది. పిల్లి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోతే కొన్ని సందర్భాల్లో జనన ధ్రువీకరణ పత్రం వంటి అదనపు డాక్యుమెంట్లు సమర్పించాల్సి వస్తుంది. ఇలాంటి పద్ధతుల ద్వారా పిల్లల గోప్యతకు భంగం కలగకుండా వారి ఆన్‌లైన్ భద్రతను పర్యవేక్షించే సౌలభ్యాన్ని మెటా కల్పిస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.